కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రెండు లోక్‌సభ, పది శాసనసభ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ఘట్టం బుధవారం ముగిసింది. ఈనెల 2వ తేదీన ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ రెండు మూడు రోజులు మందకొడిగా సాగింది. అనంతరం పుంజుకుంది. ఇక చివరి రోజైన బుధవారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలకు మొత్తం 30 నామినేషన్లు దాఖలు కాగా, ఇందులో ఆదిలాబాద్ లోక్‌సభ స్థానానికి 14, పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి 16 నామినేషన్లు వచ్చాయి. చివరి రోజైన బుధవారం ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి ఏడు నామినేషన్లు వచ్చాయి.
టీఆర్‌ఎస్ నుంచి గోడం నగేష్, కాంగ్రెస్ నుంచి నరేష్ జాదవ్, టీడీపీ నుంచి రాథోడ్ రమేష్ తరఫున ఆయన భార్య సుమన్ రాథోడ్, బీఎస్పీ నుంచి సదాశివ్‌నాయక్, స్వ తంత్ర అభ్యర్థులు బంక సహదేవ్, పవర్ కిషన్, రాథో డ్ శ్యామ్‌రావులు లోక్‌సభ స్థానాలకు నామినేషన్లు వే శారు. ఈ స్థానాలకు ఒక్కో అభ్యర్థి మూడు సెట్ల చొ ప్పున దాఖలు చేశారు. గురువారం నామినేషన్లను అ ధికారులు పరిశీలించనున్నారు. 12న నామినేషన్ల ఉప సంహరణ ఉంటుంది. ఈనెల 30న ఎన్నికలు నిర్వ హించి మే 16న ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇక జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు మొత్తం 307నామినేషన్లు వచ్చాయి.
ఒక్కో అభ్యర్థి నాలుగైదు సెట్ల చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గానికి 25, బెల్లంపల్లికి 45, ఖానాపూర్‌కు 34, ఆసిఫాబాద్‌కి 21, ముథోల్‌కు 19, మంచిర్యాలకు46, సిర్పూర్‌కు40, నిర్మల్‌కు25, చెన్నూర్‌కు41, బోథ్‌కు 11 చొప్పున నామినేషన్లు వచ్చాయి. అత్యధికంగా మంచిర్యాల నుంచి.. అత్యల్పంగా బోథ్ నుంచి నామినేషన్లు దాఖలు అయ్యాయి.
పత్రం సమర్పయామి
Published Thu, Apr 10 2014 12:40 AM | Last Updated on Sat, Sep 2 2017 5:48 AM
Advertisement
Advertisement