Bharat Gaurav tourist train
-
రైలులో కలుషిత ఆహారం.. 40 మందికి అనారోగ్యం
మహారాష్ట్రలోని పూణె రైల్వే స్టేషన్లో కలకలం చెలరేగింది. చెన్నై నుంచి పుణెకు వస్తున్న భారత్ గౌరవ్ రైలులో 40 మంది ప్రయాణికుల ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. రైలు పూణె చేరుకోగానే ప్రయాణికులకు వైద్య చికిత్స అందించారు. వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. రైలు పూణే చేరుకోగానే 80 మంది ప్రయాణికుల అనారోగ్యానికి గురైనట్లు తమకు ఫిర్యాదు అందిందని పూణే రైల్వే అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఆ తర్వాత వారికి రైల్వేస్టేషన్లోనే ప్రథమ చికిత్స అందించి, ఆ తరువాత బాధితులను ససూన్ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం రైలులో ఉన్న కొందరు యువకులు రైలులోనివారికి కలుషిత ఆహారం ఇచ్చారు. రైల్వేశాఖ ఈ ఘటనపై విచారణ జరుపుతోంది. ఇది కూడా చదవండి: ఆ 17 రోజులు ఎలా గడిచాయంటే.. Bharat Gaurav Train Food Poisoning: 40 Passengers Fall Sick After Eating Food on Chennai-Pune Train (Watch Video)#BharatGauravTrain #FoodPoisoning #ChennaiPuneTrain #ViralVideo #Chennai #Punehttps://t.co/0Y63ZBmPVL — LatestLY (@latestly) November 29, 2023 -
ప్రత్యేక రైళ్లకు భారీ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: రైళ్లలో వేసవి రద్దీ పెరిగింది. పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలకు జనం పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ నుంచి వివిధ మార్గాల్లో నడిచే రైళ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినప్పటికీ అవి ప్రయాణికుల డిమాండ్‌ను భర్తీ చేయలేకపోతున్నాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా జూన్ నెలాఖరు వరకు అందుబాటులో ఉండేవిధంగా వివిధ రూట్లలో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ఆ రైళ్లలోనూ వెయిటింగ్ లిస్టు వందల్లోకి చేరడం గమనార్హం. హైదరాబాద్ నుంచి కటక్, బికనేర్, రెక్సాల్, పట్నా తదితర ప్రాంతాలకు ప్రయాణికుల డిమాండ్ మేరకు అదనపు రైళ్లు అందుబాటులో లేకపోవడంతో జనం పడిగాపులు కాయాల్సి వస్తుంది. సాధారణంగా ప్రతి రోజు సుమారు 80 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, మరో 100 వరకు ప్యాసింజర్ రైళ్లు సికింద్రాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తాయి. ఈ స్టేషన్ నుంచి రోజుకు 1.85 లక్షల మంది ప్రయాణంచేస్తారు. మరో 60 వేల మంది వరకు కాచిగూడ, నాంపల్లి, లింగంపల్లి తదితర స్టేషన్ల నుంచి ప్రయాణిస్తారు. వేసవి సందర్భంగా గత నెల రోజులుగా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ స్టేషన్లనుంచి సుమారు 3 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నట్లు అంచనా. సొంత ఊళ్లకు వెళ్లేవారికంటే ఆధ్యాత్మీక, పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్యే ఎక్కువగా ఉందని సమాచారం. దీంతో తిరుపతి, విశాఖ, ముంబై, షిరిడీ, ఢిల్లీ, వారణాసి, జైపూర్, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై తదితర నగరాలకు తాకిడి పెరిగింది.గతంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 50 నుంచి 70 ప్రత్యేక రైళ్లను నడిపితే ఇప్పుడు వాటి సంఖ్య సగానికిపైగా తగ్గడం గమనార్హం. అన్ని సదుపాయాలతో భారత్ గౌరవ్ రైళ్లు ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న భారత్ గౌరవ్ పర్యాటక రైళ్లలో వందశాతం ఆక్యుపెన్సీ నమోదు కావడం గమనార్హం. ఈ వేసవి సీజన్లో సికింద్రాబాద్ నుంచి ఇప్పటి వరకు 8 రైళ్లు బయలుదేరాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన యాత్రికులు ఉత్తర, తూర్పు ప్రాంతాల్లోని ఆధ్యాత్మీక క్షేత్రాలను సందర్శించేందుకు ఈ రైళ్లలో వెళుతున్నారు. ‘పూరీ– కాశి– అయోధ్య‘పేరుతో ఐఆర్సీటీసీ ఇటీవల భారత్ గౌరవ్ రైలును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ రైలులో ప్రయాణించే వారికి ఐఆర్‌సీటీసీయే అన్ని రకాల సేవలను అందజేస్తోంది. ఈ పర్యటనలో రైలు ప్రయాణంతో పాటు రోడ్డు రవాణా, వసతి, భోజనం తదితర అన్ని ఏర్పాట్లు ఉంటాయి. రైలులో సీసీ కెమెరాలతో భద్రతను ఏర్పాటు చేశారు. ఈ ప్యాకేజీలో పూరీ జగన్నాథ ఆలయం, కోణార్క్ సూర్య దేవాలయం, గయా విష్ణు పాద ఆలయం, వారణాసి కాశీ విశ్వనాథ ఆలయం, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణ దేవాలయం, అయోధ్య రామజన్మ భూమి, ప్రయాగ్ రాజ్ తదితర ప్రాంతాలను సందర్శించ వచ్చు.8 రాత్రులు, 9 పగళ్లు ఈ పర్యటన కొనసాగుతుంది. ఈ ట్రైన్లో ఏసీ, నాన్ ఏసీ కోచ్‌లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని 9 ప్రధాన స్టేషన్లలో హాల్టింగ్ సదుపాయం ఉంది. ఇప్పటి వరకు నడిచిన 8 ట్రిప్పుల్లో రైలులోని మొత్తం 700 సీట్లు రిజర్వ్ కావడం విశేషం. -
పర్యాటకానికి తలమానికం భారత్ గౌరవ్ రైళ్లు
అడ్డగుట్ట (హైదరాబాద్): భారత్ గౌరవ్ రైళ్లు దేశంలో పర్యాటక రంగానికి తలమానికంగా నిలుస్తున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని 10వ ప్లాట్‌ఫాంలో ‘గంగా పుష్కరాల యాత్ర’(పూరీ, కాశీ, అయోధ్య) భారత్ గౌరవ్ ప ర్యాటక రైలును దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జై న్, సికింద్రాబాద్ డీఆర్ఎం అభయ్ గుప్తా, ఐఆర్సీటీసీ జీజీ ఎం రాజ్‌కుమార్‌లతో కలసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ దేశ సాంస్కృతిక వారసత్వాన్ని, చారిత్రక ప్రదేశాలను, పుణ్య క్షేత్రాలను యా త్రికులు దర్శించడానికి రైల్వే శాఖ 3వ భారత్ గౌరవ్ రైలును ప్రారంభించిందన్నారు. శనివారం బయలుదేరిన భారత్ గౌ రవ్ రైలు కోణార్క సూర్య దేవాలయం, పూరీ, కాశీ, అయో ధ్య తదితర పుణ్యక్షేత్రాల సందర్శన తర్వాత మే 7న తిరిగి సికింద్రాబాద్‌కు చేరుకుంటుందని తెలిపారు. ఈ మార్గంలోని వివిధ పుణ్య క్షేత్రాలకు భక్తులను తీసుకెళ్లి అక్కడ స్థానికంగా అవసరమయ్యే రవాణా, భోజన, వసతి సౌకర్యాలన్నీ భారతీయ రైల్వేనే ఏర్పాటు చేస్తుందన్నారు. వృద్ధులు, మహిళలు, పిల్లలను వెంట తీసుకొని ఈ పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లాలంటే ప్రజలకు భారీ ఖర్చు, ప్రయాసలతో కూడిన పని కాబట్టి మోదీ ప్రభుత్వం గౌరవ్ రైళ్లకు శ్రీకారం చుట్టిందన్నారు. కాగా, జూన్ 10న సికింద్రాబాద్ నుంచి జమ్మూలో