పచ్చదనంతో డయాబెటిస్ దూరం!
న్యూఢిల్లీ: పచ్చదనం కలిగిన పరిసరాల్లో నివసిస్తున్న వారు మధుమేహం, రక్తపోటు లాంటి వ్యాధులకు దూరంగా ఉన్నట్లేనని ఓ పరిశోధనలో తేలింది. అమెరికాకు చెందిన 65 ఏళ్ల వయస్సు దాటిన రెండున్నర లక్షల మంది మెడికల్ రికార్డులను 2010-11లో సేకరించారు. ఈ రిపోర్టులను, వారు నివసించే పరిసరాలను నాసా ఉపగ్రహ చిత్రాల సహాయంతో పరీక్షించి ఈ విషయం వెల్లడించారు.
పచ్చదనం ఉన్న పరిసరాల్లో జీవించేవారు మిగతావారితో పోలిస్తే అధికంగా సంపాదిస్తున్నారని పరిశోధకులు తెలిపారు. ‘ఈ పరిసరాల్లో నివసించే వ్యక్తులకు అధిక కొవ్వు, మధుమేహం, రక్తపోటు సమస్యలు చాలా తక్కువగా వస్తున్నాయి. మధుమేహం 14 శాతం, రక్తపోటు 13 శాతం, కొవ్వు సమస్యలు 10 శాతం వ రకు తగ్గాయి’ అని మియామి యూనివర్సిటీ పరిశోధకులు స్కాట్ బ్రౌన్ తెలిపారు.