వెల్లుల్లి వాసన కలిగిన మూలకం? | Element with the smell of garlic? | Sakshi
Sakshi News home page

వెల్లుల్లి వాసన కలిగిన మూలకం?

Published Sat, Aug 24 2013 1:54 AM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM

వెల్లుల్లి వాసన కలిగిన మూలకం?

వెల్లుల్లి వాసన కలిగిన మూలకం?

రసాయన శాస్త్రం
 పదార్థం-మార్పులు
 1.    {దవస్థితిలో ఉండే మూలకం..?
     1) సోడియం    2) పొటాషియం
     3) బ్రోమిన్    4) పాస్ఫరస్
 
 2.    అతి తక్కువ సంయోగ సామర్థ్యం గల మూలకం?
     1) హైడ్రోజన్    2) ఆక్సిజన్
     3) నైట్రోజన్    4) సల్ఫర్
 
 3.    కాల్షియం కార్బొనేట్ ఏ రంగులో ఉంటుంది?
     1) ఎరుపు    2) తెలుపు
     3) పసుపు    4) నీలం
 
 4.    {పయోగశాలలో ఆక్సిజన్‌ను తయారుచేసే క్రమంలో పొటాషియం క్లోరేట్(ఓఇై3)కు ఏ ఉత్ప్రేరకాన్ని కలుపుతారు?
     1) మెర్క్యూరిక్ ఆక్సైడ్  (HgO)
     2) పొటాషియం నైట్రేట్ (KnO3)
     3) మాంగనీస్ డై ఆక్సైడ్ (MnO2)
     4) పొటాషియం పర్మాంగనేట్ (KMnO4)
 
 5.    శాఖీయ నూనెలను ఘన రూపంలోని కొవ్వు పదార్థాలుగా మార్చే విధానంలో ఉపయో గించే వాయువు?
     1) కార్బన్ డై ఆక్సైడ్
     2) క్లోరిన్
     3) హైడ్రోజన్      
     4) ఆక్సిజన్
 
 6.    పీడనం ఎక్కువయ్యేకొద్దీ నీటిలో కార్బన్ డై ఆక్సైడ్ ద్రావణీయత?
     1) మారదు 2) పెరుగుతుంది
     3) తగ్గుతుంది
     4) నీటి స్వభావంపై ఆధారపడి ఉంటుంది
 
 7.    ఆమ్లాలు లోహాలతో చర్యనొందినప్పుడు వెలు వడే వాయువు?
     1) హైడ్రోజన్    2) ఆక్సిజన్
     3) క్లోరిన్      4) కార్బన్ డై ఆక్సైడ్
 
 8.    బంగారం లాటిన్ నామం?
     1) అర్జెంటీనం    2) నేట్రియం
     3) కాలియం      4) ఆరమ్
 
 9.    8 గ్రాముల కాల్షియం కార్బోనేట్‌ను వేడిచేస్తే విడుదలైన కార్బన్ డై ఆక్సైడ్ భారమెంత?
     1) 44 గ్రాములు    2) 35.2 గ్రాములు
     3) 3.52 గ్రాములు     4) 4.4 గ్రాములు
 
 10.    Zn+CuSO4®ZnSO4+Cu
     అనేది ఏ రసాయన చర్య?
     1) రసాయన సంయోగం
     2) రసాయన వియోగం
     3) రసాయన స్థానభ్రంశం
       4) రసాయన ద్వంద్వ వియోగం
 
 11.    హెన్రీ కెవెండిష్ ఏ వాయువును తయారు చేశాడు?
     1) హైడ్రోజన్    2) క్లోరిన్
     3) నైట్రోజన్    4) ఆక్సిజన్
 
 12.    వాయు ఇంధనం (Fuel gas)లో హైడ్రో జన్‌ను ఎందుకు ఉపయోగిస్తారు?
     1) హైడ్రోజన్ తేలికైన మూలకం
     2) హైడ్రోజన్‌కు సులభంగా మండే స్వభావం ఉంటుంది
     3) దీనికి అధిక దహనోష్ణం ఉంటుంది      4) పైవన్నీ
 