ని మాతా వైష్ణోదేవి, హరిద్వార్, రిషికేశ్ తదితర ప్రాంతాల సందర్శనకు మరో భారత్ గౌరవ్ రైలును ప్రారంభించనున్నట్టు ఆయన తెలిపారు. రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ యాత్రికులకు ఇబ్బందులు లే కుండా సాంస్కృతికంగా ప్రముఖమైన ప్రదేశాలను సందర్శించడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తున్నామన్నారు. యాత్రికులకు అల్పాహార ప్యాకెట్లు అందజేసిన మంత్రి భారత్ గౌరవ్ రైలు యాత్రలో భాగంగా యాత్రికులకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అల్పాహార ప్యాకెట్లను అందజేశారు. అనంతరం వారితో కొద్దిసేపు ముచ్చటించారు. భారత్ గౌరవ్ రైలు ద్వారా పుణ్యక్షేత్రాల సందర్శన సులభం అయిందంటూ యాత్రికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. -
ఏపీ, తెలంగాణ నుండి భారత్ గౌరవ్ రైలు రేపే ప్రారంభం
ఢిల్లీ: దేశంలోని విశిష్ట ప్రదేశాలు, పుణ్యక్షేత్రాల సందర్శనకు ఉద్దేశించిన ‘భారత్ గౌరవ్’ టూరిస్టు రైలు సర్వీసును దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రేపట్నుంచి(శనివారం) ప్రారంభం కానుంది. ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) సర్వి స్ ప్రొవైడర్‌గా ఈ రైలు సేవలు కొనసాగనున్నాయి. దీనికి ‘పుణ్యక్షేత్ర యాత్ర– పూరీ–కాశీ–అయోధ్య యాత్ర’గా నామకరణం చేశారు. ఈనెల 18 నుంచి 26 వరకు 8 రాత్రులు, 9 పగళ్లు ఈ యాత్ర కొనసాగనుంది. పూరీ, కోణార్క్, గయా, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ లాంటి పుణ్య క్షేత్రాలను చుట్టిరానుంది. ఈ రైలు 18న మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్లో బయలుదేరి రెండు తెలుగు రాష్ట్రాల్లోని నిర్ధారిత ముఖ్య స్టేషన్లలో ఆగుతుంది. కాజీపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం స్టేషన్లలో దీనికి హాల్టులుంటాయి. భారత్ గౌరవ్ రైళ్ల యొక్క 26 ట్రిప్పులు 22 రాష్ట్రాలు మరియు 04 కేంద్ర పాలిత ప్రాంతాలను కవర్ చేయనుంది. రైలులోని యాత్రికులు పూరి, కోణార్క్, గయా, వారణాసి, అయోధ్య మరియు ప్రయాగ్‌రాజ్‌లను 9 రోజుల వ్యవధిలో సందర్శించనున్నారు.. రైలు ప్రయాణికులందరికీ ప్రయోజనం చేకూర్చేందుకు, రెండు తెలుగు రాష్ట్రాల్లోని 9 ముఖ్యమైన స్టేషన్లలో బోర్డింగ్ (& డి-బోర్డింగ్) సౌకర్యం కల్పించబడింది. ఈ యాత్ర కోసం అన్ని సీట్లు బుక్ చేయబడ్డాయి, ప్రయాణికులు అన్ని స్టాపింగ్ స్టేషన్ల నుండి సదుపాయాన్ని పొందడంతో మొదటి ట్రిప్‌కు భారీ స్పందన లభించింది. రైలు ప్రయాణీకులకు వారి ప్రయాణ సంబంధిత అవసరాలన్నింటిని చూసుకోవడం ద్వారా రైలు సంపూర్ణ సేవలను అందిస్తుంది. టూర్ ప్యాకేజీలో అన్ని ప్రయాణ సౌకర్యాలు (రైలు మరియు రోడ్డు రవాణాతో సహా), వసతి సౌకర్యం, వాష్ మరియు మార్పు సౌకర్యాలు, క్యాటరింగ్ ఏర్పాట్లు (ఉదయం టీ, అల్పాహారం, లంచ్ మరియు డిన్నర్ - ఆన్-బోర్డ్ మరియు ఆఫ్-బోర్డ్ రెండూ), సేవలు వృత్తిపరమైన మరియు స్నేహపూర్వక టూర్ ఎస్కార్ట్‌లు, రైలులో భద్రత - అన్ని కోచ్‌లలో CCTV కెమెరాల సదుపాయం ఉంది. ఈ రైలు యాత్రలో పూరీ జగన్నాథ ఆలయం, కోణార్క్ సూర్యదేవాలయం, బీచ్, వారణాసిలోని కాశీ విశ్వనాథ దేవాలయం, కారిడార్, కాశీవిశాలాక్షి, అన్నపూర్ణదేవి దేవాలయం, సాయంత్రం గంగా హారతి, అయోధ్య రామ జన్మభూమి, సరయూ నది తీరాన హారతి, ప్రయాగరాజ్ -త్రివేణి సంగమం, హనుమాన్ మందిర్, శంకర్ విమన్ మందిరాలను దర్శించుకునేందుకు అవకాశం ఉందని రైల్వే శాఖ తెలిపింది. గమనిక: భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు యొక్క తదుపరి ట్రిప్ 18 ఏప్రిల్ 2023 నుండి ప్రారంభమవుతుంది. -
