సుబ్రత రాయ్ కి మార్చి 4 వరకు పోలీస్ కస్టడీ!
సహారా ఇండియా అధినేత సుబ్రత రాయ్ ని మార్చి 4 తేది వరకు పోలీస్ కస్టడీకి తరలించారు. 4 తేదిన సుప్రీంకోర్టు విచారణ చేపట్టే రోజు వరకు సుబ్రత రాయ్ ను పోలీస్ కస్టడీకి తరలించాలని లక్నో చీఫ్ జుడిషియల్ మేజిస్ట్రేట్ ఆదేశించారు. సుబ్రత కేసును సుప్రీం కోర్టు మార్చి 4 తేదిన విచారణ చేపట్టనుంది. శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు సహారా అధినేత ను కోర్టు ఆవరణలోకి ప్రవేశించినా.. కోర్టు రూమ్ దూరంగానే ఉన్నారు.
తన క్లయింట్ చట్టాన్ని గౌరవించే, బాధ్యత కలిగిన పౌరుడు.. కోర్టు నుంచి పారిపోయే వ్యక్తి కాదని సుబ్రత తరపు న్యాయవాది కోర్టుకు విజ్క్షప్తి చేశారు. అయితే తమ కస్టడీలో ఉంచుకుంటారా లేదా సుబ్రత కు చెందిన బంగ్లాలో పెడుతారా అనే విషయాన్ని ఉత్తర ప్రదేశ్ పోలీసులు నిర్ణయించుకోవాలని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.