అబ్బా! తోటకూర కాదు అబ్బో! తోటకూర!! | good food for health | Sakshi
Sakshi News home page

అబ్బా! తోటకూర కాదు అబ్బో! తోటకూర!!

Published Sun, Jun 25 2017 11:21 PM | Last Updated on Tue, Sep 5 2017 2:27 PM

అబ్బా! తోటకూర కాదు   అబ్బో! తోటకూర!!

అబ్బా! తోటకూర కాదు అబ్బో! తోటకూర!!

గుడ్‌ఫుడ్‌

తోటకూరలో క్యాల్షియం, ఎ,బి1, బి2, బి6, సి, కె, విటమిన్లు, ఐరన్, రిబోఫ్లేవిన్, పొటాషియం, జింక్, ఖనిజలవణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్‌ను సమర్థంగా నివారిస్తాయి. పాలను జీర్ణించుకోలేని వారు తోటకూర తినడం చక్కటి ప్రత్యామ్నాయం. పాల ద్వారా అందాల్సిన క్యాల్షియమ్‌ను తోటకూర భర్తీ చేస్తుంది. మధుమేహం ఉన్నవారు రోజూ తోటకూర తినడం మంచిది. ఇది ఆహారాన్ని నెమ్మదిగా జీర్ణం చేస్తూ నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తుంది. రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులు తగినంత ఉండడానికి దోహదం చేస్తుంది.
  
తోటకూర శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. వారానికోసారి తోటకూర తింటే నోట్లో పుండ్లు, చిగుళ్లవాపు, గొంతునొప్పి వంటి సమస్యలన్నీ నివారణ అవుతాయి. ఈ ఆకులోని పీచు జీర్ణశక్తిని పెంచుతుంది. కొలెస్ట్రాల్‌ స్థాయులను తగ్గిస్తుంది, రక్తపోటును క్రమబద్ధీకరిస్తుంది.  బరువు తగ్గాలనుకునే వారు తోటకూర తింటే చక్కటి ఫలితం ఉంటుంది. గుండె సంబంధిత సమస్యలను నివారిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement