Greenery
-
సహారాలో పచ్చందనం
సహారా. ప్రపంచంలోనే అతి పెద్ద ఎడారి. కనుచూపుమేర సుదూరాల దాకా పరుచుకున్న ఇసుక మేటలు. ఏళ్ల తరబడి వాన ఆనవాలు కూడా కనిపించని ప్రదేశాలకు ఆలవాలం. అలాంటి సహారా పచ్చబడుతోంది. నీళ్లు నిండిన మడుగులు, పచ్చని గడ్డితో, అప్పుడప్పుడే ప్రాణం పోసుకుంటున్న పలు జాతుల మొక్కలతో కనువిందు చేస్తోంది...! వాతావరణ మార్పులు సహారాను కూడా వదలడం లేదు. పశి్చమ ఆఫ్రికాలోని ఈ ఎడారిలో అరుదైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. భారీ వర్షాలు ఈ ప్రాంతాన్ని కొద్ది రోజులుగా ముంచెత్తుతున్నాయి. అసలు వాన చినుకే పడని ప్రాంతాలు కూడా కుండపోతతో తడిసి ముద్దగా మారుతున్నాయి. దాంతో సహారాలో విస్తారంగా గడ్డి మొలుస్తోంది. పలు రకాల మొక్కలు పుట్టుకొస్తున్నాయి. ఏకంగా అంతరిక్షం నుంచి నాసా తీసిన తాజా చిత్రాల్లో ఎడారిలోని విస్తారమైన ప్రాంతం ఆకుపచ్చగా కనిపిస్తోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు! చాద్ రిపబ్లిక్, సూడాన్, ఎరిత్రియా, మాలి, నైగర్ వంటి పలు దేశాల్లో సహారాలోని విస్తారమైన ప్రాంతం పచ్చని కళ సంతరించుకుని కనిపిస్తోంది. భారీ వర్షాలు సహారాలోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. ముఖ్యంగా సెపె్టంబర్ 7, 8 తేదీల్లో కుండపోత కురిసింది. ఆ ప్రాంతాల్లో సాధారణంగా కొన్నేళ్లలో పడాల్సిన వాన కేవలం ఆ రెండు రోజుల్లోనే నమోదైంది. దాంతో ఎన్నడూ నీటి ఆనవాళ్లకు కూడా నోచుకోని విస్తారమైన ఇసుక మేటలు కాస్తా కొలనులుగా మారి ఆశ్చర్య పరుస్తున్నాయి. ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ (ఐటీసీజెడ్)లో మార్పులే దీనికి కారణమని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో ఆఫ్రికాలోని ఉష్ణమండల గాలులు ఉత్తర దిశ నుంచి వచ్చే పొడి గాలితో భూమధ్యరేఖ సమీపంలో కలుస్తుంటాయి. ఫలితంగా తుపాన్లు, భారీ వానలు ఏర్పడే ప్రాంతాన్నే ఐటీసీజెడ్గా పిలుస్తారు. ఈ సీజన్లో ఇది సహారా ఎడారికి సమీపంగా జరిగింది. వానలు, వరదలకు కారణమయ్యే లా నినా పరిస్థితులు ఇందుకు తోడయ్యాయి. ఈ విపరీతమైన వాతావరణ పరిస్థితుల కారణంగా సహారా పరిధిలోని పలు ప్రాంతాల్లో రెండు నుంచి ఆరు రెట్లు ఎక్కువ వర్షపాతం నమోదైంది. దాంతో పలు దేశాల్లో 40 లక్షల మందికి పైగా తీవ్రంగా ప్రభావితులయ్యారు. వెయ్యికి పైగా మరణాలు సంభవించాయి. 21 వేల ఏళ్లకోసారి... సహారా ఎడారి ప్రతి 21 వేల ఏళ్లకోసారి పూర్తిగా పచ్చదనం సంతరించుకుంటుందట. విస్తారమైన అడవులు, నదులు, సెలయేళ్లు, గుట్టలతో కళకళలాడుతూ ఉంటుందట. కొన్ని వేల ఏళ్లపాటు ఇలా సాగాక తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా మళ్లీ విస్తారమైన ఇసుక మేటలతో ఎడారిగా మారిపోతుంది. ఒక్క చివరి మంచు యుగాన్ని మినహాయిస్తే గత 8 లక్షల ఏళ్లుగా ఇది క్రమం తప్పకుండా జరుగుతూ వస్తోందని సైంటిస్టులు తేల్చారు. భూ అక్షంలో 21 వేల ఏళ్లకు ఒకసారి కలిగే స్వల్ప మార్పులే ఇందుకు కారణమని గతేడాది జరిగిన ఒక అధ్యయనం తేలి్చంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పచ్చందాల కోక.. విశాఖ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఒక వైపు పచ్చని తూర్పు కనుమలు.. మరోవైపు నీలి సముద్రపు అలలతో అందంగా కనిపించే వాల్తేరు నగరం మరింత సుందరంగా రూపుదిద్దుకోనుంది. గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) పరిధిలోని సగం నగరం అందమైన నందనవనంగా ముస్తాబవనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 642 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన జీవీఎంసీ పరిధిలో 50 శాతం గ్రీనరీ ఏర్పాటుకు అన్ని వీధుల్లో నీడనిచ్చే చెట్లను నాటనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక యాప్ ద్వారా జీవీఎంసీ సర్వే చేస్తోంది. 98 వార్డుల్లో వార్డు ఎమినిటీస్ సెక్రటరీలకు సర్వే బాధ్యత అప్పగించారు. వారి పరిధిలోని 30, 40, 60, 80, 100 ఫీట్ల రోడ్లపై ఎక్కడెక్కడ చెట్లను పెంచే అవకాశం ఉందో సర్వే చేస్తున్నారు. ఇప్పటికే 400 చదరపు కిలోమీటర్ల మేర సర్వే పూర్తయినట్లు సమాచారం. దాదాపు 1,697 కిలోమీటర్ల మేర రోడ్ల వెంట 6 వేల చెట్లను నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ‘గ్రీనరీ మై స్ట్రీట్’ కాన్సెప్ట్‌తో.. వాస్తవానికి హుద్‌హుద్‌కు ముందు విశాఖ నగరంలో 44 శాతం మేర పచ్చదనం ఉండేది. హుద్ హుద్ తర్వాత 14 శాతానికి పడిపోయింది. కొద్దికాలంగా జీవీఎంసీ తీసుకుంటున్న చర్యలతో గ్రీన్ కవరేజ్ 35 శాతానికి చేరుకుంది. 10 లక్షల జనాభా దాటిన నగరాల్లో పచ్చ దనంలో దేశంలోనే మొదటిస్థానంలో ఉన్న విశాఖ.. 50 శాతం గ్రీనరీ లక్ష్యాన్ని చేరుకుంటే ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ పచ్చదనం ఉన్న నగరంగా రికార్డు సృష్టించనుంది. ఇందుకోసం ‘గ్రీనరీ మై స్ట్రీట్’ పేరుతో జీవీఎంసీ పచ్చదనం పెంపునకు చర్యలు చేపట్టింది. రహదారులతో పాటు వివిధ సంస్థల కార్యాలయాలు, ఖాళీ ప్రదేశాల్లో కూడా మొక్కలను నాటేందుకు సిద్ధమవుతోంది. ప్రపంచంలోనే నెంబర్ వన్ గ్రీన్ సిటీగా.. ప్రపంచవ్యాప్తంగా సింగపూర్ (45 శాతం) తర్వాత విశాఖ నగరంలోనే పచ్చదనం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం 35 శాతం ఉన్న పచ్చదనాన్ని వచ్చే ఏడాది కాలంలో 40 శాతానికి పెంచేలా జీవీఎంసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నిర్ణీత లక్ష్యం మేరకు 50 శాతం గ్రీనరీ ఏర్పాటైతే ప్రపంచంలోనే మొదటి స్థానంలో విశాఖ నగరం నిలవనుంది. తద్వారా 2 డిగ్రీల సెల్సియస్ మేర వేసవి తాపం కూడా తగ్గుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పందిరి తరహాలో.. ఏదో ఒక తరహా మొక్కలను కాకుండా.. పందిరి తరహాలో చెట్టు పెనవేసుకునిపోయేలా ఉండేలా జీవీఎంసీ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందుకోసం 30, 40 అడుగుల రోడ్ల వెంట ఇండియన్ చెర్రీ, టీ కోమా వెరైటీస్, పారిజాతం వంటి మొక్కలను నాటనున్నారు. 80, 100 ఫీట్ల రోడ్లలో మాత్రం నిమ్మ, వేప, బాదం, నిద్ర గన్నేరు వంటి మొక్కలను నాటనున్నారు. అయితే, రోడ్డుకు ఒక వైపు నాటే ఈ మొక్కలు ఏపుగా పెరగడంతో పాటు రోడ్డుకు ఆవలి వైపు వరకు కొమ్మలు విస్తరించి రహదారి మొత్తం నీడనిస్తాయి. ప్రధానంగా వేసవి కాలంలో ప్రయాణికులకు చలువ పందిళ్ల తరహాలో ఎండ నుంచి రక్షణ కలి్పస్తాయని జీవీఎంసీ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే నగరంలోని దయాళ్‌నగర్ వంటి ప్రాంతాల్లో పందిరి తరహా గ్రీనరీని జీవీఎంసీ అభివృద్ధి చేసింది. నగరంలోని మిగతా రోడ్లలోనూ ఈ పందిళ్లతో నగరం పచ్చదనంతో కళకళలాడనుంది. గ్రీనరీ కోసం ప్రత్యేక కార్యక్రమం విశాఖ నగరంలో 50 శాతం గ్రీనరీ లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమం చేపట్టాం. ఇందుకోసం వార్డుల వారీగా ఎమినిటీస్ సెక్రటరీల సహాయంతో 1,697 కిలోమీటర్ల మేర రోడ్ల సర్వే పూర్తి చేశాం. ఆ ప్రాంతాల్లో 6 వేల మొక్కలను నాటేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ఈ కసరత్తు నిరంతరం జరుగుతుంది. రానున్న ఏడాది కాలంలో 40 శాతం గ్రీనరీ లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ తర్వాత దీనిని 50 శాతానికి పెంచి, పచ్చదనంలో విశాఖను ప్రపంచంలోనే మొదటిస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నాం. – సాయికాంత్ వర్మ, జీవీఎంసీ కమిషనర్ -
పచ్చదనం పెరిగింది!
గత 20 ఏళ్లలో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా చెట్లతో కూడిన విస్తీర్ణం (ట్రీ కవర్) పెరిగింది. 2000–2020 మధ్యకాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే 13.09 కోట్ల హెక్టార్ల మేరకు ట్రీ కవర్ పెరిగిందని ‘ధరిత్రీ దినోత్సవం’సందర్భంగా వెలువరించిన ‘గ్లోబల్ ఫారెస్ట్ రివ్యూ’తాజా నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్ధ ‘వరల్డ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్’కు అనుబంధంగా గ్లోబల్ ఫారెస్ట్ రివ్యూ పనిచేస్తోంది. మరోవైపు ఎక్కువ విస్తీర్ణంలోనే పచ్చని అడవుల నరికివేత కొనసాగుతోంది. ఈ 20 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా నికరంగా 10.06 కోట్ల హెక్టార్లలో అడవుల్ని కోల్పోయినట్లు నివేదిక వెల్లడిస్తోంది అయితే 36 దేశాల్లో మొక్కలు నాటడం, కలప తోటలు, పండ్ల తోటల విస్తీర్ణం పెరుగుతున్నందున.. అడవులు, కలప/పండ్ల తోటలతో కలిపి పచ్చని చెట్ల విస్తీర్ణం నికరంగా పెరిగిందని గ్లోబల్ ఫారెస్ట్ పేర్కొంది. అయితే దీర్ఘకాలం ఎదిగిన అడవుల్ని నరికివేయటం వల్ల కలిగే పర్యావరణ నష్టాన్ని.. తాజా ట్రీ కవర్ పూర్తిగా భర్తీ చేయలేదని నివేదిక స్పష్టం చేసింది. పెరిగిన 13.09 కోట్ల హెక్టార్ల ట్రీ కవర్లో 91% (11.86 కోట్ల హెక్టార్లు) అడవులు ఉన్నాయి. ప్రకృతి సిద్ధమైన పెరుగుదలతో పాటు అడవుల పునరుద్ధరణ పథకాల అమలు ఇందుకు దోహదపడుతున్నాయి. మిగతా 9% (1.23 కోట్ల హెక్టార్లు)లో వాణిజ్యపరంగా సాగు చేస్తున్న యూకలిప్టస్, సుబాబుల్, ఆయిల్‌పామ్, రబ్బరు, పండ్ల తోటలు ఉన్నాయి. కలప తోటలు, పండ్ల తోటల సాగు ద్వారా పెరిగిన 1.23 కోట్ల హెక్టార్లలో దాదాపు సగం ఇండోనేసియాలోని ఆయిల్‌పామ్, బ్రెజిల్‌లోనే కలప తోటలే కావటం విశేషం. మలేసియా, ఉరుగ్వే, న్యూజిలాండ్ దేశాల్లోని ట్రీ కవర్లో 70% వాణిజ్య, ఉద్యాన తోటల వల్లనే సాధ్యమైంది. భారత్‌లో అడవులు, కలప / పండ్ల తోటలతో నికరంగా 8,74,100 హెక్టార్ల విస్తీర్ణంలో ట్రీ కవర్ పెరిగినట్లు గ్లోబల్ ఫారెస్ట్ రివ్యూ నివేదిక తెలిపింది. ఐరోపా దేశాల్లో 60 లక్షల హెక్టార్లలో.. సియా దేశాల్లోనూ అంతే. అడవుల పునరుద్ధరణ పథకాలను పెద్ద ఎత్తున అమలు చేయటం, వ్యవసాయ భూములను పడావుగా వదిలేయటంతో చెట్లు పెరగటం వల్ల ఈ నికర పెరుగుదల నమోదైనట్లు నివేదిక పేర్కొంది. ఇరవై ఏళ్లలో ట్రీ కవర్ నికరంగా పెరిగిన దేశాలు 36 ఉండగా అందులో చైనా, భారత్ కూడా ఉండటం విశేషం. ఐరోపా దేశాల్లో 60 లక్షల హెక్టార్లలో నికరంగా ట్రీ కవర్ పెరిగింది. భారత్, చైనా సహా అనేక మధ్య, దక్షిణాసియా దేశాల్లోనూ అంతే. అడవుల పునరుద్ధరణ పథకాలను పెద్ద ఎత్తున అమలు చేయటం, వ్యవసాయ భూములను పడావుగా వదిలేయటంతో చెట్లు పెరగటం వల్ల ఈ నికర పెరుగుదల నమోదైనట్లు నివేదిక పేర్కొంది. అత్యధికంగా చైనాలో.. అత్యధికంగా చైనాలో 21,44,900 హెక్టార్ల మేర ట్రీ కవర్ పెరుగుదల చోటు చేసుకుంది. భారత్‌లో 8,74,100 హెక్టార్ల మేర నికర ట్రీ కవర్ పెరుగుదల ఉంది. ఉరుగ్వే మినహా ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల్లోని ఏ దేశంలోనూ ట్రీ కవర్లో నికర పెరుగుదల లేదు. అడవుల నరికివేత, కార్చిచ్చుల నష్టం అక్కడ ఎంత ఎక్కువగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. -
ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ ప్రత్యేక ప్రణాళిక
-
సంస్కారవంతమైన నగరం!
మెక్సికో దేశపు రాజధాని మెక్సికో నగరం. కిక్కిరిసిన కాంక్రీట్ జంగిల్. అధిక జనసాంద్రత. మెట్రోపాలిటన్ ప్రాంత జనాభా 2.3 కోట్లు. సుదీర్ఘ చరిత్ర కలిగిన పురాతన నగరం. వలస పాలనకు ముందు ఇది అజ్టెక్ సామ్రాజ్యపు రాజధాని. నగరం చుట్టూతా లోతు తక్కువ మంచినీటి సరస్సులు, చిత్తడి నేలలు ఉన్నాయి. వీటి మధ్యలో మానవ నిర్మిత ద్వీపాలలో అనాదిగా సంప్రదాయ వ్యవసాయం జరుగుతోంది. ఈ వ్యవసాయక ద్వీప క్షేత్రాలను ‘చినాంపాస్’ అని పిలుస్తారు. వీటిని 2014లో మెక్సికో మెట్రోపాలిటన్ నగర పరిధిలోకి చేర్చారు. నగరం మొత్తం భూభాగంలో సుమారు 27.7%లో వ్యవసాయం విస్తరించింది. ఇందులో 99% విస్తీర్ణం చినాంపాస్లే ఆక్రమిస్తాయి. 5.10 లక్షల టన్నుల ఆహారోత్పత్తులను రైతులు పండిస్తున్నారు. నగరం లోపల జనావాసాల మధ్య ఇంటిపంటలు, కమ్యూనిటీ గార్డెన్లు, గ్రీన్ హౌస్‌లు, హైడ్రోపోనిక్ వ్యవస్థలు, మిద్దె తోటలు, నిలువు తోట(వర్టికల్ గార్డెన్స్)లు సాగవుతున్నాయి. వీటిలో నగరవాసులు 24.7 టన్నుల కూరగాయలు, పండ్లను ఏటా ఉత్పత్తి చేస్తున్నట్లు గత ఏడాది జరిగిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ, ఈస్ట్ చైనా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గ్వాటెమాలా స్కూల్ ఆఫ్ సోషల్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నిపుణులు ఉమ్మడిగా గత ఏడాది 75 అర్బన్ గార్డెన్లపై విస్తృత అధ్యయనం చేశారు. అర్బన్ గార్డెన్లలో పండించిన సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు ప్రజల ఆహారాన్ని మెరుగుపరచి ఆహార భద్రతను పెంపొందించాయి. ఆరోగ్యాన్ని మెరుగుపరచాయి. కొందరు అర్బన్ రైతులకు ఈ పంటల అమ్మకాలే జీవనాధారంగా మారాయి. ఔషధ, సుగంధ మూలికలు మెక్సికో ప్రజల సంప్రదాయ వైద్యంలో, ఆహార సంస్కృతిలో అంతర్భాగం. ఇప్పటి ఇంటిపంటల్లోనూ వీటికి పెద్ద పీట ఉందని అధ్యయనవేత్తలు తెలిపారు. సేంద్రియ ఇంటిపంటల సాగును వ్యాప్తిలోకి తేవటంలో ఇతర దేశాల్లో మాదిరిగానే మెక్సికో నగరంలో కూడా దశాబ్దాలుగా అనేక స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలు ముందంజలో ఉన్నాయి. ఈ కోవలోకి చెందినదే ‘కల్టివా సియుడాడ్’ కూడా. ఈ స్పానిష్ మాటలకు అర్థం ‘సంస్కారవంతమైన నగరం’. పేరుకు తగ్గట్టుగానే ఇది పనిచేస్తోంది. సేంద్రియ ఇంటిపంటలు, సామూహిక ఇంటిపంటల సంస్కృతిని వ్యాపింపజేయడానికి కృషి చేస్తోంది. ఆకాశ హర్మ్యాల నడుమ 1,650 చదరపు మీటర్ల స్థలంలో కల్టివా సియుడాడ్ కమ్యూనిటీ కిచెన్ గార్డెన్ పచ్చగా అలరారుతోంది. పట్టణ వ్యవసాయాన్ని విద్య, ఉత్పత్తి/ఉత్పాదక, చికిత్సా సాధనంగా ఉపయోగించడం దీని లక్ష్యం. సృజనాత్మకత ఉట్టిపడే ఎతైన మడుల్లో ఆకుకూరలు, కూరగాయలతో పాటు 135 జాతుల పండ్లు, ఇతర చెట్లతో ఈ ఆహారపు అడవి నిర్మితమైంది. పండించిన ఉత్తత్తుల్లో.. తోట పనిలో సాయపడిన వాలంటీర్లకు 30% ఇచ్చారు. 28% పొరుగువారికి తక్కువ ధరకే అమ్మారు. 34% రెస్టారెంట్లకు అమ్మారు. పేదలకు ఆహారాన్నందించే కమ్యూనిటీ సూప్ కిచెన్లకు కూడా కొంత భాగాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ విధంగా స్వీయ సహాయక ఉద్యాన తోటల పెంపకం ద్వారా మెక్సికో ‘సంస్కారవంతమైన నగరం’గా రూపుదాల్చింది! సామాజిక పరివర్తన సాధనం అర్బన్ అగ్రికల్చర్ ప్రభావశీలమైన సామాజిక పరివర్తన సాధనం. ఆహార సార్వభౌమాధికారం, ఆహార భద్రతల సాధనకు.. అలాగే వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికీ ఇదొక వ్యూహం. 12 ఏళ్లుగా మా కమ్యూనిటీ కిచెన్ గార్డెనింగ్ అనుభవం చెబుతోంది ఇదే. వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా మార్చి సారవంతమైన మట్టిని ఉత్పత్తి చేయడానికి, పోషకాల సాంద్రత కలిగిన కూరగాయలను పండించడం.. పంటలు, జంతువులు, పక్షుల జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం, ఉష్ణోగ్రతలను తగ్గించడంతో పాటు అంతస్తులకు అతీతంగా భుజం భుజం కలిపి పనిచేసేందుకు నగరవాసులకు సేంద్రియ ఇంటిపంటలు ఉపయోగపడుతున్నాయి. – గాబ్రిలా వర్గాస్ రొమెరో, ‘కల్టి సియుడాడ్’ డైరెక్టర్, మెక్సికో నగరం -
Interior Decoration: తక్కువ ఖర్చుతో అదిరిపోయే లుక్.. పచ్చని టీపాయ్!
