
ఎర్ర రక్త కణాలు లేని రక్త భాగం ఏది?
రక్తం - రక్త కణాలు
మానవ శరీరంలో రక్తం జీవనది లాంటిది. ఇది ద్రవరూప కణజాలం. శరీరంలోని వివిధ భాగాల మధ్య పదార్థాల రవాణాను నిర్వహిస్తుంది. ఆహార పదార్థాలు, శ్వాసవాయువులు, హార్మోన్లు, విసర్జక పదార్థాల రవాణాను రక్తం నిర్వహిస్తుంది. రక్తంలోని తెల్ల రక్త కణాలు రోగనిరోధక శక్తిని అందిస్తాయి. రక్తం శాస్త్రీయ అధ్యయనాన్ని ‘హెమటాలజీ’ అంటారు. రక్తం, రక్తకణాలు అస్థిమజ్జ నుంచి ఏర్పడే విధానాన్ని ‘హీమోపాయిసిస్’ అంటారు. కొంతమందిలో జన్యులోపం కారణంగా రక్తం సరిగా ఏర్పడదు. దీన్ని ‘థాలసీమియా’ అంటారు.
రక్తంలో రెండు భాగాలు ఉంటాయి. మొదటి భాగం ప్లాస్మా. ఇది రక్తంలో 55 శాతం. మిగిలిన 45 శాతం రక్తకణాలు ఉంటాయి. ప్లాస్మాలో 92 శాతం నీరు, మిగిలిన 8 శాతం కర్బన, అకర్బన పదార్థాలు ఉంటాయి. రక్తకణాలు మూడు రకాలు - ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, రక్త ఫలకికలు (్క్చ్ట్ఛ్ఛ్టట). రక్తకణాలను ఎరిత్రోసైట్స్ అంటారు. ఇవి ఏర్పడే విధానాన్ని ‘ఎరిత్రోపాయిసిస్’ అంటారు. ప్రతి ఘనపు మిల్లీమీటరు రక్తంలో స్త్రీలలో 4.5 మిలియన్లు, పురుషుల్లో 5 మిలియన్ల ఎర్ర రక్త కణాలు ఉంటాయి. ఇవి అస్థిమజ్జ నుంచి ఏర్పడినప్పుడు కేంద్రకం, ఇతర కణభాగాలను కలిగి ఉంటాయి. ఆ తర్వాత పరిపక్వత చెందినప్పుడు వీటిని కోల్పోతాయి. కేవలం హీమోగ్లోబిన్ మాత్రమే ఉంటుంది. ఒంటె, లామా లాంటి జంతువుల్లో పరిపక్వత చెందిన ఎర్ర రక్తకణాల్లో సైతం కేంద్రకం ఉంటుంది.
హీమోగ్లోబిన్ ఒక సంయోగ ప్రోటీన్. దీనిలో హీం, గ్లోబిన్ అనే రెండు భాగాలు ఉంటాయి. హీం ఇనుము కలిగిన పారఫైరిన్. గ్లోబిన్ అనేది ప్రోటీన్. ఇందులో ఇనుము ఫై అయాన్ల రూపంలో ఉంటుంది. ఇది శ్వాస వాయువుల రవాణాను నిర్వహిస్తుంది. మానవుల్లో ఎర్ర రక్తకణాల జీవితకాలం 120 రోజులు. ఆ తర్వాత అవి ప్లీహం అనే భాగంలో నాశనం చెందుతాయి. కాబట్టి ప్లీహాన్ని ఎర్ర రక్తకణాల శ్మశాన వాటిక అంటారు.
రక్తహీనత: ఎర్ర రక్తకణాల పరిపక్వతకు, హీమోగ్లోబిన్ తయారీకి ఇనుము, విటమిన్ ఆ9, విటమిన్ ఆ12 అవసరమవుతాయి. ఇనుము లోపిస్తే న్యూట్రిషనల్ రక్తహీనత సంభవిస్తుంది. విటమిన్ ఆ9 (ఫోలిక్ ఆమ్లం) లోపం వల్ల మెగలోబ్లాస్టిక్/ మ్యాక్రోసిస్టిక్ రక్తహీనత వస్తుంది. విటమిన్ ఆ12 (సయనోకోబాలమిన్) లోపం వల్ల పెర్నీసియస్ రక్తహీనత కలుగుతుంది.
