prison inmate death
-
జైలుపై డ్రగ్స్ ముఠా కాల్పులు..10 మంది పోలీసులు మృతి!
మెక్సికన్ సిటీ: సరిహద్దు జైలుపై దుండగులు ఆయుధాలతో విరుచుకుపడి జరిపిన కాల్పుల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ సంఘటన మెక్సికోలోని జుయారెజ్ నగరంలో ఆదివారం జరిగింది. మృతుల్లో 10 మంది భద్రతా సిబ్బంది కాగా.. నలుగురు ఖైదీలు ఉన్నట్లు మెక్సిన్ అధికారులు తెలిపారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారని, 24 మంది తప్పించుకోగలిగారని వెల్లడించారు. ఈ దారుణానికి ఒడిగట్టింది డ్రగ్స్ ముఠాగా అనుమానిస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 7 గంటలకు ఆయుధాలతో వచ్చిన దుండగులు జైలుపై కాల్పులు జరిపారు. సమచారం అందుకున్న బలగాలు హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిస్థితులను తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. అయితే, ఈ దాడికి పాల్పడింది ఎవరనే విషయంపై స్పష్టత లేదని వెల్లడించారు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు మెక్సికో సరిహద్దు జైళ్లలో జరిగాయి. పలు కారాగారాల వద్ద భద్రత తక్కువ గా ఉండటం వల్లే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. డ్రగ్స్ ముఠాల సభ్యులు ఖైదీలుగా ఉండటం వల్ల వారి మధ్య ప్రతీకార దాడులే ప్రధానంగా జరుగుతున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: పట్టాలు తప్పిన ముంబై-జోధ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ -
తీహార్ జైల్లో ఖైదీ హత్య
న్యూఢిల్లీ: అత్యంత కట్టుదిట్టమైన తీహార్ జైల్లో ఖైదీల మధ్య ఘర్షణ, హత్యలు ఆందోళన కలిగిస్తోంది. అండర్ ట్రయల్ ఖైదీని తోటి ఖైదీని హత్య చేసిన సంఘటన కలకలం రేపింది. హై సెక్యూరిటీ వుండే జైలు నెం.8 లో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. సెల్లో ఉండగానే దీపక్ (29) పై నలుగురు ఖైదీలు దాడి చేసి దారుణంగా కొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. హత్య, దొంగతనం లాంటి కేసుల్లో దోషిగా తేలిన దీపక్ 2008 సం.రం నుంచి తీహార్ జైల్లో అండర్ ట్రయిల్ ఖైదీగా ఉంటున్నాడు కిటికీ ఊచలను మారణాయుధాలు మలుచుకున్న ఖైదీలు పథకం ప్రకారం దాడికి తెగబడినట్టు తెలుస్తోంది. మన్‌ప్రీత్, జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్న సత్పాల్ సహా మరో ఇద్దరికి ఈ కేసులో సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు. నిందితుల్లో ఒకడైన మన్‌ప్రీత్ గతంలో ఒక ఖైదీని హత్య చేసినట్టుగా జైలు పీఆర్వో ప్రసాద్ తెలిపారు. వీరు తరచూ జైలు నిబంధనలను అతిక్రమిస్తూ గొడవలకు దిగేవారని చెప్పారు. ఈ నేపథ్యంలో వారిపై అనేక క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని వెల్లడించారు. ఈ సంఘటనపై హరినగర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదుచేశాన్నారు