పచ్చదనం చూస్తే మనసు పరవశించకుండా ఉండదు. కాంక్రీట్ అరణ్యంలో బాల్కనీలను హరిత హారాలుగా మార్చి పచ్చని ముచ్చట తీర్చుకుంటూంటారు. అయితే, లివింగ్ రూమ్‌లోనూ పచ్చదనాన్ని ఆస్వాదించవచ్చు. అదీ గ్లాస్ టీపాయ్తో. అలా లివింగ్ రూమ్‌లోకి తొంగి చూసే ఆ కొత్త అందం గురించి.. గ్లాస్ టాప్ .. ఇండోర్ ప్లాంట్స్: గ్లాస్ టాప్ సెంటర్ టేబుల్స్ కొన్ని నగిషీలు అద్దుకుంటూ.. ఇంకొన్ని వంకీలతో వయ్యారాలు పోతూ ఆకట్టుకుంటూంటాయి. వాటికి పచ్చదానాన్నీ అద్దితే..!? ఇంటికి వచ్చిన అతిథులు పచ్చికలో టీ, కాఫీలను ఆస్వాదిస్తున్న అనుభూతిని సొంతం చేసుకోరూ! అందుకే టేబుల్ గ్లాస్ టాప్ కింది భాగంలో ఇండోర్ ప్లాంట్స్‌ను పెంచేలా సెట్ చేసుకుంటే సరి! ప్రకృతి దృశ్యాల సోయగం: ప్రకృతి పరచిన పచ్చిక బయళ్ల పచ్చని తివాచీని డ్రాయింగ్ రూమ్ నడుమ పరవాలనుకుంటే నేచురల్ గ్రాస్‌తో సెంటర్ టేబుల్‌ను అలంకరించుకోవాలి. ఈ అలంకరణకు సంబంధించిన ఆన్లైన్ క్లాసులూ నెట్టింట కొలువుదీరి ఉన్నాయి. రంగు రంగుల మొక్కలు: ఇండోర్ ప్లాంట్స్‌లో చాలా వరకు చిట్టి చిట్టి మొక్కలను ఎంపిక చేసుకుంటే మంచిది. వాటిల్లో మళ్లీ పసుపు, పచ్చ, లేత గులాబీ రంగు మొక్కలను పెట్టుకుంటే ఆ అందం.. గ్లాస్ నుంచి బయటకు మరింత శోభాయమానంగా కనువిందు చేస్తుంది. కృత్రిమ పూల సొగసు: రంగురంగుల పూల సొగసుకు సిట్టింగ్ ఏరియాలోనూ సీట్ ఆఫర్ చేయాలనుకుంటే ఆర్టిఫిషియల్ మొక్కలను గ్లాస్ సెంటర్ టేబుల్ లోపల అలంకరించవచ్చు. ఇందుకోసం రంగులు, పువ్వులు, డిజైనర్ మొక్కలను... అభిరుచి మేరకు ఎంపిక చేసుకోవచ్చు. ఇలా తక్కువ ఖర్చుతో సెంటర్ టేబుళ్లను పచ్చగా మార్చి ..ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీని నింపొచ్చు.. అతిథుల ప్రశంసలనూ పొందొచ్చు! -
Annaatthe Mathew: అన్నేత్తే మాథ్యూ.. ఎవరీమె? వేల మంది సబ్స్క్రైబర్లు ఎందుకు?
వేసవి వస్తోంది. పరీక్షలు పూర్తయ్యేలోపు ఈ హాలిడేస్కి ఎక్కడికి వెళ్దాం? అనే ప్లాన్ మొదలవుతుంటుంది. అసలే రెండేళ్లుగా ఇంట్లోనే గడిచిపోయిన జీవితాలు ఇప్పుడు రెక్కలు విచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే టూర్ ప్లాన్ వేయడం సులభమే, కానీ ఇంట్లో పెంచుకుంటున్న మొక్కల సంరక్షణ ఎలా? మొక్కల ప్రేమికుల మనసును కలచి వేసే ఆవేదన ఇది. ఇందుకోసం ‘గ్రీక్స్ ఆఫ్ గ్రీన్’ యూ ట్యూబ్ చానెల్ నిర్వహిస్తున్న అన్నేత్తే మాథ్యూ సూచనలను అనుసరిద్దాం. ఇంతకీ అన్నేత్తే మాథ్యూ ఎవరు? ఆ వివరాలూ తెలుసుకుందాం. ఊరెళ్లే రోజు మొక్కలన్నింటికీ సమృద్ధిగా నీరు పోయాలి. కుండీలకు నేరుగా ఎండ తగిలితే మట్టి త్వరగా ఎండిపోతుంది. కాబట్టి కుండీలను నీడలో ఉంచాలి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో నీటిని నింపి మూతకు సన్నని సూదితో రెండు రంధ్రాలు చేసి బాటిల్‌ని తిరగేసి చెట్టు మొదట్లో అమర్చాలి. లలా చేయడం వల్ల మొక్క పాదుకు కొద్ది కొద్దిగా నీరు అందుతూ ఉంటుంది. ఇంట్లో వెడల్పు తొట్టె ఉంటే ఆ తొట్టెలో నీటిని నింపి ఆ నీటిలో మొక్కల కుండీలను ఉంచాలి. ఇలా చేయడం వల్ల కుండీల్లో ఉన్న తేమ ఎక్కువ కాలం నిలుస్తుంది. పెద్ద తొట్టె లేనప్పుడు కుండీలను ఉంచగలిగిన సైజ్ ప్లాస్టిక్ టబ్‌లు తెచ్చి అందులో నీటిని నింపి మొక్కల కుండీలను ఉంచవచ్చు. నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండడం వల్ల దోమల బెడద ఎదురవుతుంది. ఈ సమస్యను నివారించడానికి టబ్‌లోని నీటిలో మూడు చుక్కల హైడ్రోజెన్ పెరాక్సైడ్, మూడు చుక్కల డిష్ వాష్ లిక్విడ్ వేయాలి. ఇవన్నీ సాధ్యం కాకపోతే మరో సులువైన చిట్కా ఉంది. ఒక పాత్రలో నీటిని పోసి నూలు వస్త్రాన్ని తాడులా చేసి ఒక చివరను నీటి పాత్రలో, మరొక చివరను మొక్క మొదట్లో ఉండేటట్లు అమర్చాలి. నీటి పాత్ర నుంచి మొక్క పాదులోకి నూలు వస్త్రం తాడు సాయంతో తేమ అందుతూ ఉంటుంది. ఈ పద్ధతిలో ఒకే పాత్రలో ఎక్కువ నూలు తాళ్లను ఉంచి రెండో చివర్లను ఒక్కో పాదులో అమర్చడం ద్వారా ఎక్కువ మొక్కలకు నీటిని సరఫరా చేయవచ్చు. ఎనిమిదేళ్ల శ్రమకు దర్పణం మహారాష్ట్రకు చెందిన అన్నేత్తే మాథ్యూ తన ఇంటి ఆవరణలో మూడు వందల రకాల మొక్కలను