బాడీ బిల్డర్స్‌ 900 ఎగ్స్‌ డైట్‌..! ఆరోగ్యానికి మంచిదేనా? | Content creator tests former bodybuilder Vince Girondas 900 egg diet | Sakshi
Sakshi News home page

900 Egg Diet: బాడీ బిల్డర్స్‌ 900 ఎగ్స్‌ డైట్‌..! చివరికి గంటకు పైగా..

May 22 2025 12:44 PM | Updated on May 22 2025 2:42 PM

Content creator tests former bodybuilder Vince Girondas 900 egg diet

ఇటీవల హెల్దీగా ఉందాం అనే నినాదం ప్రజల్లో బాగా వళ్తోంది. అందురూ ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకునేందుకే ఇష్టపడుతున్నారు. పైగా తమ శరీరానికి సరిపోయే డైట్‌ని ఫాలోఅయ్యి ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇక్కడొక కంటెంట్‌ క్రియేటర్‌, మాజీ బాడీబిల్డర్‌ తనపైన అధిక ప్రోటీన్‌ ఫుడ్‌ ప్రయోగం చేసుకున్నాడు. అందుకోసం అని రోజుకి 30 గుడ్లు చొప్పున నెలకు 900 గుడ్లు తింటే త్వరితగతిన కండరాలు ఏర్పడి బాడీబిల్డర్‌గా మారడానికి తోడ్పడుతుందో లేదా తెలుసుకోవాలని తనమీదే స్వయంగా ప్రయోగం చేసుకున్నాడు. చివరికి ఏమైందంటే..

యూట్యూబ్‌ కంటెంట్‌ క్రియేటర్‌, మాజీ బాడీ బిల్డర్‌ జోసెఫ్ ఎవెరెట్ ప్రముఖ బాడీబిల్డింగ్ లెజెండ్ విన్స్ గిరోండా చెప్పే 900 ఎగ్స్‌ డైట్‌ని పరీక్షించాలనుకున్నాడు. గిరోండా తాను రోజు 30 గుడ్డు తింటానని, అదే తన కండల తిరిగిన దేహం రహస్యమని చెబుతుంటారు. అది ఎంతవరకు నిజం అని తెలుసకునేందుకు ఈ యూట్యూబర్‌ తనమీద ప్రయోగం చేసుకున్నాడు. అందుకోసం రోజుకి 30కి పైగా గుడ్లను డైట్‌లో తీసుకునేవాడు. అతను గుడ్డు తెల్లసొన ఆమ్లెట్‌లు, పచ్చసొన స్మూతీలు ఆహారంతో చేర్చుకునేవాడు. 

వాటితో పాటు రైస్‌, మాంసం, పెరుగు, పండ్లు, తేనె తదితరాలు తీసుకున్నాడు. ఈ ఆహారం తోపాటు వెయిట్ లిఫ్టింగ్‌కి సంబంధించిన అన్ని వ్యాయామాలు చేశాడు. ఆ తర్వాత తన బాడీలో జరిగిన మార్పులపై వైద్య పరీక్షలు జరిపించగా..మంచికొలస్ట్రాల్‌ స్థాయిలు పెరగడం తోపాటు, రక్తంలో చెడు కొలస్ట్రాల్‌కి సంబంధించి గణనీయమైన మార్పులు కనిపించాయి.

ఈ డైట్‌ మంచిదేనా..? 
ప్రముఖ డైటీషియన్‌ కనిక మల్హోత్రా ఇలాంటి డైట్‌తో పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. గుడ్డులోని పచ్చసొనలో ఉండే అధిక కొలస్ట్రాల్‌ రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను పెంచుతుందన్నారు. ఇది గుడ్డు జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని అన్నారు. 

అంతేగాదు అధికంగా గుడ్లు తీసుకోవడం వల్ల.. కొంతమంది వ్యక్తుల్లో పొట్ట ఉబ్బరం, గ్యాస్‌, విరేచనలు వంటి జీర్ణ సమస్యలు ఉత్ఫన్నమవుతాయని అన్నారు. అంతేగాదు ఇలా గుడ్లు అధికంగా తీసుకుంటే పోష అసమతుల్యత వస్తుందన్నారు. అలాగే పచ్చిగా లేదా తక్కువగా ఉడికించి తీసుకుంటే సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ బారినపడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

కండరాల పెరుగుదల కోసం గుడ్డు అధికంగా తీసుకోవాల్సిందేనా..
గుడ్డు కండరాల పెరుగుదలకు ఉపయోగపడినప్పటికీ..అధికంగా తీసుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదని తేల్చి చెప్పారు. గుడ్డులోని పచ్చసొన కండరాల ప్రోటీన్‌ సంశ్లేషణను సమర్థవంతంగా పెంచుతుందన్నారు. దీనిలో ప్రోటీన్‌ కంటెంట్‌ ఇతర వాటిలో కంటే ఎక్కువ. 

పైగా దీన్ని ఉడకించి తింటేనే సులభంగా అరుగుతుంది లేదంటే శరీరం దాన్ని అరిగించుకోవడానికి చాలా సమయం తీసుకుంటుందన్నారు. చెప్పాలంటే సోయా లేదా గోధుమలు, పాలు తదితరాల కంటే గుడ్డులో ప్రోటీన్‌ సంశ్లేషణ ఎక్కువ కాబట్టి దీన్ని తగు మోతాదులో తీసుకుంటే కండరాల పెరుగుదలకు, బాడీ బిల్డింగ్‌కి ఉపయోగపడుతుందని తెలిపారు. అంతకు మించి అంటే..మరిన్ని ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లేనని హెచ్చరించారు నిపుణులు.

 

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

(చదవండి: డ్యాన్స్‌ బేబీ డ్యాన్స్‌..! పార్కిన్‌సన్స్‌కు నృత్య చికిత్స)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement