న్యూఢిల్లీ: పాక్ అక్రమిత కశ్మీర్‌లో భారత్ వైమానిక దళం జరిపిన ముప్పేట దాడి అనంతరం కేంద్రం నిఘా సంస్థలు దేశవ్యాప్తంగా హై అలర్ట్‌ను ప్రకటించాయి. ఉగ్రవాదుల టార్గెట్‌లో ఉన్న అన్ని ప్రధాన నగరాల్లో అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ బ్యూరో ఆదేశాలు జారీచేసింది. మంగళవారం జైషే మహమ్మద్ స్థావరాలపై మెరుపు దాడులు జరిగిన నేపథ్యంలో ఉగ్రమూకలు విరుచుకుపడే అవకాశం ఉందని నిఘూ సంస్థలు రాష్ట్రాలకు సూచించాయి. ఈ మేరకు సెంట్రల్ ఐబీ నుంచి అన్ని రాష్ట్రాల డీజేపీలకు వర్తమానం అందింది. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా సంఘ విద్రోహ శక్తుల నుంచి ముప్పు పొంచి ఉందని.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment