సుబ్రతా రాయ్ కి జైలు తిండి, నేలపైనే నిద్ర!
సుబ్రతా రాయ్ కి జైలు తిండి, నేలపైనే నిద్ర!
Published Tue, Mar 4 2014 7:55 PM | Last Updated on Sat, Sep 2 2017 4:21 AM
న్యూఢిల్లీ: భోగభాగ్యాలు అనుభవించిన సహారా ఇండియా అధినేత సుబ్రతా రాయ్ వారం రోజులపాటు సాధారణ ఖైదీగా తీహార్ జైలులో గడుపనున్నారు. సుబ్రతాకు వారం రోజుల జుడిషియల్ కస్టడీని సుప్రీం కోర్టు విధించి తీహార్ జైలుకు పంపింది. తీహార్ జైలులో సాధారణ ఖైదీగా నేలపైనే పడుకుని.. జైలు అధికారులు ఇచ్చే ఆహారాన్ని సుబ్రతా రుచిచూడనున్నారు.
దేశంలోని అతిపెద్ద ఉద్యోగ సంస్థగా పెరున్న సహారా ఇండియా పరివార్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న సుబ్రతాకు ఇలాంటి పరిస్థితి రావడంపై పలువరు పలువిధాలు స్పందిస్తున్నారు.
ఇతర జైళ్లలో మాదిరిగా ఏ,బీ,సీ కేటగిరిల్లాంటి ప్రత్యేక క్లాస్ లు లేవని, కావున సుబ్రతాను సాధారణ ఖైదీగానే పరిగణిస్తామని తీహార్ జూలు అధికారి సునీల్ గుప్తా పీటిఐకి తెలిపారు. మాకు తీహార్, రోహిణి అనే రెండు కాంప్లెక్సులున్నాయని.. సుబ్రతాను తీహార్ జైలులో ఉంచామని అధికారుల తెలిపారు.
Advertisement