తెల్లరక్త కణాలు లేదా ల్యూకోసైట్స్ ప్రతి ఘనపు మిల్లీమీటర్ రక్తంలో 4000 నుంచి 12,000 వరకు ఉంటాయి. అస్థిమజ్జలోని మైలోబ్లాస్ట్స్ అనే పూర్వకణాల నుంచి తెల్లరక్త కణాలు ఏర్పడే విధానాన్ని ‘ల్యూకోపాయిసిస్’ అంటా రు. తెల్లరక్తకణాలు రెండు రకాలు. అవి: గ్రాన్యులోసైట్స్, ఏగ్రాన్యులోసైట్స్. గ్రాన్యులోసైట్స్‌లో కేంద్రకం చుట్టూ కణద్రవ్యంలో ప్రత్యేక కణికలు ఉంటాయి. వీటి కేంద్రకం భిన్న ఆకారాల్ల్లో కనిపిస్తుంది. కాబట్టి గ్రాన్యులోసైట్స్‌ను బహురూప కేంద్రక తెల్ల రక్తకణాలు అంటారు.
ఇవి తిరిగి మూడు రకాలు - అసిడోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్. అసిడోఫిల్స్‌ను ఈసినోఫిల్స్ అని కూడా అంటారు. ఇవి అలర్జీ చర్యల్లో అలెర్జన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తాయి. వీటి సంఖ్య అసాధారణంగా పెరగడాన్ని ‘ఈసినోఫీలియా’ అంటారు. మొత్తం తెల్ల రక్తకణాల్లో ఇవి 2-8 శాతం ఉంటాయి. పేగులో క్రిములను బేసోఫిల్స్ నియంత్రిస్తాయి. తెల్ల రక్తకణాల్లో అధిక సంఖ్యలో (60-68 శాతం) న్యూట్రోఫిల్స్ ఉంటాయి. ఇవి ప్రధాన భక్షక కణాలుగా వ్యవహరిస్తాయి. వ్యాధి కారకాలను భక్షించి, నాశనం చేస్తాయి.
ఏగ్రాన్యులోసైట్స్ అనే తెల్లరక్తకణాలు రెండు రకాలు - మోనోసైట్స్, లింఫోసైట్స్. మోనోసైట్స్ కూడా భక్షక కణాలుగా వ్యవహరిస్తాయి. ఇవి శరీర అవయవాల్లోకి చేరి మ్యాక్రోఫేజ్‌లుగా మారి, భక్షక క్రియను నిర్వహిస్తాయి. తెల్ల రక్తకణాల్లో లింఫోసైట్స్ కీలకమైనవి. ఇవిరోగ నిరోధకశక్తిని అందిస్తాయి. ఇవి ప్రధానంగా రెండు రకాలు - ఖీ-లింఫోసైట్స్, ఆ-లింఫోసైట్స్. ఖీ-లింఫోసైట్స్ తిరిగి రెండు రకాలు. ఇఈ4/ ఖీ4 కణాలు, ఇఈ8 కణాలు.
వీటిలో ముఖ్యమైనవి ఖీ4 కణాలు. హెచ్‌ఐవీ ప్రధానంగా వీటిపైనే దాడి చేస్తుంది. ఖీ లింఫోసైట్స్ ద్వారా లభించే ఇమ్యునిటీని సెల్యులార్ ఇమ్యునిటీ అంటారు. ఆ-లింఫోసైట్స్ ద్వారా లభించేది హ్యుమొరల్ ఇమ్యునిటీ. ఆ-లింఫోసైట్స్ వ్యాధి కారకానికి విరుద్ధంగా ప్రతిదేహకాలను (అ్టజీఛౌఛీజ్ఛీట) విడుదల చేసి ఇమ్యునిటీని అందిస్తాయి.
రక్త ఫలకికలు (ఆౌౌఛీ ్క్చ్ట్ఛట) పూర్తి కణాలు కావు. ఎముక మజ్జలోని మెగా క్వారియోసైట్స్ విచ్ఛిన్నమవడం ద్వారా రక్త ఫలకికలు ఏర్పడతాయి.
రక్తంలో ప్రతి మిల్లీమీటర్‌కు 2-2.5 లక్షల రక్త ఫలకికలు ఉంటాయి. సకశేరుకాల్లో ఇవి క్షీరదాల్లో మాత్రమే ఉంటాయి. మిగతా సకశేరుకాల్లో వీటి స్థానంలో థ్రాంబోసైట్స్ అనే తెల్ల రక్తకణాలు ఉంటాయి. రక్తస్కంధన ప్రక్రియను రక్త ఫలకికలు ప్రారంభిస్తాయి. ఏదైనా భాగంలో గాయమైనప్పుడు రక్త ఫలకికలు విచ్ఛిన్నమై థ్రాంబోప్లాస్టిన్ అనే ఎంజైమ్‌ను విడుదల చేస్తాయి. ఇది వెంటనే రక్తంలోని ప్రోథ్రాంబిన్‌ను థ్రాంబిన్‌గా మారుస్తుంది. ఇలా ఏర్పడిన థ్రాంబిన్ కాల్షియం సమక్షంలో రక్తంలోని ఫైబ్రినోజెన్‌ను ఫైబ్రిన్‌గా మారుస్తుంది. ఈ ఫైబ్రిన్ అనే ప్రోటీన్ వెంటనే పోగులుగా అల్లుకొని ఒక సంక్లిష్ట జాలకాన్ని ఏర్పర్చడం వల్ల రక్తం కారడం ఆగిపోతుంది.
