స్వచ్ఛమైన గాలి కోసం కొత్త యాప్..!
వాతావరణ కాలుష్యం ఇప్పుడు ప్రపంచాన్నే ఇబ్బంది పెడుతున్న పెద్ద సమస్య. అందులోనూ, పీల్చే గాలి, తాగే నీరు పొల్యూట్ అయిపోవడం జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది.
అందుకే లండన్ సైంటిస్లులు గాలిపీల్చేముందు జనం కాస్త జాగ్రత్త పడేందుకు ఓ కొత్త యాప్ ను సృష్టించారు. యాండ్రాయిడ్ ఫోన్లు వాడకంలోకి వచ్చిన తర్వాత ప్రతి విషయం యాప్ తోనే సాధ్యమనుకున్న పరిశోధకులు... లండన్ ప్రజలను పొల్యూషన్ నుంచి కాపాడేందుకు యాప్ ద్వారా అలర్డ్ చేస్తున్నారు.
ఫ్రెంచ్ వినియోగదారుల కోసం 'ఫ్లూమ్ ఎయిర్ రిపోర్ట్' పేరున ప్రారంభించిన యాప్ ను ఇప్పుడు లండన్ లోని సుమారు మూడు వేలమంది డౌన్ లోడ్ చేసుకుని వాడుతున్నారు. లండన్ లో బయటకు వెళ్ళాల్సి వచ్చినపుడు వాతావరణంలో పరిశుభ్రమైన గాలి ఉందా లేదా అని ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చునట. అధిక కాలుష్యం ఉన్న పారిస్ వాసులకు ఇది ఎంతో ఉపయోగపడుతోందట.
ఫ్లూమ్ ఎయిర్ రిపోర్ట్... సెన్సర్ల ద్వారా లండన్ చుట్టు పక్కల ప్రాంతాల్లోని వాతావరణంలోని కాలుష్యాన్నిప్రతి గంటకు రికార్డు చేస్తుంది. సుమారు 30 దేశాల్లో, 11 వేల స్టేషన్లద్వారా , నైట్రోజెన్ డయాక్పైడ్, ఓజోన్, కార్బన్ మోనాక్పైడ్ వంటి గాలిలోని పలు కలుషితాలను ఇది పరీక్షిస్తుంది. ఎవరైనా ముందుగానే పొల్యూషన్ లేని సమయాలను నిర్థారించుకోవచ్చంటూ యాప్ ప్రయోజనాలను యాప్.. స్థాపకుడు రొమైన్ లాన్ కొంబే చెప్తున్నారు.
లండన్ రాజధాని పారిస్ లో వాతావరణ కాలుష్యం కారణంగా అక్కడ నివసించే ప్రజల జీవిత కాలం తగ్గిపోతోందని కింగ్స్ కాలేజ్ అధ్యయనాల్లో వెల్లడైంది. కాలుష్యం ఫలితంగా సంవత్సరంలో సుమారు 9,400 మంది మరణిస్తున్నారని అధ్యయనాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా డీజిల్ వాహనాలవల్ల 40 శాతం వాయు కాలుష్యం ఏర్పడటం పెద్ద సమస్యగా మారింది. ఈ పరిస్థితుల్లో ఈ కొత్త యాప్ లండన్ ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని యాప్ స్థాపకుడు చెప్తున్నారు.