కోల్కతా ఓడరేవుపై అల్ కాయిదా ఉగ్రవాదులు దాడి చేయొచ్చని నిఘా విభాగం హెచ్చరించింది. సముద్ర మార్గం ద్వారా ఉగ్రవాదులు కోల్కతా చేరుకోవచ్చని ఐబీ తెలిపింది. కోల్కతాకు 'హై ఎలర్ట్' ప్రకటించింది. గతంలో ముంబై దాడులు చేసినప్పుడు కూడా ఉగ్రవాదులు సముద్రమార్గంలోనే భారత భూభాగం మీదకు ప్రవేశించిన విషయాన్ని భద్రతారంగ నిపుణులు గుర్తుచేస్తున్నారు.
ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వీలుగా మన దేశానికి చెందిన రెండు ప్రధాన యుద్ధనౌకలు ఐఎన్ఎస్ పృథ్వి, ఐఎన్ఎస్ సుమిత్రలను వెంటనే సముద్రంలోకి పంపారు. ప్రస్తుతం నేవీ ఉత్సవాలు జరుగుతున్నందున ఈ రెండింటినీ తీరంలో ఉంచారు. కానీ.. ఐబీ హెచ్చరికల నేపథ్యంలో వీటిని సముద్రంలోకి పంపారు. రక్షణ మంత్రి కూడా దీనిపై మాట్లాడారు. అనుకోని పరిస్థితుల్లోనే వీటిని పంపామని అన్నారు.
మరోవైపు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కూడా భద్రతను పెంచింది. వెంటనే అప్రమత్తమై.. ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. కోస్ట్ గార్డ్, సీఐఎస్ఎఫ్ బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశాలు జారీచేశారు. అల్ కాయిదా దాడులు చేసే ప్రమాదం ఉందంటూ కొన్ని రోజులుగా కథనాలు వస్తున్నాయి. తాజాగా ఐబీ విడుదల చేసిన 'హై ఎలర్ట్'లో అల్ కాయిదా పేరు లేకపోయినా.. ఉగ్రవాదులు రావచ్చని మాత్రం చెప్పారు. దీంతో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు.
ఉగ్రవాదులు వస్తున్నారు.. జాగ్రత్త!!
Published Tue, Nov 4 2014 6:36 PM | Last Updated on Fri, Aug 17 2018 7:36 PM
Advertisement
Advertisement