
మహారాష్ట్రలోని పూణె రైల్వే స్టేషన్‌లో కలకలం చెలరేగింది. చెన్నై నుంచి పుణెకు వస్తున్న భారత్ గౌరవ్ రైలులో 40 మంది ప్రయాణికుల ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. రైలు పూణె చేరుకోగానే ప్రయాణికులకు వైద్య చికిత్స అందించారు. వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
రైలు పూణే చేరుకోగానే 80 మంది ప్రయాణికుల అనారోగ్యానికి గురైనట్లు తమకు ఫిర్యాదు అందిందని పూణే రైల్వే అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఆ తర్వాత వారికి రైల్వేస్టేషన్‌లోనే ప్రథమ చికిత్స అందించి, ఆ తరువాత బాధితులను ససూన్ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం రైలులో ఉన్న కొందరు యువకులు రైలులోనివారికి కలుషిత ఆహారం ఇచ్చారు. రైల్వేశాఖ ఈ ఘటనపై విచారణ జరుపుతోంది.
ఇది కూడా చదవండి: ఆ 17 రోజులు ఎలా గడిచాయంటే..
Bharat Gaurav Train Food Poisoning: 40 Passengers Fall Sick After Eating Food on Chennai-Pune Train (Watch Video)#BharatGauravTrain #FoodPoisoning #ChennaiPuneTrain #ViralVideo #Chennai #Punehttps://t.co/0Y63ZBmPVL
— LatestLY (@latestly) November 29, 2023