ఇంతవరకు ఎన్నో రకాల మ్యూజియంలను చూసుంటారు. ఆర్ట్‌కి సంబంధించి, డిఫెరెంట్ ఫోటోలు, లేదా పురాతన వస్తువులు, మమ్మీలు, కొన్ని రకాల వజ్రాలు తదితర విభిన్న మ్యూజియంలు గురించి మాత్రమే విన్నాం. కానీ ఇది అన్నింటికంటే విభిన్నమైన మానవ శరీర అవయవాలకు సంబంధించిన మ్యూజియం. మనిషి శరీరంలోని అవయవాల గురించి సబ్జెక్ట్ పరంగానో వైద్యుల ద్వారానో విని ఉంటాం. కానీ వాటి పనితీరుని ప్రత్యక్షంగా చూడాలనుకుంటే ఈ మ్యూజియంకు వెళ్లాల్సిందే. ఇందులో మానవుని తల నుంచి కాలి వరకు ఉన్న అంతర్గత అవయవాల పనితీరుని నేరుగా చూడొచ్చు తెలుసుకోవచ్చు. ఇది నిజంగా మంచి థ్రిల్లింగ్ ఫీల్‌ని కలుగజేసే మ్యూజియం అనే చెప్పాలి. ఇది ఎక్కడ ఉంది? ఆ మ్యూజియం ఎప్పుడు ఏర్పాటు చేశారు? తదితర విశేషాల గురించే ఈ కథనం.!
ఈ అసాధారణ మ్యూజియం నెదర్లాండ్స్‌లోని లైడెన్ నగరంలో ఉంది. ఆ మ్యూజియం భవనంలో మొదట సుమారు 35 మీటర్ల పొడవైన ఉక్కు కొలోసన్(మనిషి విగ్రహం) ఉండగా, మరోవైపు ఏడు అంతస్తుల భవనం కనిపిస్తుంది. ఈ మ్యూజియం ఎంట్రీ టికెట్ పెద్దలకు సుమారు రూ. 1300/- వరకు ఉంటుంది. చిన్నపిల్లలు అయితే ఆరేళ్లు దాటిని వారికే అనుమతి ఉంటుంది. ఈ మ్యూజియం సైన్స్ పట్ల తెలియకుండానే ఆసక్తి పెరిగేలే చేస్తుంది. నెదర్లాండ్స్‌లో ఉన్న ఈ మ్యూజియం ప్రపంచంలోనే తొలి ఇంటరాక్టివ్ మ్యూజియం అఫ్ హ్యూమన్ బయాలజీ. మానవుని లోపల అవయవాల పనితీరుని విజ్యువల్‌గా చూడొచ్చు. మీకు వాటి గురించి అర్థమయ్యేలా వివరించేలా వివిధ భాషల్లో గైడ్ చేసే ఆడియాలు కూడా ఉంటాయి.
మీరు ఎంట్రీకి ముందే మీకు నచ్చిన భాషను ఎంచుకోవాలి. మీరు ఏ ఫ్లోర్‌లో ఏ గదికి వెళ్తారో.. అక్కడ ఆ గదికి ఎంట్రవ్వగానే ఆ భాష ఆటోమేటిక్‌గా ప్లే అవుతుంది. మొట్టమొదటగా చర్మంతో మొదలై.. కాలి వరకు ప్రతి భాగాన్ని సందర్శిస్తూ వెళ్తాం. మనం ఆయా రూంలకు సమీపించగానే ఆ గదిలోని అవయవం నిలబడి వివరిస్తున్నట్లు అనిపిస్తుంది. మన శరరీంలోని ఈ భాగం పని ఇదా? అని ఒకరకమైన ఫీల్ కలుగుతుంటుంది. ముఖ్యంగా మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థను చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. కొన్ని వ్యవస్థల పనితీరు చూసేందకు త్రీ డీ గ్లాస్‌లు ఉపయోగించాల్సి ఉంటుంది.
ఆఖరికి రక్తం సరఫరా అయ్యే విధానం కూడా ఉంటుంది. అలాగే ఊపిరితిత్తులు ఆక్సిజన్ తీసుకోగానే రక్తం ఎలా కదులుతుందో కళ్లకు కట్టినట్లు కనిపించడమే కాదు ఆడియోలో వివరిస్తారు కూడా. ఇలా.. అన్నవాహిక, గుండె, కాలేయం, మూత్రపిండాలు, ప్రేగులు, కండరాలు, ఎముకలు, కళ్లు ,చెవులు, ఇతర అంతర్గత అన్ని అవయవాలను చూడొచ్చు. అలాగే శరీరానికి ఏదైన గాయం అయ్యితే కనిపించే మార్పులు కూడా చూపిస్తుంది. వైద్యులుగా ట్రైయిన్ అయితే చూసే వాటన్నింటిని మనం కూడా నేరుగా చూడటమే గాక తాకడం, తెలుసుకోవడం వంటివన్నీ చేస్తాం ఈ మ్యూజియంలో. ఇక్కడ ఉన్న ఇంకో సదుపాయం ఏంటంటే..ముందుగానే మీ పేరు, పుట్టిన తేది తదితరాలు నోట్ చేస్తారు కాబట్టి మ్యూజియం జర్నీ ముగియగానే మీ అంతర్గత వ్యవస్థ గురించి కూడా వివరించి మరీ రిపోర్ట్ అందజేస్తారు నిర్వాహకులు.
కాగా, ఈ మ్యూజియాన్ని మార్చి 14, 2008న అప్పటి ఇంగ్లాండ్ రాణి బీట్రిక్స్ ప్రారంభించారు. ఈ మ్యూజియం నిర్మాణం 2006 చివరిలో ప్రారంభమైంది. దీన్ని సుమారు 27 మిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించారు. ఈ మ్యూజియం ప్రపంచంలోని అత్యంత ప్రత్యేకమైన మ్యూజియంలలో ఒకటి. ఈ మ్యూజియంని నిర్వాహకులు దీన్ని సందర్శించే వ్యక్తులు వారి శరీర నిర్మాణం, సంబంధిత సమస్యల గురించి క్లియర్‌గా తెలుసుకుంటారు కాబట్టి వారి ఆరోగ్యాన్ని ఎలా సంరక్షించుకోవాలి అనే దానిపై అవగాహనే గాక ఒక గొప్ప పరిజ్ఞానాన్ని కూడా పొందుతారని అన్నారు..
(చదవండి: ఇదేం స్టయిలిష్ కాస్ట్యూమ్! కానీ ధర వింటే షాకవ్వడం ఖాయం!)
Comments
Please login to add a commentAdd a comment