ఈ రక్త స్కంధన ప్రక్రియలో ప్రోథ్రాంబిన్, థ్రాంబోప్లాస్టిన్, ఫైబ్రినోజెన్, కాల్షియం కలుపుకొని మొత్తం 13 రక్త స్కంధన కారకాలు పాల్గొంటాయి. అదనంగా విటమిన్ కె లాంటి అనుబంధ రక్త స్కంధన కారకాలు కూడా పాల్గొంటాయి. ఏ చిన్న గాయమైనా, రక్తం గడ్డకట్టని జన్యువ్యాధిని ‘హీమోఫీలియా’ అంటారు. దీన్నే రాయల్ లేదా బ్లీడర్‌స డీసీజ్ అంటారు. ఇది
రెండు రకాలు.
1) హీమోఫీలియా - అ: ఇది గఐఐఐవ రక్తస్కంధన కారక లోపం వల్ల వస్తుంది.
2) హీమోఫీలియా - ఆ: ఇది ఐగీవ రక్త స్కంధన కారక లోపం వల్ల వస్తుంది.
రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా నిరోధించే రక్త స్కంధన నివారిణి హిపారిన్. జలగ, ఆడదోమలు లాంటి రక్తాన్ని పీల్చే జీవుల లాలాజలంలోనూ ఈ రకమైన రక్త స్కంధన నివారిణులు ఉంటాయి.
గుండె - రక్త ప్రసరణ
శరీరంలోని వివిధ భాగాల నుంచి రక్తాన్ని సేకరించి, మళ్లీ అన్ని భాగాలకు సరఫరా చేసే కండర నిర్మాణం గుండె. ఊపిరితిత్తుల మధ్య ఉన్న మీడియాస్టీనియం అనే కుహరంలో గుండె ఎడమవైపున అమరి ఉంటుంది. గుండె శాస్త్రీయ అధ్యయనాన్ని ‘కార్డియాలజీ’ అంటారు. మానవునిలో నాలుగు గదుల గుండె ఉంటుంది. పై గదులను కర్ణికలు, కింది గదులను జఠరికలు అంటారు. గుండెలోని ఎడమ కర్ణిక, ఎడమ జఠరిక ద్వారా మంచి రక్తం; కుడి కర్ణిక, కుడి జఠరిక ద్వారా చెడు రక్తం ప్రసరిస్తుంది. ఇలా మంచి, చెడు రక్తం వేర్వేరుగా ప్రసరించడాన్ని ‘ద్విరక్త ప్రసరణ’ అంటారు.
మానవుని గుండె మయోజెనిక్ రకం. ఈ రకమైన గుండె లయ ఒక కండర కణుపులో మొదలవుతుంది. ఇలాంటి కండరకణుపును లయారంభకం అంటారు. ఇవి రెండు ఉంటా యి. మొదటిది, ప్రధానమైంది సిరా కర్ణికా కణుపు. ఇక్కడ మొదలైన సంకోచ తరంగాలు కర్ణికలకు మాత్రమే పరిమితమవుతాయి. వీటిని జఠరికలకు చేరవేసేందుకు కర్ణిక జఠరికా కణుపు అనే రెండో లయారంభకం ఉంటుంది. ఇది మొదటి లయారంభకం నుంచి సంకోచ తరంగాలను గ్రహించి, ్కఠటజుజ్జ్ఛీ పోగుల ద్వారా జఠరికలకు చేరవేస్తుంది.
కర్ణికలు సంకోచించి, రక్తం జఠరికలకు చేరుతుంది. జఠరికలు సంకోచించినప్పుడు రక్తం తిరిగి కర్ణికలలోకి చేరకుండా కర్ణికలు - జఠరికల మధ్య ప్రత్యేక కవాటాలు ఉంటాయి. ఎడమ కర్ణిక - జఠరికల మధ్య మిట్రల్/ అగ్రద్వయ కవాటం ఉంటుంది. కుడి కర్ణిక, జఠరికల మధ్య అగ్రత్రయ కవాటం ఉంటుంది.
శరీరంలో రక్తం ప్రత్యేక రక్తనాళాల ద్వారా ప్రసరిస్తుంది. ఇవి రెండు రకాలు - ధమనులు, సిరలు. ధమనులు శరీరం లోపలు ఉంటాయి. ఇవి ఎప్పుడూ గుండె నుంచి ఇతర భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంటాయి. వీటిలో కవాటాలు ఉంటాయి. రక్త కేశనాళికలతో అంతమవుతాయి. సిరలు శరీర ఉపరితలంలో ఉంటాయి. ఇవి ఎప్పుడూ గుండెకు రక్తాన్ని తీసుకువస్తాయి. వీటిలో కవాటాలు ఉంటాయి. రక్త కేశనాళికలతో మొదలవుతుంది.
రక్తనాళాల శాస్త్రీయ అధ్యయనాన్ని ‘ఆంజియాలజీ’ అంటారు.శరీరంలోని సిరలన్నీ వివిధ భాగాల నుంచి సేకరించిన మలిన రక్తాన్ని, మహాసిరల ద్వారా ‘గుండె’ కుడి కర్ణికలోకి విడుదల చేస్తాయి. ఒక్క పుపుస సిర మాత్రమే ఊపిరితిత్తుల నుంచి సేకరించిన మంచి రక్తాన్ని గుండె ఎడమ కర్ణికలోకి విడుదల చేస్తుంది. కర్ణికల సంకోచం ద్వారా రక్తం జఠరికలను చేరుతుంది. ఎడమ జఠిరక నుంచి మహాధమని ద్వారా మంచి రక్తం శరీర ధమనులన్నింటికీ చేరుతుంది. ఒక పుపుస ధమని ద్వారా మాత్రమే చెడు రక్తం కుడి జఠరిక నుంచి ఊపిరితిత్తులకు చేరుతుంది.
మాదిరి ప్రశ్నలు
1. ఎర్ర రక్త కణాలు లేని రక్త భాగం ఏది?
1) ప్లాస్మా 2) సీరం
3) శోషరసం 4) ఏదీకాదు
2. ఎముక మజ్జలోని ఏ పూర్వ కణాల నుంచి ఎర్ర రక్తకణాలు ఏర్పడతాయి?
1) నార్మోబ్లాస్ట్స్ 2) మెగాక్యారియోసైట్స్
3) మైలోబ్లాస్ట్స్ 4) ల్యూకోసైట్స్
3. రక్తం ఞఏ విలువ?
1) 5.5-6.5 2) 7.2 - 7.4 3) 8.5 - 9.0 4) 10 - 12
4. రక్త హీనత ప్రధాన లక్షణం
1) అలసట 2) మానసిక మాంద్యత
3) ప్లీహం వాపు 4) పైవన్నీ
5. ఏ వ్యాధికి నిరోధక శక్తి అభివృద్ధి చేసుకునే ప్రక్రియలో మానవునిలో కొడవలి కణ రక్త హీనత కలుగుతుంది?
1) టైఫాయిడ్ 2) మలేరియా
3) ఎన్సిఫలైటిస్ 4) చికున్‌గున్యా
6. {పతి 100 ఎం.ఎల్. రక్తంలో ఎంత హీమోగ్లోబిన్ ఉంటుంది?
1) 8 గ్రా. 2) 15 గ్రా.
3) 15 మి.గ్రా. 4) 20 మి.గ్రా.
7. ఒక హీమోగ్లోబిన్ అణువులో ఎన్ని ఫై అయాన్లు ఉంటాయి?
1) 1 2) 2 3) 3 4) 4
8. శరీరంలోని ఏ భాగంలో శోషరస కణుపులు ఉంటాయి?
1) మెడ 2) చంక 3) గజ్జ 4) అన్నీ
9. ప్లీహం బరువు ఎంత?
1) 120 గ్రాములు 2) 30 గ్రాములు
3) 200 గ్రాములు 4) 70 గ్రాములు
10. ఎర్ర రక్త కణాల సంఖ్య అసాధారణంగా పెరగడాన్ని ఏమంటారు?
1) ల్యుకేమియా 2) ల్యూకోపీనియా
3) పాలీసైథీమియా 4) అనీమియా
11. దేశవ్యాప్తంగా విచ్చలవిడిగా విస్తరించిన అలర్జీ కారక వయ్యారిభామ మొక్క శాస్త్రీయ నామం?
1) ట్రెగియ ఇన్‌వాల్యుక్రీట
2) పార్థీనియం హిస్టిరోఫోరస్
3) స్ట్రిక్నాక్స్ నక్స్‌వోమిక్
4) కెలోట్రాపిస్ జెగాంటియా
12. అతి తక్కువ సంఖ్యలో ఉండే తెల్ల రక్తకణాలు?
1) అసిడోఫిల్స్ 2) బేసోఫిల్స్
3) మోనోసైట్స్ 4) లింఫోసైట్స్
13. భక్షక క్రియలో పాల్గొనే కణభాగాలు?
1) రైబోజోమ్‌లు
2) లైసోజోమ్‌లు
3) మైటోకాండ్రియా
4) గాల్జీ సంక్లిష్టం
సమాధానాలు
1) 3; 2) 1; 3) 2; 4) 4; 5) 2; 6) 2; 7) 4; 8) 4; 9) 4; 10) 3; 11) 2; 12) 2; 13) 2.