గుడ్డు తింటున్నారు.. పొట్టు పారేస్తారేం..! | Eggshells will give Calcium and decrease bp | Sakshi
Sakshi News home page

గుడ్డు తింటున్నారు.. పొట్టు పారేస్తారేం..!

Published Thu, Jun 22 2017 5:24 PM | Last Updated on Thu, Jul 11 2019 5:40 PM

గుడ్డు తింటున్నారు.. పొట్టు పారేస్తారేం..! - Sakshi

గుడ్డు తింటున్నారు.. పొట్టు పారేస్తారేం..!

న్యూఢిల్లీ: గుడ్లు.. ఈ పేరు చెప్పగానే కొందరు శాఖాహారం అని వాదిస్తుండగా, మరికొందరు మాంసాహారమని అంటారు. ఏది ఏమైతేనేం వీటి వల్ల ఉన్న ఓ కీలక ప్రయోజనాన్ని మనం తెలుసుకోవాలి. సాధారణంగా గుడ్లను ఆమ్లేట్ వేసుకున్నా, ఉడికించి తిన్నా.. చివరికి పొట్టును బయట పారవేస్తుంటాం కదా. అయితే పై పొట్టు వల్ల ఉన్న ప్రయోజనాలు తెలిస్తే కచ్చితంగా మనం ఇకనుంచి పారవేయడం ఆపేస్తామని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

గుడ్లలో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ప్రోటీన్లు, కాల్షియం, ఇతర దాతువులు ఇందులో మిలితమై ఉంటాయి. అయితే గుడ్డుపొట్టును మనం స్వీకరిస్తే శరీరానికి కావలసిన కాల్షియం లభిస్తుంది. దీని ద్వారా ఎముకలు, దంతాలకు అవసరమైన అధిక కాల్షియంతో మనం మరింత ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. ఇది తెలియక మనం గుడ్డుపొట్టును ఎప్పుడూ పారవేస్తుంటాం. అయితే నేరుగా కాకుండా.. గుడ్డుపొట్టును పొడిగా చేసుకుని ప్రతిరోజు సగం టేబుల్ స్పూన్ తీసుకుంటే ఆ రోజుకు మనకు కావల్సిన కాల్షియంలో 90 శాతం అందుతుంది. 1000 నుంచి 1500 మిల్లీగ్రాముల కాల్షియం ఎముకలు, దంతాలకు అందుతుందని తాజా సర్వేలు చెబుతున్నాయి. అవసరమైనప్పుడు ఈ విధంగా సగం టేబుల్ స్పూన్ పొడిని తీసుకుంటే కాల్షియం సమస్య త్వరగా తొలగిపోతుంది.

ఉరుకులు పరుగుల జీవితంలో ఎంతో మంది ఉదయం వేళ వచ్చే సూర్యకాంతిని పొందలేకపోతున్నారు. నైట్ ఫిష్ట్స్ లలో పనిచేయడం, లేక సూర్యుడు వచ్చే లోగానే పనిచేసే ఆఫీసులకు వెళ్లే వారికి డి విటమిన్ లోపం ఏర్పడుతుంది. డి విటమిన్ లోపం తలెత్తితే ఎముకలు, దంతాలకు సరిపడ కాల్షియం అందదు. తద్వారా మనం త్వరగా అలసిపోవడం, పనిలో చికాకు రావడం జరుగుతుంటుంది. అందుకే గుడ్డుపొట్టు పొడిని నీళ్లు, లేదా పాలలో కలుపుకుని తాగితే కాల్షియం సమస్య సులువుగా పరిష్కారమవుతుంది. దీంతో పాటు గుడ్డు తినేవారికి కండరాలు, నరాల పనితీరు మెరుగవుతుంది. గుడ్లు బీపీని తగ్గించడంతో పాటు కొవ్వును కూడా నియంత్రిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement