Sahara India
-
సహారాలో భారీగా ఇరుక్కున్న ఇన్వెస్టర్లు.. మొత్తం లక్ష కోట్లు పైనే!
Sahara Group-Sebi ప్రయివేట్ రంగ సంస్థ సహారా ఇండియా గ్రూప్‌నకు చెందిన వివిధ సంస్థలు, పథకాలలో దాదాపు 13 కోట్లమంది ఇన్వెస్టర్లు ఇరుక్కున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ పార్లమెంటులో వెల్లడించారు. ఈ మొత్తం సొమ్ము రూ. 1.12 లక్షల కోట్లుగా తెలియజేశారు. ఇందుకు సంబంధించి సుప్రీం కోర్టు ఆదేశాలు, జస్టిస్ బీఎన్ అగర్వాల్ సూచనలమేరకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ.. సొమ్మును తిరిగి చెల్లించేందుకు వీలుగా పలు ప్రకటనలు జారీ చేసింది. తద్వారా తమ సొమ్మును తిరిగి పొందేందుకు ఇన్వెస్టర్లకు వీలు కల్పించినట్లు మంత్రి రాతపూర్వక సమాధానంలో వివరించారు. తదుపరి 2021 అక్టోబర్‌లో సెబీ మధ్యంతర ఆదేశాల కోసం సుప్రీం కోర్టులో మరోసారి అప్లికేషన్‌ను దాఖలు చేసింది. ఇది ప్రస్తుతం కోర్టువద్ద పెండింగ్‌లో ఉన్నట్లు పంకజ్ తెలియజేశారు. సహారా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో రూ. 47,245 కోట్లు, సహారా ఇండియన్ రియల్టీ కార్పొరేషన్లో రూ. 19,401 కోట్లు, సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్లో రూ. 6,381 కోట్లు చొప్పున పెట్టుబడులు ఇరుక్కున్నట్లు వెల్లడించారు. ఇదేవిధంగా హమారా ఇండియా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో రూ. 12,958 కోట్లు, సహారాయన్ యూనివర్శల్ మల్టీపర్పస్ సొసైటీలో రూ. 18,000 కోట్లు, స్టార్స్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీలో రూ. 8,470 కోట్లు నిలిచిపోయినట్లు తెలియజేశారు. కాగా.. సహారా గ్రూప్ ‘సెబీ సహారా రిఫండ్’ ఖాతాలో అసలు రూ. 25,781 కోట్లకుగాను దాదాపు రూ. 15,507 కోట్లు డిపాజిట్ చేసినట్లు వెల్లడించారు. చదవండి: టెక్కీలకు గడ్డుకాలం, వరస్ట్ ఇయర్‌గా 2022 -
సహారా బ్యాంక్ ఖాతాల ‘డీఫ్రీజ్’కు సుముఖం
న్యూఢిల్లీ: మదుపరులకు డబ్బు పునఃచెల్లింపుల కేసులో సహారాకు సుప్రీంకోర్టు మరో అవకాశాన్ని కల్పించింది. గ్రూప్ చీఫ్ సుబ్రతారాయ్, మరో ఇరువురు డెరైక్టర్ల బెయిల్‌కు రూ.10,000 కోట్లు చెల్లించడానికి వీలుగా- అంతమొత్తాన్ని సమీకరించడానికి వెసులుబాటు కల్పించే రూలింగ్‌ను ఇవ్వడానికి సంసిద్ధత తెలిపింది. దీని ప్రకారం- ఈ కేసులో ఇప్పటికే ‘ఫ్రీజ్’ చేసిన గ్రూప్ అకౌంట్లలో కొన్నింటిని ‘డీఫ్రీజ్’ చేయడానికి ధర్మాసనం సుముఖతను వ్యక్తం చేసింది. ఇందుకుగాను సంబంధిత అకౌంట్ల వివరాలను అప్లికేషన్ రూపంలో సమర్పించాలని సూచించింది. అలాగే డబ్బు చెల్లింపులకుగాను ‘విక్రయించదలచిన’ ఆస్తుల వివరాలనూ తెలియజేయాలని సహారా గ్రూప్ సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్‌ను అడిగింది. వాడివేడి