
బాలిక్‌పాపన్ (ఇండోనేషియా) : కనిపించకుండా పోయిన ఓ వ్యక్తి మొసలికి ఆహారంగా మారాడు. ఆఖరికి అతడి చేతులు, కాళ్లు మాత్రమే ఆ మొసలి పొట్టలో కనిపించాయి. ఈ విషయాన్ని ఇండోనేషియా పోలీసులు శుక్రవారం వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం ఓ పామాయిల్ తోటలో పనిచేసే వ్యక్తి దానికి సమీపంలోని నది ఒడ్డుకు వెళ్లాడు.
అయితే, అక్కడ అతడి బైక్, చెప్పులు మాత్రమే కనిపించాయి. దాంతో పోలీసులు ఆ నదిలో తీవ్రంగా గాలింపులు జరిపారు. అయితే, అందులో కొంత చిద్రమైన దేహం కనిపించింది. అదే సమయంలో ఒడ్డుకు సమీపంలోనే వారికి ఓ మొసలి కనిపించింది. దాంతో పోలీసులు దాన్ని కాల్చి చంపారు. అనంతరం దాని పొట్ట చీల్చి చూడగా అందులో ఆ వ్యక్తి కాలు, చేయి బయటపడ్డాయి. ఆ మొసలి దాదాపు ఆరు మీటర్లు (20 అడుగులు) పొడవుంది. బహుశా అతడు స్నానానికి దిగిన సమయంలో మొసలి దాడి చేసి ఉంటుందని పోలీసులు చెప్పారు. గతంలో కూడా ఆ మొసలి బారిన పడి ఓ రష్యన్ వ్యక్తి చనిపోయినట్లు వారు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment