ధర్మవరం: వడదెబ్బకు శనివారం మరో నలుగురు మరణించారు. ధర్మవరం మండలం తుమ్మలలో లక్ష్మమ్మ(76) వడదెబ్బకు గురై మతి చెందినట్లు బంధువులు తెలిపారు. పొలం వద్దకు వెళ్లిన ఆమె ఇంటికి తిరిగొచ్చిన కాసేపటికే ఒంట్లో నలతగా ఉందంటూ నిద్రపోయినట్లు వివరించారు. ఆ తరువాత నిద్ర లేపినా ప్రయోజనం లేదని, నిద్రలోనే ఆమె ప్రాణం విడిచినట్లు కన్నీరుమున్నీరయ్యారు. మతురాలికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
మేడాపురంలో మరొకరు..
చెన్నేకొత్తపల్లి(రాప్తాడు) : చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురంలో గంగప్ప(65) అనే కూలీ వడదెబ్బతో మతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గురువారం కూలి పనికి వెళ్లిన ఆయన అస్వస్థతకు గురయ్యాడన్నారు. కుటుంబ సభ్యులు వైద్యం కోసం అనంతపురం తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మతి చెందినట్లు వివరించారు. మతునికి ఇద్దరు కుమార్తెలు, కుమారులు ఉన్నారు.
యలగలవంక తండాలో ఇంకొకరు..
బెళుగుప్ప(ఉరవకొండ) : బెళుగుప్ప మండలం యలగలవంక తండాలో రామచంద్రానాయక్(56) వడదెబ్బతో మరణించినట్లు బంధువులు తెలిపారు. కుటుంబ సభ్యులతో కలసి ఉపాధి పనులకు వెళ్లిన అతను శుక్రవారం నీరసంతో ఇంటికి వచ్చాడన్నారు. ఆ తరువాత వాంతులు చేసుకుంటూ మరింత నీరసించి పోయాడని వివరించారు. శనివారం ఉదయం స్పహ కోల్పోవడంతో వెంటనే 108కు సమాచారం తెలిపారు. అదొచ్చేలోగానే అతను మతి చెందినట్లు తెలిపారు. మతునికి భార్య దేవీబాయి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
పిల్లలపల్లిలో బేల్దారి..
బ్రహ్మసముద్రం(కళ్యాణదుర్గం) : బ్రహ్మసముద్రం మండలం పిల్లలపల్లిలో రామకష్ణ(38) అనే బేల్దారి వడదెబ్బతో మరణించినట్లు స్థానికులు తెలిపారు. ఇంటి నిర్మాణ పనుల కోసం స్వగ్రామం నుంచి రాయలప్పదొడ్డి గ్రామానికి వెళ్లిన అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో పని చేయడంతో ఒక్కసారిగా కళ్లు తిరిగి కుప్పకూలి అక్కడికక్కడే మతి చెందినట్లు వివరించారు. విషయం తెలుసుకున్న వైద్యాధికారిణి డాక్టర్ నాగస్వరూప, తహసీల్దార్ సుబ్రమణ్యం, ఏఎస్‌ఐ వెంకటేశులు, ఆర్‌ఐ విజయకుమార్, వీఆర్‌ఓ తిప్పేస్వామి ఘటన స్థలానికి చేరుకున్నారు. మతదేహాన్ని సందర్శించారు. వివరాలడిగి తెలుసుకున్నారు. మతునికి భార్య వరలక్ష్మీ, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.