వాదనలు.. ఖాతాల స్తంభనసహా రాయ్, డెరైక్టర్లు జైలులో ఉండగా భారీ మొత్తంలో నిధుల సమీకరణ ఎలా సాధ్యమంటూ... అంతక్రితం సహారా న్యాయవాది చేసినవాడివేడి వాదనకు జస్టిస్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని బెంచ్ తీవ్రంగా స్పందించింది. ‘‘డీఫ్రీజ్ కోరుతున్న బ్యాంక్ అకౌంట్ నంబర్లు సమర్పించాలని మేము ఇప్పటికే సూచించాం. అయినా మీరు ఇప్పటికీ ఈ నంబర్లను సమర్పించలేదు. వాటిని సమర్పిస్తే... ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని మేము భావిస్తున్నాం’’ అని పేర్కొంది. సుదీర్ఘ సమయం వాదనల అనంతరం డీఫ్రీజ్ చేయాల్సిన అకౌంట్ల నంబర్లు, అలాగే ‘విక్రయించదలచిన’ ఆస్తుల వివరాలను సమర్పించడానికి సహారా న్యాయవాది అంగీకరించారు. కేసు తదుపరి విచారణ గురువారం జరగనుంది. నిబంధనలకు విరుద్ధంగా సహారా గ్రూప్ కంపెనీలు రెండు రూ.24,000 కోట్ల సమీకరణ, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వాటి పునఃచెల్లింపుల్లో వైఫల్యం వ్యవహారంలో... రాయ్, మరో ఇరువురు డెరైక్టర్లు మార్చి 4 నుంచీ జ్యుడీషియల్ కస్టడీలో (తీహార్ జైలులో) ఉన్నారు. -
రాయ్ విడుదలకు సహారా సిబ్బంది చొరవ
న్యూఢిల్లీ: జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న తమ గ్రూప్ చీఫ్ సుబ్రతారాయ్ విడుదలకు సహారా గ్రూప్ సిబ్బంది వినూత్న ఆఫర్‌ను తెరముందుకు తెస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీని ప్రకారం సహారా ఉద్యోగులు, శ్రేయోభిలాషుల నుంచీ కనీసం లక్షకు తక్కువకాకుండా... రూ.2 లక్షలు, రూ. 3 లక్షలు, ఇలా వారివారి సామర్థ్యాన్ని బట్టి డబ్బును సమీకరిస్తారు. కనీసం రూ.5,000 కోట్లు సమీకరించాలన్నది ఈ ప్రతిపాదన లక్ష్యం. గ్రూప్‌లో ఎంటర్టైన్మెంట్ నుంచి రిటైల్ బిజినెస్ వరకూ దాదాపు 11 లక్షల మంది వేతన, ఫీల్డ్ కార్మికులు పనిచేస్తున్నట్లు సహారా చెబుతోంది. ఇలా డబ్బు చెల్లించిన వారికి ప్రతిగా సహార్యన్ ఇ-మల్టీపర్పస్ సొసైటీ లిమిటెడ్‌లో షేర్లను కేటాయించడం జరుగుతుంది. ఒకపేజీ లెటర్‌పై గ్రూప్ ‘అనుబంధ’ సంస్థలు, సహార్యన్ సొసైటీ డెరైక్టర్లు ఈ మేరకు సంతకం చేస్తూ, సంబంధిత తోడ్పాటు ‘అభ్యర్థన’ చేసినట్లు సమాచారం. ఈ అంశంపై ఒక సీనియర్ సహారా అధికారిని వివరణ అడిగినప్పుడు ఆయన సమాధానం చెబుతూ, ‘సుబ్రతా రాయ్‌గానీ, లేదా యాజమాన్యం కానీ ఇందుకు సంబంధించి ఎటువంటి లేఖనూ జారీ చేయలేదు. ప్రస్తుత పరిస్థితికి ఆయా వ్యక్తుల నుంచి వచ్చిన భావోద్వేగ స్పందన మాత్రమే ఇది’ అని అన్నారు. సహారాశ్రీ(గ్రూప్‌లో రాయ్‌ని ఇలా పిలుస్తారు) సంస్థను ఒక పరివార్‌గా లేదా కుటుంబంగా నిర్మించారని, ఈ నేపథ్యంలో ఈ తరహా ప్రతిపాదన లేఖలు దేశంలోని పలు ప్రాంతాల నుంచి వస్తున్నాయని ఆయన తెలిపారు. మార్కెట్ నిబంధనలకు వ్యతిరేకంగా 2 గ్రూప్ కంపెనీలు మదుపరుల నుంచి రూ.25 వేల కోట్లు సమీకరించాయన్నది ఈ వ్యవహారంలో ప్రధాన అంశం. ఈ డబ్బు పునఃచెల్లింపుల్లో విఫలమవుతున్నందుకుగాను సుప్రీం ద్విసభ్య ధర్మాసనం ఆదేశాల మేరకు రాయ్‌సహా రెండు కంపెనీల డెరైక్టర్లు ఇరువురు మార్చి 4 నుంచీ తీహార్ జైలులో ఉన్నారు. వీరి తాత్కాలిక బెయిల్‌కుగాను రూ.5 వేల కోట్లను కోర్టుకు డిపాజిట్ చేయాలని, మరో రూ. 5వేల కోట్లు సెబీ పేరుతో బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలని ధర్మాసనం నిర్దేశించింది. ఇంత మొత్తం చెల్లించలేమని సహారా గురువారం ధర్మాసనానికి విన్నవించింది. ఇలాంటి రూలింగ్ తప్పని, రాయ్‌ని జైలులో ఉంచడం రాజ్యాంగ విరుద్ధమని గ్రూప్ దాఖలు చేసిన రిట్‌పై వాదనలు ఏప్రిల్ 3కు వాయిదా పడ్డాయి. -
'బయటపడే మార్గం మీ చేతుల్లోనే ఉంది'
న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతారాయ్ మరికొన్ని రోజుల పాటు తీహార్ జైలులో గడపనున్నారు. ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సెబీకి చెల్లించాల్సిన డబ్బు ఇచ్చేందుకు ముందుకొస్తే బెయిల్ ఇచ్చే అంశాన్ని మళ్లీ పరిశీలిస్తామని న్యాయస్థానం పేర్కొంది. 'మీరు బయటపడే మార్గం మీ చేతుల్లోనే ఉంది' అని కోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను ఈనెల 25కు వాయిదా వేసింది. తనను జైలుపాలు చేయడం తగదంటూ బుధవారం సహారా చీఫ్ సుబ్రతారాయ్ సుప్రీంకోర్టు ఎదుట హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్‌ను దాఖలు చేశారు. తద్వారా విచారణలో కొత్త అంకానికి తెరలేపారు. చీఫ్ జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని బెంచ్ ముందు రాయ్ తరఫు సీనియర్ న్యాయవాది రామ్ జెఠ్మలానీ తన వాదనలు వినిపిస్తూ... ఈ కేసు విషయంలో హెబియస్ కార్పస్ రిట్ పరిధి అంశాలు ఇమిడి ఉన్నాయని విన్నవించారు. మార్చి 4న ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వు రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొంటూ, రాయ్‌ని విడుదల చేయాల్సిన అవసరం ఉందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా సహారా గ్రూప్ సంస్థలు రెండు రూ.24,000 కోట్లు సమీకరించాయన్నది కేసులో ప్రధానాంశం. ఈ నిధులు పునఃచెల్లింపుల్లో విఫలం కావడంతో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ సహారాపై ధిక్కార పిటిషన్లను దాఖలు చేసింది. దాదాపు రెండేళ్ల సుదీర్ఘ విచారణ ప్రక్రియ అనంతరం సుప్రీం ఆదేశాల ప్రకారం సహారా చీఫ్ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. 3 రోజుల్లో రూ.2,500 కోట్లు చెల్లించడానికి సిద్ధమని సహారా గ్రూప్ చేసిన ప్రతిపాదనను బెంచ్ తిరస్కరించింది. -
సుబ్రతా రాయ్ కి జైలు తిండి, నేలపైనే నిద్ర!
న్యూఢిల్లీ: భోగభాగ్యాలు అనుభవించిన సహారా ఇండియా అధినేత సుబ్రతా రాయ్ వారం రోజులపాటు సాధారణ ఖైదీగా తీహార్ జైలులో గడుపనున్నారు. సుబ్రతాకు వారం రోజుల జుడిషియల్ కస్టడీని సుప్రీం కోర్టు విధించి తీహార్ జైలుకు పంపింది. తీహార్ జైలులో సాధారణ ఖైదీగా నేలపైనే పడుకుని.. జైలు అధికారులు ఇచ్చే ఆహారాన్ని సుబ్రతా రుచిచూడనున్నారు. దేశంలోని అతిపెద్ద ఉద్యోగ సంస్థగా పెరున్న సహారా ఇండియా పరివార్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న సుబ్రతాకు ఇలాంటి పరిస్థితి రావడంపై పలువరు పలువిధాలు స్పందిస్తున్నారు. ఇతర జైళ్లలో మాదిరిగా ఏ,బీ,సీ కేటగిరిల్లాంటి ప్రత్యేక క్లాస్ లు లేవని, కావున సుబ్రతాను సాధారణ ఖైదీగానే పరిగణిస్తామని తీహార్ జూలు అధికారి సునీల్ గుప్తా పీటిఐకి తెలిపారు. మాకు తీహార్, రోహిణి అనే రెండు కాంప్లెక్సులున్నాయని.. సుబ్రతాను తీహార్ జైలులో ఉంచామని అధికారుల తెలిపారు. -
సుబ్రత రాయ్ కి మార్చి 4 వరకు పోలీస్ కస్టడీ!
సహారా ఇండియా అధినేత సుబ్రత రాయ్ ని మార్చి 4 తేది వరకు పోలీస్ కస్టడీకి తరలించారు. 4 తేదిన సుప్రీంకోర్టు విచారణ చేపట్టే రోజు వరకు సుబ్రత రాయ్ ను పోలీస్ కస్టడీకి తరలించాలని లక్నో చీఫ్ జుడిషియల్ మేజిస్ట్రేట్ ఆదేశించారు. సుబ్రత కేసును సుప్రీం కోర్టు మార్చి 4 తేదిన విచారణ చేపట్టనుంది. శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు సహారా అధినేత ను కోర్టు ఆవరణలోకి ప్రవేశించినా.. కోర్టు రూమ్ దూరంగానే ఉన్నారు. తన క్లయింట్ చట్టాన్ని గౌరవించే, బాధ్యత కలిగిన పౌరుడు.. కోర్టు నుంచి పారిపోయే వ్యక్తి కాదని సుబ్రత తరపు న్యాయవాది కోర్టుకు విజ్క్షప్తి చేశారు. అయితే తమ కస్టడీలో ఉంచుకుంటారా లేదా సుబ్రత కు చెందిన బంగ్లాలో పెడుతారా అనే విషయాన్ని ఉత్తర ప్రదేశ్ పోలీసులు నిర్ణయించుకోవాలని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. -
ఆ సొమ్మెక్కడిదో చెప్పాల్సిందే
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లకు తిరిగిచ్చేశావుని చెబుతున్న రూ.22,885 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పకపోతే సీబీఐ, కంపెనీల రిజిస్ట్రార్ దర్యాప్తునకు సిద్ధం కావాల్సిందేనని సహారా గ్రూప్‌ను సుప్రీం కోర్టు గురువారం హెచ్చరించింది. సొవుు్మ ఎక్కడినుంచి వచ్చిందో వెల్లడించడానికి నిరాకరించిన సహారా చీఫ్ సుబ్రతా రాయ్‌తో పాటు గ్రూప్‌ను తీవ్రస్థారుులో వుందలించింది. తవు ఉత్తర్వుల ఉల్లంఘనలపై చర్యలు తీసుకోకుండా ఉండడానికి తావుు నిస్సహాయుులం కాదని స్పష్టం చేసింది. దేశం విడిచి వెళ్లవద్దంటూ సుబ్రతా రాయ్‌కు జారీ చేసిన ఆదేశాలు కొనసాగుతాయుని పేర్కొంది. ‘న్యాయుస్థానం నిస్సహాయుురాలని భావించవద్దు. ఆ డబ్బు ఎక్కడినుంచి వచ్చిందో మీరు చెప్పకపోతే మేం కనుగొనగలం. మీపై సీబీఐ, కంపెనీల రిజిస్ట్రార్ల దర్యాప్తునకు మేం ఆదేశించగలం. మీరు సొవుు్మను వాపసు చేశారంటే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న రికార్డులు మీవద్ద ఉండితీరాలి’ అని జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్, జేఎస్ ఖేహార్‌లతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. సొవుు్మ ఎక్కడినుంచి వచ్చిందన్న విషయుం అసంగతవుని సెబీకి సహారా గ్రూప్ లేఖ రాయుడంపై కోర్టు అసంతృప్తి వెలిబుచ్చింది. సుబ్రతా రాయ్‌తో పాటు కంపెనీ వ్యవహారశైలి జుగుప్సాకరంగా ఉందని వ్యాఖ్యానించింది. ఈ కేసులో వేలాది కోట్ల రూపాయులు వుుడిపడి ఉన్నాయుని పేర్కొంటూ, రిజిస్టరైన కంపెనీలు అకౌంట్లను నిర్వహించకుండా ఎలా ఉండగలుగుతున్నాయుని ప్రశ్నించింది. గత రెండేళ్లుగా వాస్తవం చెప్పలేకపోయూరంటూ ఆగ్రహం వెలిబుచ్చింది. మీరు తప్పు చేసి ఉంటే మేమేం చేయులేం... అని కోర్టు స్పష్టం చేసింది. -
మమ్మల్ని తేలిగ్గా తీసుకోవద్దు
న్యూఢిల్లీ: నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి సహారా గ్రూప్‌కు చెందిన రెండు సంస్థలు దాదాపు రూ.24 వేల కోట్ల నిధులు సమీకరించిన కేసులో మరోసారి ఆ గ్రూప్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చింది. ఇన్వెస్టర్లకు తిరిగి డబ్బు చెల్లించే విషయంలో చర్యలు తీసుకుంటున్న సెబీని సర్కారీ గూండాగా పేర్కొనడాన్ని, ఆ మేరకు పత్రికా ప్రకటనలు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. ఇలాంటి ప్రకటనలు ఇచ్చిన పత్రికల్లోనే తిరిగి సెబీని క్షమాపణలు కోరుతూ ప్రకటనలు ఇవ్వాలని ఆదేశించింది. తమను తేలిగ్గా తీసుకోవద్దని జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్, జస్టిస్ జేఎస్ ఖేహార్‌లతో కూడిన ధర్మాసనం హెచ్చరించింది. జరిగినదానికి గ్రూప్ తరఫు న్యాయవాది తక్షణం క్షమాపణలు తెలిపారు. ఇన్వెస్టర్లకు నిధులు తిరిగి చెల్లించడానికి సంబంధించి సెబీకి రూ.20,000 కోట్ల విలువైన 71 ఆస్తుల డాక్యుమెంట్లను అప్పగించినట్లు పేర్కొంది. అయితే సహారా చీఫ్ సుబ్రతా రాయ్ విదేశీ పర్యటనకు అనుమతించాలన్న వాదనను తిరస్కరించింది. డాక్యుమెంట్ల పరిశీలనకు సెబీకి గడువిచ్చిన సుప్రీంకోర్టు, కేసు తదుపరి విచారణను జనవరి 9కి వాయిదా వేసింది.