 13.    హైడ్రోజన్‌ను నీటి ఊర్థ్వముఖ స్థానభ్రంశం ద్వారా పొందవచ్చు. ఎందుకంటే..?
     1) ఇది గాలికంటే తేలికైంది
     2) గాలికంటే బరువైంది
     3) ఇది మండే స్వభావం గల వాయువు      4) ఇది విష వాయువు
 
 14.    ఘన పరిమాణాత్మకంగా ఆక్సిజన్ ఎందు లో ఎక్కువగా ఉంటుంది?
     1) గాలి      2) ఇసుక
     3) నీరు    4) కర్బన పదార్థాలు
 
 15.    కింది వాటిలో సల్ఫర్ ధాతువు?
     1) మాగ్నసైట్    2) డోలమైట్
     3) కార్నలైట్      4) గెలినా  
 
 16.    MnO2+HCl®MnCl2+H2O+?
     1) O2     2) C2    3) H2      4) Mn
 17.    టియర్ గ్యాస్ (Tear gas) ఫార్ములా?
     1) Cl3CnO2    2) Cl2CnO2
     3) Cl3CnO      4) Cl3CnHO2
 18.    మాంసం, చేపలు, పచ్చళ్లు నిల్వ ఉంచ డానికి ఉపయోగించే రసాయనం?
     1) NaNO3    2) NaCl
     3) NaOH      4) NaHg
 19.    {Oబెన్ ద్రావణం అంటే..?
     1) ఉప్పు-నీరు ద్రావణం
     2) చక్కెర-నీరు ద్రావణం
     3) స్పటికం-నీరు ద్రావణం
     4) సల్ఫూరిక్ ఆమ్లం-నీరు ద్రావణం
 
 20.    కింది వాటిలో మైనం వంటి మెత్తటి పదార్థం?
     1) సోడియం క్లోరైడ్   2) పాదరసం
     3) అమ్మోనియా         4) పాస్ఫరస్
 
 21.    ఒక వాయువును పీడనానికి గురిచేసి, వ్యాకోచింపచేసి, చల్లబరిచే విధానాన్ని ఏమంటారు..?
     1) సీబెక్ ప్రభావం
      2) మాక్స్‌వెల్ ప్రభావం
     3) జౌల్-థామ్సన్ ప్రభావం
     4) ఫెల్టీరియర్ ప్రభావం
 
 22.    అమ్మోనియం నైట్రేట్‌ను నేరుగా వేడి చేయ రాదు ఎందుకంటే..?
     1) ఇది ఒక పేలుడు పదార్థం
     2) ఇది ఒక అణుధార్మిక పదార్థం
     3) దీనికి ఉష్ణధారణ సామర్థ్యం తక్కువ    4) దీనికి విశిష్టోష్ణం విలువ ఎక్కువ
 
 23.    2NH2Cl+..?®    CaCl2+H2O+2NH3
      1) Ca (OH)2    2) CaO
     3) Ca(NH)2    4) CaClO3
 
 24.    కొంత ఫెర్రిక్ క్లోరైడ్ ద్రావణానికి అమ్మోని యం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని చుక్కలు చుక్కలుగా కలిపితే ఏర్పడే అవక్షేపపు రంగు ఏది?
     1) నీలి     2) జేగురు
     3) పసుపు    4) నలుపు
 
 25.    మంచు తయారీలో శీతలీకరణిగా ఉపయో గించే పదార్థం?
     1) నైట్రిక్ ఆమ్లం    2) కార్బన్ డై ఆక్సైడ్
     3) అమ్మోనియా     4) యూరియా
 
 26.    అధిక ఆక్సిజన్ సమక్షంలో అమ్మోనియా ఆక్సీకరణం పొందితే ఏర్పడే పదార్థం?
     1) NO2 2) N2O  3) N2O3 4) N2
 
 27.    అద్దకం పరిశ్రమలో వస్త్రాలపై అచ్చు వేసేందుకు ఉపయోగించే పదార్థం?
     1) అమ్మోనియం క్లోరైడ్
     2) సోడియం క్లోరైడ్
     3) మెగ్నీషియం క్లోరైడ్
       4) కార్బన్ టెట్రా క్లోరైడ్
 
 28.    పేలుడు పదార్థం అమ్మోటాల్‌లో..ట్రైనైట్రో టోలీన్ (TNT) శాతం ఎంత?
     1) 40%  2) 60%  3) 20%  4) 75%
 
