రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. వడదెబ్బ కారణంగా ఆదివారం రాష్ట్రంలోని వేర్వేరుచోట్ల ఐదుగురు మృతి చెందారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని అయిలాపూర్ గ్రామానికి చెందిన కుముటం శాంతి కుమార్(42), ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహ స్వామి దేవస్థాన అటెండర్ వావిలాల చంద్రయ్య (52), రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలోని మర్రిపల్లి గ్రామానికి చెందిన గడప లక్ష్మణ్ (63) మృతి చెందిన వారిలో ఉన్నారు.