అక్షయ్‌ కుమార్‌ నుంచి కత్రినా వరకు.. డైట్‌ సీక్రెట్స్‌ ఇవే.. | Sakshi
Sakshi News home page

Celebrity Diet And Weight Loss Secrets: అక్షయ్‌ కుమార్‌ నుంచి కత్రినా వరకు .. డైట్‌ సీక్రెట్స్‌ ఇవే..

Published Mon, Apr 15 2024 11:41 AM

Celebrity Diet And Weight Loss Secrets Revealed On Kapil Sharma Show- - Sakshi

బాలీవుడ్‌ టీవీ నటుడు, ప్రముఖ కమిడియన్‌, ప్రోడ్యూసర్‌, సింగర్‌ అయిన కపిల్‌ శర్మ సెటబ్రిటీలతో చేసిన 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోతో మంచి పేరు సంపాదించికున్నాడు. ఇటీవల ఆ షో ఫస్ట్‌ ఎపిసోడ్‌ నెట్‌పిక్స్‌లో విడుదల అయ్యింది అక్కడ కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆ షోలో సెలబ్రిటీలు రణబీర్ కపూర్‌, నీతూ కపూర్ మరియు రిద్ధిమా కపూర్ సహానితో షేర్‌ చేసుకున్న ఆసక్తికర విషయాల తోపాటు హాస్యంతో కూడిన చిందులు అన్నింటిని ప్రేక్షక్షులు అలరించాయి.

ఆ ఐదు షోల్లో ప్రముఖ సెలబ్రిటీలు ఫాలో అయ్యే డైట్‌ సీక్రెట్స్‌ కూడా కపిల్‌ వెల్లడించడం జరిగింది. స్రీన్‌పై మంచి అందంతో, పిట్‌నెస్‌తో కనిపించే హీరో/హీరోయిన్‌ల బ్యూటీ, ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌ తెలుసుకోవాలన్న కుతుహలం అందరికీ ఉంటుంది. అది కపిల్‌ శర్మ షో ద్వారా ప్రేక్షకులు తెలుసకునే అరుదైన అవకాశం లభించింది. అవేంటీ, ఎవరెవరు? ఎలాంటి డైట్స్‌ ఫాలో అవుతారో సవివరంగా చూద్దామా..!

జాన్ అబ్రహం
బాలీవుడ్‌ నటుడు, మోడల్‌, నిర్మాత అయిన జాన్‌అబ్రహం ఫిజిక్‌ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఆరడుగుల ఆజానుబాహుడు అంటే అతడేనేమో అన్నట్లు ఉంటుంది అతడి ఆహార్యం. చక్కటి బాడీని మెయింటెయిన్‌ చేస్తూ మంచి ఫిట్‌నెస్‌తో కనిపిస్తాడు. 2021లో తన మూవీ 'సత్యమేవ జయతే2' ప్రమోషన్ సందర్భంగా కపిల్‌ శర్మ షోకి వచ్చినప్పుడూ తన  ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌ని పంచుకున్నాడు. మంచి బాడీ మెయింటెయిన్‌ చేయాలంటే మంచి ఆహారం అనేది చాలా ముఖ్యం అని చెప్పాడు.

అలాగే ఆహారంపై నియంత్రణ ఉండాలని అన్నారు. ప్రోటీన్‌ కోసం నాన్‌వెజ్‌ తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పారు. చాలామంది శాకాహారంతో ప్రోటీన్లు అందుతాయని చెబుతారు గానీ అందులో నిజం లేదని జాన్‌ చెప్పడం జరిగింది. ఇక్కడ జాన్‌ కండల దేహ సౌష్టవాన్ని చూస్తే.. పోషకాల తోకూడిన ఆహారం తినాల్సిందేనని స్పష్టమవుతుంది. 

అక్షయ్ కుమార్
ఇక అక్షయ్‌ కుమార్‌ తన 'హౌస్‌ఫుల్ 3' చిత్రం ప్రమోట్‌ చేసేందుకు కపిల్‌ శర్మ షోకి రావడం జరిగింది. ఆ షోలో ఆ మూవీ నటులంతా రావడం జరిగింది. బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ ఆ షోలో అక్షయ్‌ కుమార్‌ ఫాలో అయ్యే స్ట్రీట్‌ డైట్‌ గురించి వెల్లడించారు. "తాను రితేష్‌ చక్కగా వ్యాయామం చేసి అలసిపోయి ఉన్నాం. అందువల్ల చాలా ఆకలిగా అనిపించి బటర్‌ చికెన్‌ తినాలని అనుకున్నాం. అయితే ఆ టైంలో అక్షయ్‌ వారికి ఉడకబెట్టిన క్యారెట్లు, బచ్చలి కూర ఇచ్చాడని, కనీసం అన్నం గానీ రోటీ గానీ లేదు. ఇంత స్ట్రీట్‌గా డైట్‌ ఫాలో అవుతాడని,అందువల్లే అక్షయ్‌ ఇ‍ప్పటికీ యంగ్‌ లుక్‌లోనే కనిపస్తాడని". అమితాబ్‌ అన్నారు. 

