సూక్ష్మధాతు లోపం వల్ల బొప్పాయి (పొప్పడి) పంట దిగుబడి తగ్గుతుంది. అవగాహన లోపం వల్ల దీన్ని సవరించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులు నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో దిగుబడి తగ్గటంతో పాటు వివిధ రకాల తెగుళ్ల బారిన పడి పంట పూర్తిగా పాడవుతుంది. సమస్యను సకాలంలో గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపడితే ధాతులోపాలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. పంటకు ప్రధానంగా జింక్, మెగ్నీషియం, బోరాన్, ఐరన్ ధాతు లోపాలు వస్తుంటాయి. ఉద్యాన, వ్యవసాయశాఖ అధికారుల సూచనలు పాటిస్తే దీన్ని అధిగమించడం సులువే.
జింక్ లోపం లక్షణాలు
ఆకు కణజాలం పూర్తిగా ఆకుపచ్చ రంగులోకి మారుతుంది.
ఈనెల మధ్యభాగం పసుపు పచ్చరంగులోకి మారి వాడిపోయినట్లుగా ఉంటుంది.
పిందె సైజు పెరగదు. దిగుబడి తగ్గుతుంది.
నాణ్యత, రుచి లోపిస్తుంది.
నివారణ...
జింక్‌లోపం నివారణకు లీటరు నీటిలో 2 గ్రాముల జింక్ సల్ఫేట్ మరియు 10 గ్రాముల యూరియా ద్రావణాన్ని కలిపి మొక్కలపై పిచికారీ చేయాలి.
మెగ్నీషియం లోపిస్తే
మెగ్నీషియం లోపం వల్ల ఆకు పూర్తిగా మూడతపడి తిరగబడుతుంది.
దీంతో ఆకు మొత్తం పేలవంగా మారుతుంది. మొక్క ఎదుగుదల లోపిస్తుంది.
నివారణ...
లీటరు నీటికి 2 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ మరియు 10 గ్రాముల యూరియా కలిపిన ద్రావణాన్ని మొక్కలపై పిచికారీ చేయాలి.
ఐరన్ లోపంతో...
ఆకులు బంగారు వర్ణంలోకి మారుతాయి.
ఈనెల మధ్య భాగం తెల్లగా మారుతుంది.
ఐరన్ లోపం ఎక్కువైతే ఈనెలు, ఈనెల మధ్యభాగం పూర్తిగా
తెలుపు రంగులోకి మారుతుంది.
నివారణ...
లీటరు నీటికి 2 గ్రాముల ఫైసల్ఫేట్ మరియు 1గ్రాము నిమ్మ ఉప్పు కలిపిన ద్రావణాన్ని స్ప్రేచేయాలి.
బోరాన్ లోపం...
బొప్పాయి ఆకులు పూర్తిగా జీవం కోల్పోతాయి.
పిందె తక్కువగా కడుతుంది. పిందె రాలిపోవడం ప్రారంభమవుతుంది.
కాయలపై మచ్చలు ఏర్పడుతాయి. కాయ రూపం మారుతుంది.
నివారణ...
దీన్ని నివారించేందుకు లీటర్ నీటిలో 4గ్రాముల ఫార్ముల-4 అనే మందును పిచికారీ చేయాలి.
సూక్ష్మలోపం.. భారీ నష్టం!
Published Mon, Nov 17 2014 11:53 PM | Last Updated on Sat, Sep 2 2017 4:38 PM
Advertisement
Advertisement