
గ్లూకోజ్ నియంత్రణకు చామదుంప!
గుడ్‌ఫుడ్
చామదుంపలో ‘ఎ’ విటమిన్, బి1 (థయామిన్), బి2 (రిబోఫ్లేవిన్), బి3 (నియాసిన్), బి5 పాంటోథెనిక్ యాసిడ్), బి6 (పైరిడాక్సిన్), బి9(ఫోలేట్), ‘సి’ విటమిన్, ప్రొటీన్, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్, కాపర్, మాంగనీస్, సెలీనియమ్, కార్బొహైడ్రేట్లు, పీచు ఉంటాయి. ఇందులో కొవ్వు చాలా తక్కువ, కొలెస్ట్రాల్ ఉండవు.
హైపర్ టెన్షన్‌ని తగ్గిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. సాధారణ జలుబు, జ్వరాలను నివారిస్తుంది ∙దుంప కాబట్టి బరువు పెంచుతుందనే అపోహ ఉండడం సహజమే. కానీ దీనికి బరువు పెంచే లక్షణం లేదు. జీర్ణం కాకపోవడం అనే సమస్య ఎదురుకాదు. నిదానంగా జీర్ణం అవుతూ నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయులను అదుపు చేస్తుంది. కాబట్టి మధుమేహవ్యాధి గ్రస్తులు దీనిని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.
చామదుంప క్రీడాకారులకు మంచి ఆహారం ∙కలోన్ క్యాన్సర్‌ను నివారించడంతోపాటు దేహంలో నిల్వ చేరిన చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది ∙చర్మకణాల క్షీణతను అరికడుతుంది. ఎముకల పటిష్టతకు, థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుకు దోహదం చేస్తుంది.