సన్మార్గం: వ్యక్తిలోని చైతన్య స్థాయిని పెంచుకోవడం ఎలా? | How to improve human activeness level | Sakshi
Sakshi News home page

సన్మార్గం: వ్యక్తిలోని చైతన్య స్థాయిని పెంచుకోవడం ఎలా?

Published Wed, Aug 14 2013 12:30 AM | Last Updated on Fri, Sep 1 2017 9:49 PM

How to improve human activeness level

సర్వవ్యాప్తమైన ప్రాణశక్తిని అభివ్యక్తిలోకి తీసుకువచ్చే సామర్థ్యమే చైతన్యం. ఈ విశ్వంలో మనుగడలో ఉన్న అన్నింటికీ రూపాన్ని ఇచ్చేందుకు ప్రాణశక్తితో చైతన్యం ఐక్యం అవుతుంది.
 
 ఈ సృష్టిలో ప్రతిదీ ప్రత్యేకమైన ప్రాణశక్తి తరంగాలను కలిగి ఉంటుంది. సృష్టిలో ప్రతి వస్తువు, జీవి ఏర్పడేందుకు వివిధ రూపాలలోకి బదిలీ అయ్యే విశ్వంలోని శక్తి ఇదే. ఒక చెట్టుకు, జంతువుకు లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య తేడాకు కారణం వారిలో స్పందించే ప్రాణశక్తి తరంగాలలోని తేడాలే. మనం కొందరు వ్యక్తుల సాహచర్యాన్ని ఇష్టపడడం లేదా కొందరి సమక్షంలో అసౌకర్యంగా భావించడానికి కారణం ఈ వ్యక్తిగత ప్రాణశక్తి ఫ్రీక్వెన్సీలలోని తేడాలే. మన ప్రాణశక్తి ఫ్రీక్వెన్సీ పరిధిలో ఉన్న వస్తువులు, వ్యక్తులతోనే సంబంధాన్ని నెరపగలిగే మనం, మనకన్నా ఉన్నతమైన లేక తక్కువస్థాయిలో ఉన్న వారితో సంబంధాన్ని ఏర్పరచుకోలేక పోవడానికి కారణమూ ఈ ఫ్రీక్వెన్సీలో తేడాయే.
 
 సర్వవ్యాప్తమైన ప్రాణశక్తిని అభివ్యక్తిలోకి తీసుకువచ్చే సామర్థ్యమే చైతన్యం. ఈ విశ్వంలో మనుగడలో ఉన్న అన్నింటికీ రూపాన్ని ఇచ్చేందుకు ప్రాణశక్తితో చైతన్యం ఐక్యం అవుతుంది. ఈ భౌతిక ప్రపంచంలో మిమ్మల్ని తయారుచేసేది చైతన్యమే. మీ ప్రత్యేక భౌతికస్థితిని ప్రాణశక్తి ఇస్తుండగా, మీ ఆలోచనలు ఒక రూపాన్ని సంతరించుకునేందుకు చైతన్యం వాటిని క్రమబద్ధం చేస్తుంది. ప్రతి ఆలోచనా సమర్థవంతమైన అభివ్యక్తే. ఆలోచిస్తున్న వ్యక్తి చైతన్యపుస్థాయి అతడి ఆలోచనలను వ్యక్తీకరించే సామర్థ్యంతో ప్రత్యక్షానుపాతాన్ని కలిగి ఉంటుంది. వ్యక్తి పరిణామ స్థాయి ఎంత ఉన్నతంగా ఉంటే అంత వేగంగా అతడి ఆలోచనలు అభివ్యక్తమవుతాయి.


దీనిని ఒక ఉదాహరణతో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం:
 ఒక కంపెనీలో సి.ఈ.ఓ విలాసవంతమైన కార్యాలయంలో కూర్చుని కంపెనీకి అవసరమైన ప్రణాళికను కొద్దిగంటలలో రూపొందిస్తాడు. సి.ఈ.ఓ ఆలోచనలకు వాస్తవరూపం ఇచ్చేందుకు కార్మికుడు తన జీవితంలో అనేక గంటలు శ్రమిస్తాడు. ఇందుకు కారణం చైతన్య చలనమే. సి.ఈ.ఓ...శ్రామికుడి చైతన్యపు స్థాయిలలో భారీ అంతరం ఉంది. సి.ఈ.ఓ చైతన్య స్థాయి శ్రామికుడి ైచె తన్య స్థాయి కన్నా ఉన్నతంగా ఉండడంతో అతడి ఆలోచనా శక్తి కూడా అంతే ఉంది. విజయవంతమైన, విఫలమైన వ్యక్తుల మధ్య తేడా వారి చైతన్యపు స్థాయుల్లో తేడానే.
 
 చైతన్య స్థాయిని ఎలా పెంచుకోవాలి? శరీరంలోని ప్రాణశక్తి ఫ్రీక్వెన్నీ సూక్ష్మతరం అయినప్పుడు చైతన్యం పెరుగుతుంది. యోగా అంతిమ ప్రయోజనం, లక్ష్యం అదే. ప్రాణశక్తి ఫ్రీక్వెన్సీలను మార్చడం ద్వారా చైతన్యాన్ని పెంచడమే దాని లక్ష్యం. అష్టాంగయోగలోని ఎనిమిది అంగాలనూ పొందుపరచిన సనాతనక్రియ శరీరంలోని స్థూలప్రాణాన్ని శుభ్రపరచి, చైతన్యపు స్థాయిని పెంచుతుంది. నిత్యసాధన వల్ల శరీరంలో సూక్ష్మమార్పులు అభివ్యక్తమవడమే గాక చైతన్యపు స్థాయి కూడా పెరగడం ప్రారంభమవుతుంది. సాధారణంగా భౌతిక, ఆర్థిక, మానసిక లేదా ఉద్వేగపూరితమైన గందరగోళాలే ఈ అసమతుల్యతలకు దారితీస్తాయి. ఈ గందరగోళాలు సద్దుమణిగిన త ర్వాత అద్భుతమైన కాంతి, అంతర్గత భౌతిక శక్తి, ఉన్నతమైన చైతన్యపు స్థాయితో ఫలితాలు కనిపిస్తాయి. చైతన్యపు స్థాయి ఉన్నతంగా ఉన్నప్పుడు దేనినైనా మరో మాటలో చెప్పాలంటే ప్రతిదానినీ సాధించవచ్చు. ఈ కారణం వల్లనే రాజులు కూడా యోగులను గౌరవిస్తారు, పూజిస్తారు.


 
 ప్రకృతిలోని భౌతిక సూక్ష్మశక్తులపై యోగి ఆధిపత్యాన్ని కలిగి ఉంటాడు. ఆయనకు రెండు ప్రపంచాలూ అందుబాటులో ఉంటాయి. ఆయన మాయ పరిధికి ఆవల ఉంటాడు. ఆయనకు ఇవ్వడం మాత్రమే తెలిసినందున వ్యక్తుల భౌతికస్థాయి లేక సంపదతో ప్రభావితం కాడు. నిజమైన యోగి ఎవరినీ దేనికోసమూ అడగడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ ఆయనకు అందుబాటులో ఉంటుంది. కానీ ఆయన దానితో ప్రభావితం కాడు. యోగా అంటే వేగంగా శ్వాసక్రియలను చేయడమో లేక తలకిందులుగా నిలబడటమో కాదు. అది సాధకుడి ఆధ్యాత్మిక అన్వేషణకే కాదు, భౌతిక జీవితాన్ని కూడా ఉద్దేశించిన సంపూర్ణ శాస్త్రం.
 
 యోగా ఆధ్యాత్మిక, భౌతిక స్థితులను విడదీయదు. గురువు మార్గదర్శనంలో ఉన్నతమైన చైతన్యం ద్వారా మనందరం ఉన్న ఈ భౌతిక ప్రపంచంపై ఆధిపత్యం సంపాదించవచ్చు. యోగా అనేది చైతన్యానికి సంబంధించిన అంశం. మీరు ఎంత ఎత్తుకు ఎదిగితే అంత త్వరగా మీ సంకల్పం అభివ్యక్తమవుతుంది. అందుకే దైవిక చైతన్యం అత్యంత శక్తిమంతమైనది. సర్వవాప్తమైంది. అది సంకల్పమాత్రం చేతనే తక్షణమే అభివ్యక్తమవుతుంది.  
 
  ఇది తెలుసా?
 ఏదయినా ముఖ్యమైన పని నిమిత్తం బయల్దేరి వెళ్లేటప్పుడు
 ‘‘వక్రతుండ మహాకాయం
 కోటి సూర్యసమప్రభం
 నిర్విఘ్నం కురుమేదేవ
 సర్వకార్యేషు సర్వదా’’ అని చదువుకొని వినాయకునికి భక్తితో నమస్కరించి వెళితే కార్యజయం కలుగుతుందని శాస్త్రోక్తి. 21 గణపతికి ఇష్టమైన సంఖ్య. కాబట్టి ఏదయినా కోరిక కోరుకొని వినాయకునికి 21 ఉండ్రాళ్లు నివేదిస్తానని మొక్కుకోవాలి. కోరిక తీరిన తర్వాత మొక్కు తీర్చుకోవడం మాత్రం మరచి పోవద్దు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement