వృద్ధాప్యంలో తామెవరో తమకే తెలియకుండా పోవడం... తమ సొంతవాళ్లను మాత్రమే కాదు... సొంత ఇంటినీ మరచిపోవడం ఎంత దురదృష్టకరం. అయితే ముందునుంచీ జాగ్రత్తపడితే అలాంటి దురవస్థ రాకుండా కాపాడుకోవడం అంత కష్టం కాదు. చాలా ఈజీగా అనుసరించదగిన ఈ కింది సూచనలు పాటిస్తే చాలు...
బీపీ కంట్రోల్‌లో ఉంచుకోవాలి
బ్లడ్‌ప్రెషర్‌ను తరచూ చెక్ చేయించుకోవడం మంచిది. ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు రక్తపోటు ఎక్కువగా ఉండటం అన్న అంశం మతిమరపు(డిమెన్షియా)ను పెంచుతుంది. అది పరోక్షంగా అల్జీమర్స్‌కు దారితీయవచ్చు. అందుకే నిత్యం మన బీపీని అదుపులో ఉంచుకోవడం మేలు.
బ్లడ్ ప్రెషర్ నియంత్రణతో పాటు అల్జీమర్స్ నివారణకూ ఆహారంలో ఉప్పు తగ్గించడం చాలా ఉపకరిస్తుంది. కండరాల కదలికలు చురుగ్గా ఉన్నవారితో పోలిస్తే... మందకొడి కదలికలు ఉన్నవారిలో అల్జీమర్స్ వచ్చే అవకాశాలు 60 శాతం వరకు ఎక్కువగా ఉంటాయని ఓ అధ్యయనంలో తెలిసింది.
నడక మంచిదే
రోజూ 30 – 45 నిమిషాల పాటు నడక అల్జీమర్స్‌నే కాదు... ఆరోగ్యానికి అన్ని రకాలుగా మంచి చేస్తుంది. అందుకే ఇమ్యూనిటీని పెంచి ఎన్నో వ్యాధుల నివారణలతో పాటు పూర్తి ఆరోగ్యానికి దోహదం చేసే నడకను రోజూ కొనసాగించడం చాలా మంచిది.
వ్యాయామం శరీరానికి మాత్రమే కాదు... మనసుకు కల్పించడం కూడా అల్జీమర్స్ నివారణకు తోడ్పడుతుంది. అందుకే రోజూ పత్రికల్లో లేదా సోషల్ మీడియాలో కనిపించే పజిల్స్, సుడోకూ, గళ్లనుడికట్టు వంటి మెదడుకు మేత కల్పించే అంశాలు ప్రాక్టీస్ చేస్తుండటం మేలు.
సృజనాత్మకంగా ఆలోచిస్తే..
సృజనాత్మకంగా ఆలోచించేవారికి అల్జీమర్స్ అవకాశం కాస్త తక్కువ. అందుకే మంచి ఊహాకల్పనలతో సృజనాత్మకంగా ఆలోచిస్తూ ఉండటం... ఆహ్లాదంగా, ఆనందంగా ఉంచడంతో పాటు అల్జీమర్స్‌నూ నివారిస్తుంది. అందుకే ఇష్టమైన, అభిరుచి ఉన్న కళలను ప్రాక్టీస్ చేస్తుండటం ఎంతో మేలు.
నోట్: ఇది ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి మాత్రమే అందించిన కథనం. వైద్యుడిని సంప్రదిస్తే సమస్యకు తగిన పరిష్కారం లభిస్తుంది.
చదవండి: ADHD: చురుకైన పిల్లాడని మురిసిపోకండి! ఈ లక్షణాలు ఉంటే..
తలనొప్పి.. ఛాతిలో నొప్పి.. పాదాలు- అరిచేతులు చల్లగా అవుతున్నాయా? ఇవి తిన్నా, తాగినా..
Comments
Please login to add a commentAdd a comment