కేక్‌ అంటే చాలా ఇష్టం: కత్రినా కైఫ్‌..
కపిల్‌ శర్మ షోకి సంబంధించి ఒక ఎపిసోడ్‌లో కత్రినా తన డైట్‌ గురించి మాట్లాడింది. "నిజంగా ఆరోగ్యకరమైన డైట్‌ ఫాలో అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నాకు కేక్‌లంటే మహా ఇష్టం కానీ దాన్ని తింటే జిమ్‌లో ఎక్కువసేపు గడపక తప్పదు. అందుకని ప్రతి ఆదివారం మనం కలుసుకుందామని కేక్‌తో సర్ది చెప్పుకుని నోటిని కంట్రోల్‌ చేసేందుకు కష్టపడతానని అంటోంది." కత్రినా. ఇక్కడ సెలబ్రిటీలు కూడా మనలానే ఒక్కోసారి ఫుడ్‌ స్కిప్‌ చేస్తారు. ఐతే తినాలనుకుంటే మాత్రం కంట్రోల్‌గానో లేక ఏదో ఒక రోజు కేటాయించుకుని పరిమితంగా తిని ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తారు. 

గులాబ్‌ జామూన్‌లు, సమోసాలు తినాల్సిందే: రాజ్‌కుమార్ రావ్‌
కపిల్‌ శర్మ షో 2020లో రాజ్‌కుమార్‌ రావ్‌ సందడి చేశారు. అయితే రాజ్‌ కుమార్‌ తనకు తినడమంటే ఇష్టమని చెప్పాడు. ఐతే రాజ్‌ ఫిటనెస్‌ చూస్తే.. ఆయన చెబుతుంది నమ్మశక్యంగా లేదని కపిల్‌ ఆ షోలో అభిప్రాయం వ్యక్తం చేయడంతో తన డైట్‌ గరించి క్లియర్‌గా చెప్పారు. "తనకు గులాబ్‌ జామూన్‌లు, సమోసాలంటే ఎంతో ఇష్టమో ఎలా తినేసేవాడో చెప్పారు. టీనేజ్‌లో ఉండగా వర్కౌట్స్‌ అయ్యాక తిన్నగా స్వీట్‌ షాక్‌కివెళ్లి ఏకంగా ఆరు గులాబ్‌ జామూన్‌లు, రెండు సమోసాలు తినాల్సిందే. అయితే సినీ పరిశ్రమలో ప్రవేశించాక డైట్‌ మీద దృష్టికేంద్రీకరించడంతో అలా తినడం మానేశానని, స్వీట్‌  తినాలనుకుంటే మాత్రం లిమిట్‌గా తింటానని అన్నారు."

ఆదిత్య రాయ్‌: అరకేజీ ఐస్‌క్రీమ్‌ ఉండాల్సిందే..
ఇక ఆదిత్య రాయ్‌ మృణాల్‌ ఠాకూర్‌తో కలిసి కపిల్‌ శర్మ షోకి వచ్చి డైట్‌కి సంబంధించిన ఆసక్తికర విషయాలు షేర్‌ చేసుకున్నారు. తాను రాత్రిపూట ఏకంగా అరకేజీ ఐసీక్రీం తినేవాడినని అన్నారు. చాల సమయం డైట్‌లోనే ఉంటాను కాబట్టి సడెన్‌గా నాలోపల ఉన్నవాడికి తినాలనే కోరిక మొదలవ్వగానే వెంటనే వెళ్లి ఏదో ఒకటి రెండు ఐస్‌క్రీమ్‌లు కాదు ఏకంగా 1/2 కేజీ ఐస్‌క్రీం లాగించేస్తాను. ఆ తర్వాత రోజు పూర్తిగా డైట్‌లో ఉండి, కసరత్తు చేస్తుంటానని అన్నారు.

బరువు తగ్గే యత్నంలో ఉన్నప్పుడూ రోజుకి 1700 కేలరీలు ఉండే పిండి పదార్థాలు, కొవ్వు తక్కువుగా ఉన్నా ఆహారం, అలాగే 15 నుంచి 20 నిమిషాలు కార్డియో సెషన్‌లు చేయండి చాలు. మంచి ఫిట్‌నెస్‌గా ఉంటారు. ఇలా చేసే క్రమంలో ఒక్కోసారి డైట్‌ స్కిప్‌ అవుతుంది. అంతమాత్రాన వదిలేయకుండా మరసటి రోజు నార్మల్‌గా డైట్‌ ఫాలో అయిపోవాలంతే అన్నారు ఆదిత్య రాయ్‌. 

ఈ సెలబ్రిటీల డైట్‌ సీక్రెట్స్‌ అన్ని చూశాక కచ్చితంగా ఎవ్వరైనా అంతలా నోరు కట్టేసుకుని ఉండటం ఈజీ కాదు. అలా అని నోరు కట్టేసుకుని ఇబ్బంది పడక.. తినాలనిపించిన ఐటెమ్స్‌ హాయిగా తినేసి కాస్త వర్కౌట్‌ డోస్‌ పెంచడం తోపాటు డైట్‌లో కేలరీల తక్కువగా ఉన్నవి తీసుకుంటే చాలు. ఒక్కరోజుని డైట్‌ని స్కిప్‌ చేసినంత మాత్రన పూర్తిగా వదిలేయకూడదన్నది క్లియర్‌గా అర్థమవుతుంది. సో..! మీరు కూడా మీ వ్యక్తిగత వైద్యులు  లేదా నిపుణుల సాయంతో మంచి ఆరోగ్యకరమైన డైట్‌ని ఫాలో అవ్వండి, మంచి ఫిట్‌ నెస్‌తో బరువుని అదుపులో ఉంచుకోండి. 

 

Advertisement

తప్పక చదవండి

Advertisement