చుక్‌చుక్ భారత్ గౌరవ్ రైలు గాడి.. సికింద్రాబాద్ టు ప్రయాగ్‌రాజ్
సాక్షి, హైదరాబాద్: దేశంలోని విశిష్ట ప్రదేశాలు, పుణ్యక్షేత్రాల సందర్శనకు ఉద్దేశించిన ‘భారత్ గౌరవ్’ సర్వ సు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలిసారిగా ఈనెల 18న ప్రారంభం కానుంది. ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) సర్వి స్ ప్రొవైడర్‌గా ఈ రైలు సేవలు కొనసాగనున్నాయి. దీనికి ‘పుణ్యక్షేత్ర యాత్ర– పూరీ–కాశీ–అయోధ్య యాత్ర’గా నామకరణం చేశారు. ఈనెల 18 నుంచి 26 వరకు 8 రాత్రులు, 9 పగళ్లు ఈ యాత్ర కొనసాగనుంది. పూరీ, కోణార్క్, గయా, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ లాంటి పుణ్య క్షేత్రాలను చుట్టిరానుంది. ఈ రైలు 18న మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్లో బయలుదేరి రెండు తెలుగు రాష్ట్రాల్లోని నిర్ధారిత ముఖ్య స్టేషన్లలో ఆగుతుంది. కాజీపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం స్టేషన్లలో దీనికి హాల్టులుంటాయి. హోటళ్లలో బస ఏర్పాటు ఎకానమీ కేటగిరీలో టికెట్ బుక్ చేసుకునేవారికి హోటళ్లలో రాత్రి బసకు నాన్ ఏసీ గదులను కేటాయిస్తారు, స్టాండర్డ్, కంఫర్ట్ కేటగిరీ ప్రయాణికులకు ఏసీ గదులుంటాయి. ఆయా ప్రాంతాల్లో వాహనాల్లో వెళ్లాల్సిన చోట ఎకానమీ, స్టాండర్ట్ కేటగిరీ వారికి నాన్ ఏసీ వాహనాలు, కంఫర్ట్ వారికి ఏసీ వాహనాలు ఏర్పాటు చేస్తారు. భోజనంలో కేవలం శాఖాహారాన్నే అందిస్తారు. టీ, అల్పాహారం, మధ్యాహ్న, రాత్రి భోజనాలకు విడిగా చార్జి చేయరు. ప్రయాణికులకు ప్రయాణ బీమా చేయిస్తారు. తీర్థయాత్రికులకు గొప్ప అవకాశం: అరుణ్‌కుమార్ జైన్ తీర్థయాత్రలు చేయాలనుకునేవారికి భారత్ గౌరవ్ రైలు రూపంలో గొప్ప అవకాశాన్ని రైల్వే అందుబాటులోకి తెచ్చిందని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ అన్నారు. బుధవారం ఆయన రైల్ నిలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ రైలు వివరాలు వెల్లడించారు. ఈ రైలులో ప్రయాణం వైవిధ్యంగా, పూర్తి సౌకర్యంగా ఉంటుందని, యాత్రికులకు మధురానుభూతిని పంచుతుందని తెలిపారు. వివిధ ప్రాంతాల్లో తిరిగేందుకు వాహనాలు మాట్లాడుకోవటం, భోజనం, బస కోసం హోటళ్ల వెంట పరుగెత్తాల్సిన పనిలేకుండా అన్నీ తామే ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీంతో ఆందోళన లేకుండా ప్రశాంతంగా, సురక్షితంగా పర్యాటకులు యాత్ర చేసే వెసులుబాటు కలుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం ఉదయ్‌కుమార్ రెడ్డి, సికింద్రాబాద్ డీఆర్ఎం అభయ్‌కుమార్ గుప్తా, ఐఆర్సీటీసీ గ్రూప్ జీఎం రాజా కుమార్, సీపీఆర్ఓ రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.