
ఎఫ్డీఐ సమాచారం రా, ఐబీలతో పంచుకోనున్న ఆర్బీఐ
న్యూఢిల్లీ: నల్లధనం నిరోధానికి ప్రభుత్వం మరో చర్య తీసుకుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ)లకు సంబంధించిన సమాచారాన్ని ఐబీ(ఇంటెలిజెన్స్ బ్యూరో), రా(రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్) వంటి నిఘా సంస్థలతో రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) పంచుకోనున్నది. ఆర్థిక నేరాల నిరోధం ప్రధానాంశంగా ఇటీవల రెవెన్యూ కార్యదర్శి అధ్యక్షతన జరిగిన ఒక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని కేబినెట్ సెక్రటేరియట్‌లో పనిచేసే ఉన్నతాధికారొకరు చెప్పారు. ట్యాక్స్ హెవెన్స్ దేశాల్లోని కంపెనీల నుంచి సొమ్ములు మన దేశ కంపెనీల్లోకి వస్తున్నాయని ‘రా’ ఆందోళన వ్యక్తం చేయడమే దీనికి కారణమని పేర్కొన్నారు. ఈ కంపెనీల నుంచి ఏ కంపెనీలకు నిధులు వస్తున్నాయి. వాటి మూలాలు వంటి సమాచారం కీలకమని ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు పట్టుబట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు.