ఉత్తరాదిని ఎప్పుడూ లేని విధంగా ఉష్టోగ్రతలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఒక్క బుధవారం రోజునే ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవడం తీవ్ర కలకలం రేపింది. మొత్తం ఉత్తర భారతదేశం తీవ్ర వేడిగాలులతో అల్లాడిపోతోంది. దీంతో భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ఈ అధిక ఉష్ణోగ్రతలు మానవ ఆరోగ్యానికి త్రీవమైన ప్రమాదాలను తెచ్చిపెతాయని హెచ్చరించింది. ముఖ్యంగా నీటి కొరతతో జనాభా అల్లాడిపోతుందని, ఇది ఢిల్లీ నివాసితులుకు అత్యంత సవాలుగా ఉంటుదని పేర్కొంది. ఈ వేడిని నివారించడం అనేది అసాధ్యమైనదైనప్పటికీ..ప్రమాదాలు, వాటి లక్షణాలపై అవగాహన ఏర్పరుచుకోవడం కీలకం. ఈ ప్రతికూల వాతారణంలో ఆరోగ్య ప్రభావాలను అర్థం చేసుకుని వాటికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవడం అనేది అత్యంత ముఖ్యం. అవేంటో చూద్దాం.
వేడి అనేది సైలెంట్ కిల్లర్‌లా మనిషిని అతలాకుతలం చేసి మరణానికి దారితీసేలా చేస్తుంది. ఈ అధిక ఉష్ణోగ్రతలకు శరీరం ఎలా స్పందిస్తోందో చూద్దాం.
విపరీతమైన వేడికి శరీరం స్పందించే తీరు..
మానవ శరీరం చల్లగా ఉండటానికి రెండు ప్రధాన విధానాలను కలిగి ఉంటాయి. ఒకటి వాసోడైలేషన్, రెండు చెమట. వాసోడైలేషన్ చర్మం ఉపరితలం దగ్గర రక్తనాళాలను విస్తరించి వేడిని తప్పించుకునేలా అనుమతిస్తుంది. ఇక చెమట..శరీరం వేడికి ఉక్కిపోయి.. చెమట రూపంలో శరీరాన్ని చల్లబరుస్తుంది. దీని వల్ల కండరాల పనితీరుకు ముఖ్యమైన లవణాలు కూడా చెమట రూపంలో బయటకి వెళ్లిపోతాయి. దీంతో నిర్జలీకరణం, ఎలక్ట్రోలైట్ అసమతుల్యతకు దారితీసి వేడి సంబంధిత అనారోగ్యానికి గురవ్వుతారు.
వేడి కారణంగా వచ్చే తిమ్మర్లు:
వేడి కారణంగా కాళ్లు, పొత్తికడుపులో ఒక విధమైన తిమ్మిర్లు వస్తాయి. దీనికి కారణం.. శరీరంలో వేగంగా ద్రవాలు , ఎలక్ట్రోలైట్‌లను కోల్పోవడం వల్ల ఇది సంభవిస్తుంది.
వేడి కారణంగా వచ్చే అలసట:
ఉష్ణోగ్రత పెరగడంతో త్వరిగతిన ప్రజలు అలసటకు గురవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా విపరీతమైన చెమటలు పట్టి, ఈ చెమట రూపంలో ముఖ్యమైన లవణాలు కోల్పోవడంతో స్ప్రుహ కోల్పోవడం, వికారం, తలనొప్పి, పల్స్ వేగవంతమవ్వడం జరుగుతుంది. దీని కారణం శరీరం చల్లబడటానికి టైం తీసుకుంటుంది. ఈ క్రమంలో ఒక్కోసారి హృదయ స్పందన రేటు పడిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
వడదెబ్బ:
ఇది అత్యంత తీవ్రమైన వేడి సంబంధిత అనారోగ్యం. చికిత్స చేయకండా వదిలేస్తే ప్రాణాంతకంగా మారుతుంది. ఎక్కువ ఉష్ణోగ్రతకు గురైతే శరీరంలోని శీతలీకరణ విధానాలు విఫలమవుతాయి. చెమట పట్టడం ఆగిపోయి, పొడిగా మారుతుంది. శ్వాస నిస్సారమైన అస్పష్టమైన మాటలు, మూర్చలకు దారితీస్తుంది. ఒక్కోసారి తీమ్రైన సందర్భాల్లో కోమా లేదా మరణం సంభవించవచ్చు. ఇలా వడదెబ్బకు గురైన వారిలో మొదట వైఫల్యం చెందే అవయవం మూత్రపిండాలు. ఇవి రక్తం నుంచి మలినాలను తొలగించలేని స్థితికి చేరుకుంటాయి. అందువల్ల వడదెబ్బకు గురైన వారిని సంరక్షించేలా తగు జాగ్ర త్తలు తీసుకోవడం అత్యంత ముఖ్యం.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఎండలు దంచికొడుతున్నప్పుడూ పుష్కలంగా నీరు తాగడం, ఎలక్ట్రోలైట్ అధికంగా ఉండే పానీయాలు తాగడం, హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. కఠినమైన కార్యకలాపాలకు దూరంగా ఉండండి. వదులుగా ఉండే దుస్తులు ధరించండి. సాధ్యమైనప్పుడల్లా ఎయిర్ కండిషన్డ్ ప్రదేశాల్లో ఉండేందుకు ప్రయత్నించండి. వేడి అనారోగ్యానికి సంబంధించిన సంకేతాలు వస్తే వెంటనే చర్యలు తీసుకోండి. బయటకు వెళ్లక తప్పదనుకున్నప్పుడూ.. వేడి తక్కువగా ఉండే ఉదయ, సాయంత్రాల్లో పనులు పూర్తి చేసుకునేలా ప్లాన్ చేసుకోవడం, వేడికి గురికాకుండా ఉండేలా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకోవడం వంటివి చేయాలి.
(చదవండి: వయసు 74 ఏళ్లు, చూస్తే..పదహారణాల పడుచు పిల్లలా ఏముందంటే..!)
Comments
Please login to add a commentAdd a comment