 29.    బంగారం, వెండి వంటి లోహాలను శుద్ధి చేయడానికి ఉపయోగించేది?
     1) అమ్మోనియం క్లోరైడ్
     2) నైట్రిక్ ఆమ్లం
     3) గాఢ HCl    
     4) అయోడిన్ ఆమ్లం
 
 30.    వర్షపు నీటిలో గల నత్రికామ్లంతో చర్య పొంది నైట్రేట్‌ల నిచ్చే భూమిలోని ఆక్సైడ్‌లు?
     1) ఆమ్ల ఆక్సైడ్‌లు    
     2) క్షార ఆక్సైడ్‌లు
     3) తటస్థ ఆక్సైడ్‌లు
     4) ద్వి స్వభావ ఆక్సైడ్‌లు
 
 31.    సల్ఫర్ రూపాంతరాల్లో స్థిరమైన రూపం?
     1) మోనోక్లినిక్ రూపం
     2) ప్లాస్టిక్ సల్ఫర్
     3) రాంబిక్ సల్ఫర్    
     4) ప్రిస్మాటిక్ సల్ఫర్
 
 32.    రబ్బరు వల్కనీకరణం (Valcanisation of rubber)ÌZ వాడే పదార్థం?
     1) పాస్ఫరస్    2) సల్ఫర్
     3) క్రోమియం    4) కోబాల్ట్
 
 33.    చారిత్రక కట్టడాలకు నష్టం కలిగించే వాయువు?
     1) జింక్ ఆక్సైడ్    
     2) కాపర్ ఆక్సైడ్
     3) సల్ఫర్ డై ఆక్సైడ్    
     4) కార్బన్ డై ఆక్సైడ్
 
 34.    ఒక పదార్థం రంగును పోగొట్టడాన్ని ఏమంటారు..?
     1) హైడ్రోజనీకరణ    2) విరంజన చర్య
     3) సల్ఫొనోషన్    4) కార్బోనేషన్
 
 35.    రసాయనాల రాజు (King of the chemicles) అని దేనిని అంటారు?
     1) H2SO4     2) HNO3
     3) H2SO7    4) H2S2O7
 
 36.    ఓలియం (ైleum) ఫార్ములా?
     1) H2SO4     2) H2S2O6
     3) H2SO7    4) H2S2O7
 
 37.    {పయోగశాలలో కిప్సు పరికరాన్ని(ఓజీఞఞట ్చఞఞ్చట్చ్టఠట) ఉపయోగించి ఏ వాయు వును తయారు చేస్తారు?
     1) కార్బన్ డై ఆక్సైడ్  2) సల్ఫర్ డై ఆక్సైడ్
     3) హైడ్రోజన్ సల్ఫైడ్  4) ఆక్సిజన్
 
 38.    అల్యూమినియం సంయోజకత ఎంత?
     1) 3     2) 2    3) 4      4) 1
 
 39.    ఫార్మాల్డీహైడ్ అణు ఫార్ములా?
     1) C2HO    2) CH2O
     3) CHO2    4) C2H2O
 
 40.    {పమాణ  ఉష్ణోగ్రతా పీడనాల వద్ద (NTP) ఒక మోల్ ఇై2 వాయువు ఎన్ని లీటర్ల ఘన పరిమాణాన్ని ఆక్రమిస్తుంది?
     1) 20.4  2) 2.24      3) 22.4    4) 224
 
 41.    నీటి విద్యుత్ విశ్లేషణ ప్రయోగంలో కాథోడ్ వద్దకు చేరే వాయువు?
     1) హైడ్రోజన్    2) ఆక్సిజన్
     3) నీటిఆవిరి    4) పైవేవీ కావు
 
 42.    నీటి భాష్పీభవన ఉష్ణోగ్రత?
     1) 98°C    2) 1000°C
     3) 120°C    4) 100°C
 
 43.    బెర్జీయస్ పద్ధతిలో ఏ పదార్థాన్ని తయారు చేస్తారు?
     1) పెట్రోల్    2) డీజిల్
     3) కోల్‌తార్    4) అమ్మోనియా
 
 44.    కింది వాటిలో ఆమ్ల ఆక్సైడ్ కానిది?
     1) SO2    2) P2O5
     3) CO2    4) CaO
 
 45.    ఏ సల్ఫర్ రూపాంతరానికి ఎక్కువ సాపేక్ష సాంద్రత ఉంటుంది?
     1) ప్లాస్టిక్    2) రాంబిక్
     3) మోనోక్లీనిక్    4) ఛ సల్ఫర్
 
 46.    చర్మ వ్యాధుల నివారణలో వాడే సల్ఫైడ్ ఏది?
     1) మెర్క్యూరిక్ సల్ఫైడ్
     2) జింక్ సల్ఫైడ్    
     3) కాపర్ సల్ఫైడ్    4) హైడ్రోజన్ సల్ఫైడ్
 
 47.    సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఏ పద్ధతిలో తయారు చేస్తారు?
     1) స్పర్శ పద్ధతి    2) ఫ్రాష్ పద్ధతి
     3) నెల్సన్ పద్ధతి    4) హెబర్ పద్ధతి
 
 48.    కృత్రిమ సిల్క్(సెల్యూలోజ్ నైట్రేట్) తయా రీలో ఏ ఆమ్లాన్ని ఉపయోగిస్తారు?
     1) సల్ఫ్యూరిక్ ఆమ్లం
     2) హైడ్రోక్ల్లోరిక్ ఆమ్లం
     3) నత్రికామ్లం   
     4) కార్బాక్సిలిక్ ఆమ్లం
 
 49.    వెల్లుల్లి వాసన కలిగిన మూలకం?
     1) పాస్ఫరస్    2) సల్ఫర్
     3) క్లోరిన్    4) హైడ్రోజన్
 
 50.    ఏ పరిశ్రమలో పనిచేసే శ్రామికులకు దవడ ఎముకలు నశించే ఫాసిజా జబ్బు వస్తుంది?
     1) సల్ఫర్    2) పాస్ఫరస్
     3) క్వారీ    4) సిమెంట్
 
 51.    కింది వాటిలో నిర్జలీకరిణిగా ఉపయోగ పడేది?
     1) Na2PO4    2) P2O5
     3) Ca3(PO4)2     4) H3PO4
 
 52.    0.001క హైడ్రోక్లోరిక్ ఆమ్లం ్కఏ విలువ ఎంత?
     1) 1     2) 103    3) 3      4) 0
 
 53.    క్షార ద్రావణంలో మిథైల్ ఆరెంజ్ సూచిక రంగు?
     1) పసుపు    2) నారింజ
     3) ఆకుపచ్చ    4) ఎరుపు
 
 54.    స్వచ్ఛమైన నీరు ్కఏ విలువ 7. కాబట్టి ఇది?
     1) ఆమ్ల ద్రావణం    
     2) తటస్థ ద్రావణం
     3) క్షార ద్రావణం      4) చెప్పలేం
 
 55.    క్షారాలు ఆమ్లాలతో చర్య పొంది..?
     1) లవణాలను ఏర్పరుస్తాయి
     2) నీటిని ఏర్పరుస్తాయి
 3) లవణాలు, నీటిని ఏర్పరుస్తాయి      
 4) లవణాలు, నీటిని, కొద్దిగా         
 ఆక్సిజన్‌ను ఏర్పరుస్తాయి
 
 
 సమాధానాలు
 1) 3; 2) 1; 3) 2; 4) 3; 5) 3; 6) 2; 7) 1;  8) 4; 9) 3; 10) 3; 11) 1; 12) 3; 13) 1; 14) 3; 15) 4; 16) 2; 17) 1; 18) 2; 19) 1; 20) 4; 21) 3; 22) 1; 23) 2; 24) 2; 25) 3; 26) 1; 27) 1; 28) 3; 29) 2; 30) 2; 31) 3; 32) 2; 33) 3; 34) 2; 35) 1; 36) 4; 37) 3; 38) 1; 39) 2; 40) 3; 41) 2; 42) 4; 43) 1; 44) 4; 45) 2; 46) 1; 47) 1; 48) 3; 49) 1; 50) 2; 51) 2; 52) 3; 53) 1; 54) 2; 55) 3.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement