ఆ రైలులోని ప్రయాణికులు వెజ్ ఆర్డర్ చేశారు. అయితే వారికి నాన్ వెజ్ సర్వ్ అయ్యింది. దీంతోవారు క్యాటరింగ్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దానికి వారు ఇచ్చిన సమాధానం విని కంగుతినడం ప్రయాణికుల వంతయ్యింది.
గతిమాన్ ఎక్స్‌ప్రెస్‌లో వీరాంగన లక్ష్మీబాయి రైల్వేస్టేషన్(జాన్సీ, ఉత్తరప్రదేశ్) నుంచి హజ్రత్ నిజాముద్దీన్‌కు వెళుతున్న ప్రయాణికులకు అందించిన వెజ్ ఆహారంలో మాంసపు ముక్క రావడంతో కలకలం చెలరేగింది. ఈ ఘటన శనివారం గతిమాన్ ఎక్స్‌ప్రెస్(12049)లో చోటుచేసుకుంది. ప్రయాణికులలో ఒకరైన రాజేష్ కుమార్ తివారి తన భార్య ప్రీతి తివారితో పాటు కోచ్ నం.సీ7లో ప్రయాణిస్తున్నారు.
రైలు జాన్సీ దాటిన తరువాత క్యాటరింగ్ స్టాప్ తివారితో.. ‘మీరు ఛోలే-కుల్ఛే తింటారా లేక పాస్తా తింటారా’ అని అడిగారు. దీనికి మనోజ్ తివారి తమకు ఛోలె-కుల్ఛే కావాలని అడిగారు. తరువాత వారికి వారు కోరిన ఆహారం అందించారు. లంచ్ చేసే సమయంలో రాజేష్ తివారి తమకు అందించిన ఆహారంలో మాంసపు ముక్క ఉండటాన్ని గమనించారు. వెంటనే ఈ విషయాన్ని కేటరింగ్ స్టాఫ్‌కు తెలియజేశారు.
తనకు ఎదురైన అనుభవం గురించి రాజేష్ తివారి మీడియాతో మాట్లాడుతూ తాను ఆహారంలో మాంసం వచ్చిన విషయాన్ని అక్కడికి స్టాఫ్‌కు తెలియజేయగా వారు తమ సూపర్‌వైజర్‌ను పిలిచారన్నారు. ఆయన ఆ ఆహారాన్ని గమనించి, మాంసం ఉన్న సంగతిని అంగీకరించారన్నారు. అయితే ఈ ఆహారం తాము ప్యాక్ చేయలేదన్నారు. ఆహారం కిచెన్ నుంచి ప్యాక్ అయి వస్తుందని, తాము కేవలం సర్వ్ చేస్తామని సమాధానమిచ్చారన్నారు.
ఇదే రైలులో గ్వాలియర్ నుంచి ఢిల్లీ వెళుతున్న ప్రయాణికురాలు కృతికా మోదీ మాట్లాడుతూ తాను ఆహారంలో ఛోలె-కుల్ఛే ఆర్డర్ చేయగా, తనకు పాస్తా ఇచ్చారని ఆరోపించారు. మరోమార్గం లేక దానినే తినవలసి వచ్చిందని ఆమె తెలిపారు. దానిలో చికెన్ ఉన్న విషయాన్ని గమనించానని అన్నారు. తాను దీనిపై రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: ఆన్‌లైన్ ఆర్డర్లలో ఈ ఆర్డర్ వేరయా!
Comments
Please login to add a commentAdd a comment