పెంచుతోంది. ‘‘ముస్సోరీలోని బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు అక్కడి మొక్కలను చూస్తే ముచ్చటేసింది. వచ్చేటప్పుడు నాతోపాటు నలభై మొలకలను వెంట తెచ్చుకున్నాను. అప్పటి నుంచి నా జీవితం మొక్కలే లోకం గా మారిపోయింది. మొక్కలు చిగుళ్లు తొడగడం నుంచి మొగ్గ తొడగడం పువ్వు పూయడం ప్రతిదీ స్మార్ట్ ఫోన్లో రికార్డు చేసేదాన్ని. ఈ మొక్క ఫలానా, ఈ పువ్వు ఎన్ని రోజులు ఉంటుంది... వంటి వివరాలన్నీ ఎవరో ఒకరితో చెప్పాలనిపించేది. దాంతో నాలుగేళ్ల కిందట యూట్యూబ్ చానెల్ ప్రారంభించి నా మొక్కల వీడియోలను అప్లోడ్ చేయడం మొదలు పెట్టాను. దాదాపుగా ఎనిమిది నెలల వరకు నా చానెల్ గురించి ఎవరికీ తెలియదు. ఆ తర్వాత వ్యూయర్షిప్ చాలా వేగంగా పెరిగిపోయింది. మొక్కల పెంపకంలో నేను అనుసరిస్తున్న మెళకువలు, పరిరక్షణ పద్ధతులను కూడా వీక్షకులతో పంచుకుంటూ ఉండడంతో, అవన్నీ వారికి ఉపయుక్తంగా ఉంటున్నాయని మా వీక్షకుల నుంచి ప్రశంసలు కూడా వస్తున్నాయి. చాలా మంది మొక్కలను పెంచడం ఇష్టంగానే ఉంటోంది కానీ, ఓ వారం రోజులపాటు ఊరికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇబ్బంది అవుతోంది. తిరిగి వచ్చేటప్పటికి వాడిపోతాయనే భయంతో ఎక్కడికీ వెళ్లలేకపోతున్నాం అంటుంటారు. వాళ్ల కోసం ఈ చిట్కాలు’’ అంటారు అన్నేత్తే మాథ్యూ. ఆమె చానెల్‌కి ఎనభై వేల మంది సబ్స్క్రైబర్లున్నారు. ఎనిమిదేళ్లపాటు మొక్కలే లోకంగా జీవించిన మాథ్యూ సాధించిన పచ్చటి ప్రగతి ఇది. -
పెంబర్తి వరకు పచ్చదనమే...
సాక్షి, సిటీబ్యూరో: వరంగల్ జాతీయ రహదారి (163)పై పెంబర్తి వరకు ‘మల్టీలేయర్ ప్లాంటేషన్ గ్రీనరీ’ని పొడిగించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హెచ్ఎండీఏ సన్నాహాలు చేపట్టింది. ప్రస్తుతం రాయగిరి వరకు ఉన్న గ్రీనరీని సుమారు రూ.5 కోట్ల వ్యయంతో పెంబర్తి వరకు మల్టీ లేయర్ ప్లాంటేషన్ పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఔటర్‌రింగ్‌రోడ్డు, వరంగల్ హైవే వెంట పెంచిన ప్లాంటేషన్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. హెచ్ఎండీఏ గ్రీనరీపై ఇటీవల నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సైతం అధ్యయనం చేసింది. ♦యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ్మస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్న నేపధ్యంలో వరంగల్ హైవే మార్గంలో గ్రీనరీ పెంపుదలకు సహకరించాలని ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కానీ కేంద్రం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో సీఎం గ్రీనరీ పెంపుదలకు చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు సూచించారు. ♦ఈ మేరకు ఘట్ కేసర్ నుంచి రాయగిరి వరకు గతంలో నేషనల్ హైవే సెంట్రల్ మిడెన్ గ్రీనరీ బ్యూటిఫికేషన్ పనులను రూ.5.5 కోట్ల అంచనాలతో, 30 కిలోమీటర్ల పొడవున పూర్తి చేశారు. ♦దీంతో ఈ మార్గం ఆకుపచ్చ అందాలతో కనువిందు చేస్తోంది. ఈ గ్రీనరీని తాజాగా పెంబర్తి వరకు పొడిగించనున్నారు. మరోవైపు హెచ్ఎండీఏ చేపట్టిన గ్రీనరీపైన నేషనల్ హైవే జాయింట్ అడ్వయిజర్ (ప్లాంటేషన్) ఎ.కె.మౌర్య ప్రత్యేకంగా అధ్యయనం చేయడం గమనార్హం. -
యాదాద్రిలో వేసవిలోనూ హరితమయ శోభ..
సాక్షి, యాదగిరిగుట్ట(యాదాద్రి భువనగిరి) : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధితో పాటు కొండకు దిగువన ఉన్న ప్రాంతాలు హరితమయంగా కనిపిస్తున్నాయి. ఆకుపచ్చని మొక్కలతో యాదాద్రి కొండ చుట్టూ ఉన్న ప్రాంతాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆలయానికి వచ్చే చాలా మంది భక్తులు ఆ పచ్చదనంతో శోభను చూసి ఆనందపడుతున్నారు. వేసవిలోనూ.. రంగురంగుల పూల మొక్కలు.. ఆకర్షించే గ్రీనరీ.. పది అడుగుల మొక్కలు క్షేత్రానికి వచ్చే భక్తులను ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదంలోకి తీసుకెళ్తున్నాయి. మండుతున్న ఎండలకు భక్తులు, స్థానికులు ఈ పచ్చని అందాలను వీక్షిస్తూ సేద తీరుతున్నారు. ఈ మొక్కల సంరక్షణకు నిత్యం కూలీలు శ్రమిస్తున్నారు. -
ఇది నర్సన్న పూలగుట్ట!
కృష్ణశిలల సౌందర్యం.. ఫలపుష్పాల సోయగం.. మధ్యలో కొంగుబంగారమై విలసిల్లే యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహ క్షేత్రం. యాదాద్రిలో ఆధ్యాత్మిక శోభ సుగంధ పరిమళాలను అద్దుకుంటోంది. అందంగా అల్లుకున్న లతలు.. మదిదోచే పూదోటలు.. నేలపై హరివిల్లు విరిసినట్టు.. కనుచూపు మేర పచ్చదనం తివాచీలా పరుచుకుని వెల్లి‘విరి’స్తోంది. రూ.5 కోట్లతో చేపట్టిన మొక్కల పెంపకంతో యాదాద్రి పూలగుట్టను తలపిస్తోంది. వందకుపైగా ఫల, పుష్ప, ఔషధ, సుగంధ మొక్కలు, నీడనిచ్చే మహావృక్షాలు ఇక్కడ కనువిందు చేస్తున్నాయి. వీటిని థాయ్‌లాండ్, బెంగళూరు, ఏపీలోని కడియంతో పాటు ప్రసిద్ధిచెందిన నర్సరీల నుంచి తెప్పించారు. ఇప్పటివరకు 90 శాతం మొక్కలు నాటడం పూర్తయ్యింది. 2021 జనవరి చివరి నాటికి పచ్చదనాన్ని సిద్ధం చేయాలనే సీఎం కేసీఆర్ ఆదేశాలతో పనుల్ని ముమ్మరం చేశారు. – సాక్షి, యాదాద్రి రాయగిరి నుంచి యాదాద్రికి వెళ్లేదారిలో రోడ్డుకు ఇరువైపులా, మధ్యలో పచ్చని చెట్లు, పూల మొక్కలు ‘యాదాద్రి’కి పసిడి శోభ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయంలోని క్యూలైన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ క్యూలైన్లను ప్రత్యేక టెక్నీషియన్లు బంగారు వర్ణంతో తీర్చిదిద్దుతున్నారు. ప్రధాన ఆలయ ముఖద్వారం నుంచి స్వామిని దర్శించుకుని వెళ్లే వరకు పసిడి వర్ణంలో ఉండే ఈ క్యూలైన్లు ఆలయానికి మరింత శోభను తేనున్నాయి. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, యాదాద్రి భువనగిరి -
జనవరి నెలలో పశువుల యాజమాన్యం
చలికాలం ముసుగుపోయి జనవరి మధ్యలో ఎండలు వెల్లిగా మొదలవుతాయి. పశువుల యాజమాన్యం గురించి జనవరి నెలలో కొన్ని మెలకువలను పాటించవలసి ఉంది. ► వేసవి మొదలు కావడంతో ముందుగా మనకు కానవచ్చేది పచ్చిమేత కొరత వర్షాకాలంలో, శీతాకాలంలో ఎక్కువగా లభ్యమయ్యే పచ్చిమేతను సైలేజీ గడ్డిగాను, ‘హే’గాను తయారు చేసుకునే సమయమిది. పాతర గడ్డిని తయారు చేసుకొని వేసవి సమయంలో పశువులకు మేపుకోవచ్చు. ► పశువులను పొగమంచు నుంచి రక్షించుకోవాలి. లేకపోతే న్యూమోనియా వస్తుంది. ► పశువు శరీరంలో తగినంత వేడిని పుట్టించడానికి ప్రొటీన్ కేకులు, బెల్లం కలిపి పశువుకు మేపాలి. ► ఖనిజాల లోపం రాకుండా పశువుల కొట్టాల్లో ఖనిజలవణ మిశ్రమ ఇటుకలను వేలాడదీయాలి. ► జనవరి నెలలో తప్పనిసరిగా నట్టల మందు తాపించాలి. ► బాహ్య పరాన్న జీవుల బెడద నుంచి కాపాడుకోవడానికి కొట్టాల్లో తులసి, లెమన్‌గ్రాస్ లాంటి మొక్కలను వేలాడదీయాలి. ఆ వాసనకు కొన్ని పరాన్న జీవుల నియంత్రణ జరుగుతుంది. ► ఈగలు వాలకుండా వేపనూనె సంబంధిత ద్రావకాలను షెడ్లలో పిచికారీ చేయాలి. ∙జీవాల వలస సమయలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కిందటి వారం ‘సాగుబడి’ శీర్షికలో ప్రచురితమైంది. ► పశువుల్లో గాలికుంటు, పి.పి.ఆర్., చిటుక వ్యాధికి టీకా వేయించాలి. ► పండ్ల తోటలున్న వారు, వారి తోటల్లో స్టైలో హెమాటా లాంటి పశుగ్రాసాలను సాగు చేసుకోవాలి. – డా. ఎం.వి.ఎ.ఎన్. సూర్యనారాయణ (99485 90506), ప్రొఫెసర్–అధిపతి, డిపార్ట్మెంట్ ఆఫ్ లైవ్ స్టాక్ ఫామ్ కాంప్లెక్స్, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, తిరుపతి -
పచ్చని ఒడి.. సర్కారు బడి
సాక్షి,పెద్దవూర : పచ్చని చెట్లు.. ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే ఎవరికైనా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. స్వచ్ఛమైన పైరగాలి వీస్తుంటే పచ్చదనం పందిళ్ల మధ్యలో ప్రకృతిని ఆస్వాదిస్తూ పాఠాలను నేర్చుకోవడం ఎవరికైనా ఇష్టమే. పాఠశాలల్లో ఇలాంటి వాతావరణమే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మొక్కలు పెట్టినట్లుగా ఫొటోలకు ఫోజిచ్చి మరుసటి నాటినుంచి వాటి సంరక్షణను పూర్తిగా మరిచిపోతున్నారు అధికారులు. దీంతో నాటిన మొక్కలు నాటినట్లుగానే ఎండిపోతున్నా యి. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్న నినాదంతో ప్రభుత్వం ప్రతి సంవత్సరం లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ వన నర్సరీలను ఏర్పాటు చేసి ఉచితంగా పంపిణీ చేస్తుంది. లెక్కల్లో మాత్రం ఈ సంవత్సరం ఇన్ని లక్షల మొక్కలు నాటాము అని గొప్పలు చెప్పుకుంటూ చేతులు దులుపుకోవడం తప్ప ఆచరణలో మాత్రం అమలుకు నోచుకో వడం లేదు. ఒక మంచి పనిని పక్క వ్యక్తితో చే యించాలంటే ఆ పని తాను చేసి చూపించి ఆదర్శవంతంగా ఉంటేనే ఆ పని విజయవంతం అవుతుందనే విషయాన్ని నమ్మి ఆచరణలో పెట్టారు మండలంలోని చలకుర్తి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం త్రిపురనేని లక్ష్మీప్రభ. అలాంటి వా తావరణాన్ని కోరుకోవడటమే కాదు దానిని సాకా రం చేసుకుని ఆస్వాదిస్తున్నారు విద్యార్థులు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి పాఠశాల ఆవరణను పచ్చదనంతో నింపారు. నాటిన మొక్కలను విద్యార్థులు దత్తత తీసుకుని వాటిని సంరక్షించారు. గత నాలుగేళ్లుగా హరితహారం కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో నాటిన మొక్కలు పెరిగి పెద్దవై నీడను ఇవ్వడంతో పాటు పచ్చదనం పర్చుకుంది. రకరకాల మొక్కలు పాఠశాల ఆవరణలో హెచ్ఎం లక్ష్మీప్రభ, ఉపాధ్యాయులు ఔషద మొక్కలు, పూల మొక్కలు గాని కనిపిస్తే చాలు వాటిని కొనుగోలు చేసి పాఠశాలకు తీసుకువచ్చి వాటిని విద్యార్థులచే నాటిం చి విద్యార్థులకు దత్తత ఇస్తుంటారు. నాటిన మొక్కలను సైతం ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ గావిస్తూ సంరక్షిస్తుంటారు. ఇష్టంతో పెంచుతున్నా .. మేడంలు, సార్లు మొక్కల వల్ల కలిగే ప్రయోజనాలను చెప్పటంతో ప్రతి ఒక్కరము తలా రెండు మొక్కలను దత్తత తీసుకున్నాము. ఒకరికి ఒకరు పోటీపడుతూ పాఠశాల సెలవుదినాలలోనూ స్కూలుకు వచ్చి మొక్కలకు నీటిని పోసి పెంచుతున్నాము. ఇప్పుడు నేను పెంచుతున్న మొక్కలు చెట్లు అయ్యాయి. – బూరుగు అనూష, 4వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం.. మొక్కలు నాటి వాటిని పెంచడంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి వాటి సంరక్షణను విద్యార్థులకు అప్పగించాము. నిత్యం వారికి సలహాలు ఇస్తూ విద్యార్థులలో పోటీతత్వాన్ని పెంచుతూ మొక్కలను సంరక్షిస్తున్నాము. – కె.నాగరాజు, ఉపాధ్యాయుడు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తున్నాం.. పచ్చదనం అంటే నాకు ఎంతో ఇష్టం. పాఠశాలను పచ్చదనంతో నింపాలని అనుకున్నాను. హరితహారంలో భాగంగా నీడనిచ్చే కొన్ని మొక్కలను నాటాము. పూలమొక్కలు, పండ్ల మొక్కలు, ఔషద మొక్కలను బయటినుంచి కొనుగోలు చేసి నాటించాను. – త్రిపురనేని లక్ష్మీప్రభ, హెచ్ఎం, పీఎస్ చలకుర్తి -
పచ్చదనాన్ని పెంచడమే లక్ష్యం: జోగు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో పచ్చదనాన్ని 23 నుంచి 33 శాతానికి పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు మంత్రి జోగు రామన్న తెలిపారు. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఢిల్లీలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్ అధ్యక్షతన అన్ని రాష్ట్రాల అటవీ శాఖ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా పర్యావరణ కాలుష్య నియంత్రణలో రాష్ట్రాల పాత్ర, వ్యర్థాల నిర్వహణ, పచ్చదనం పెంపు అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి హాజరైన జోగు రామన్న తెలంగాణలో కాలుష్య నివారణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచేందుకు హరితహారం కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణలో హైదరాబాద్ ఉత్తమ రాజధాని నగరంగా ఇటీవల స్వచ్ఛ సర్వేక్షణ్ పురస్కారాన్ని అందుకుందని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణలో పర్యావరణానికి హాని కలిగిస్తున్న సంస్థలపై చర్యలు తీసుకుంటున్నామని, ప్రమాదకర స్థాయిలో వ్యర్థాలను విడుదల చేస్తున్న పరిశ్రమలను మూసేయిస్తున్నామని తెలిపారు. ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రభుత్వం సవాల్‌గా స్వీకరించిందని, 2022 నాటికి తెలంగాణను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా నిలపడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. సింగరేణి స్టాల్‌ను సందర్శించిన మంత్రులు.. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో సింగరేణి స్టాల్‌ను మంత్రి జోగు రామన్న సందర్శించారు. పర్యావరణ పరిరక్షణకు సింగరేణి కాలరీస్ తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ఆ సంస్థ ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేసింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి ఈటల రాజేందర్, ఎంపీలు వినోద్ కుమార్, కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా ఈ స్టాల్‌ను సందర్శించారు. -
కోతులతో తాజ్‌మహల్‌కి ముప్పు!
ఆగ్రా: ప్రపంచ పాలరాతి అద్భుత కట్టడం పరిసరాల్లో పచ్చదనం క్షీనించిపోతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దీనికి కొంత కారణం కోతులని వారు పేర్కొవడం గమనార్హం. మార్చి 21 అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ వేత్తలు బుధవారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ.. ‘తాజ్ పరిరక్షణ కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారంటూ 1996 నుంచి సుప్రీంకోర్టు ప్రభుత్వాలను ప్రశ్నిస్తూనే ఉంది. అయినప్పటికీ ప్రభుత్వాలలో చలనం కనిపించడంలేదు. ప్రస్తుతం పచ్చని అడవులు పోయి.., కాంక్రీటు అరణ్యాలు ఏర్పడుతున్నాయి. బర్జా ప్రాంతంలో బృందావనం నుంచి ఆగ్రా వరకు 12 పెద్ద అడవులు ఉండేవి. ఇప్పుడు వాటిపేర్లే మిగిలాయి. ఆకుపచ్చని ప్రాంతాలన్నీ గోధుమ, పసుపు, బూడిద రంగులోకి మారిపోతున్నాయి. బిల్డర్లు, అవినీతి ప్రభుత్వాలు కలిసి అటవీ భూములను అనైతికంగా వాడుతున్నారు. యమునా నదివరకు చెట్లను నాశనం చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లు, రోడ్ల నిర్మాణం వంటిపేర్లతో పచ్చని చెట్లను నరికేశారు. జాతీయ ప్రమాణాల ప్రకారం 33 శాతం అడవులు ఉండాలి, కానీ అది ఇక్కడ 7 శాతానికి పడిపోయింది. ఈ కారణాలన్నింటికి తోడు.. నాటిన మొక్కలను కోతులు వేళ్లతో సహా పీకేస్తున్నాయి. అటవీ సంరక్షణ చర్యలతోపాటు కోతుల సంఖ్యను నియంత్రించాల్సిన అవసరం కూడా ఉంద’ని పేర్కొన్నారు. -
పచ్చదనంతో పిల్లల మెదడుకు హాయి
లండన్: పిల్లల్ని పచ్చదనం ఎక్కువగా ఉండే పార్కుల్లో తిప్పడం వల్ల వారు చురుగ్గా ఉండటం గమనిస్తూనే ఉంటాం. ఇంటి చుట్టూ చెట్లు, పచ్చని వాతావరణం ఉంటే వాళ్ల మెదడు ఎదుగుదలకు మంచిదట. ఇది స్పెయిన్‌లోని బార్సెలోనా ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ శాస్త్రవేత్తలు అంటున్న మాట. పచ్చదనం వల్ల మెదడులో ఉండే తెల్లని, బూడిద రంగు పదార్థం ఎక్కువగా అవుతుందని, దానితో పిల్లల మెదడు ప్రశాంతంగా ఉండి, జ్ఞాపకశక్తి పెరగడానికి దోహదం చేస్తుందని చెబుతున్నారు. 253 మంది పాఠశాల విద్యార్థులను ఎమ్మారై స్కానింగ్‌తో పరీక్షించగా పచ్చదనంలో నివసించేవాళ్లలో మెదడు ఎదుగుదల బాగుందని గుర్తించామని తెలిపారు. -
‘మొక్క’వోని దీక్ష
పదేళ్ల ‘మొక్క’వోని దీక్షకు ఫలితం కాలనీకి పచ్చనిపందిరం. 50వ డివిజన్ నగరంలో ఉన్నప్పటికీ గ్రామీణ వాతావరణం భావన కలుగుతుంది. నాటిన ప్రతి మొక్కను కాపాడుకోవడమే దీక్షగా చేపట్టిన వీరు మిగతా ప్రాంతాల వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ► పదేళ్లుగా చెట్లు పెంచుతున్న కాలనీవాసులు ► ప్రత్యేక శ్రద్ధతో హరితహారం ► నగరానికి ఆదర్శంగా 50వ డివిజన్‌వాసులు కరీంనగర్‌కార్పొరేషన్: రాష్ట్రమంతా హరితహారం అంటూ ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటే నగరంలోని 50వ డివిజన్ వాసులు పదేళ్ల క్రితమే చెట్ల ప్రాముఖ్యతను గుర్తించారు. కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్నకాలంలో వారిప్రాంతాన్ని హరితహారంలా మార్చేందుకు నడుం బిగించారు. కాలనీలో ఎటూ వెళ్లిన పచ్చనిచెట్లు స్వాగతం పలుకుతుంటాయి. రోడ్డుకు ఇరువైపులా పచ్చని చెట్లను పెంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. శివారుకు పచ్చనితోరణం పదేళ్లుగా 50వ డివిజన్లోని వావిలాలపల్లి, బ్యాంకుకాలనీ, మెహర్‌నగర్, వాసవినగర్లకు చెందిన ప్రజలు ‘మొక్క’వోని దీక్ష చేపట్టారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి చిన్నపిల్లల్లా ఆలనాపాలనా చూస్తున్నారు. మండు వేసవిలో తాగేందుకు నీళ్లు దొరకని పరిస్థితిలోనూ మొక్కలు ఎండిపోకుండా డబ్బు వెచ్చించి ట్యాంకర్లతో నీళ్లు పోయించారు. డివిజన్లో ఏడాది క్రితం పెట్టిన మొక్కల నుంచి పదేళ్ల క్రితం నాటిన వృక్షాల వరకు బతికున్నాయంటే డివిజన్ వాసుల పట్టుదల ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏటా హరితహారమే ఏటా వర్షాకాలంలో మొక్కలు నాటడం సాంప్రదాయంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు సుమారు మూడు వేల మొక్కలు నాటి కరీంనగర్‌లోని పలు కాలనీలకు ఆదర్శంగా నిలిచారు. ఈ కాలనీల్లో వెయ్యి గృహాలుండగా, ప్రతి ఇంటికి మూడు మొక్కల చొప్పున మొక్కలు ఉన్నాయి. పెద్ద గల్లీలో పెద్దపెద్ద వృక్షాలు, చిన్న గల్లీల్లో పూల మొక్కలు, విద్యుత్ తీగల కింద పొట్టి మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. ఎవరి ఇంటి ముందున్న మొక్కలను వారే కాపాడుకోవడం బాధ్యతగా తీసుకున్నారు. ప్రతి మొక్కపై శ్రద్ధ కాలనీలోని ప్రతి మొక్కను కాపాడాలనే ఉద్దేశంతో బాధ్యతలు సమష్టిగా తీసుకుంటాం. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ముందుకెళ్తున్నాం. పదేళ్లుగా కాలనీలో చెట్లు పెంచుతున్నాం. నాటిన ప్రతి మొక్కను కాపాడుకుంటున్నాం. – సంపత్ పర్యావరణ పరిరక్షణకే.. పర్యావరణ పరిరక్షణకు చెట్లు పెంచుతున్నాం. నగరంలో ఉన్నప్పటికీ అందరం సమష్టిగా చెట్లు పెంచి గ్రామ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకున్నాం.సొంత ఖర్చులతో మొక్కలు నాటుతున్నాం. – ఒంటెల సుమ, కార్పొరేటర్ -
మొక్కల సరఫరాకు ఏర్పాట్లు
► రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న ► హరితహారం అమలుపై సమీక్ష ఆదిలాబాద్‌అర్బన్: ఈ యేడాది వర్షాకాలం ప్రారంభంలో గ్రామ పంచాయతీలు, నియోజకవర్గాల వారీగా మొక్కల సరఫరాకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న సూచించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో హరితహారం అమలు తీరుపై కలెక్టర్ ఎం.జ్యోతిబుద్ధప్రకాష్తో కలిసి అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఈ యేడాది వర్షకాలంలో మొక్కల పెంపకం, వచ్చే యేడాది మొక్కల పెంపకానికి సంబంధించిన విత్తన సేకరణపై చర్చించారు. హరితహారం పథకం ద్వారా అడవులు పూర్వ వైభవం సాధించే దిశగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, అటవీ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు కోరిన మొక్కలు అందించే దిశగా చర్యలు చేపట్టాలని, అప్పుడే హరితహారం జిల్లాలో విజయవంతం అవుతుందని చెప్పారు. జిల్లాలోని నర్సరీల ద్వారా పెంచిన మొక్కలు, గతేడాదిలో నాటిన మొక్కల సంరక్షణపై అధికారులతో చర్చించారు. జిల్లాలో గత రెండేళ్లలో నాటిన మొక్కల సంరక్షణ ఏవిధంగా ఉందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజల కోరిక మేరకు ఎక్కువ మొత్తంలో మొక్కలు సరఫరా చేసే విధంగా చూడాలని అన్నారు. నర్సరీల్లో పెంచుతున్న మొక్కలు, ఏయే రకాల మొక్కలు పెంచుతున్నారో అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు నర్సరీలను తనిఖీలు చేసి మొక్కల గురించి తెలుసుకోవాలని పేర్కొన్నారు. రానున్న యేడాదిలో నర్సరీల ద్వారా మొక్కల పెంపునకు ఇప్పటి నుంచే విత్తనాల సేరకణ చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్వో శంకర్, ఆర్డీవో సూర్యనారాయణ, జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
పూల భవనాల వనం
నిన్నమొన్నటివరకూ చెట్లతో కళకళలాడిన అడవులిప్పుడు కాంక్రీట్ జనారణ్యాలు అవుతున్నాయి. రోడ్డెక్కితే కనుచూపు మేర పచ్చదనం కరవై బోసిపోయిన వీధులే కనిపిస్తాయి. అయితే అక్కడక్కడైనా సరే.. ఈ దుస్థితి మారుతోంది. అపార్ట్మెంట్లలోనే భారీగా మొక్కలు పెంచడం.. ఇందుకోసం ప్రత్యేకమైన డిజైన్లు సిద్ధం చేస్తూండం మనం ‘వావ్ ఫ్యాక్టర్’లోనే చాలాసార్లు ప్రస్తావించాం. నగరీకరణ పెరిగిపోయి వాయుకాలుష్యం ప్రాణాలు తీస్తున్న క్రమంలో ఇప్పుడు చైనా ఇంకో అడుగు ముందుకేసింది.. అడవులను తెగనరికేసి నగరాలను కట్టేయడమన్న పాత పద్ధతికి స్వస్తి పలికి.. అడవులను పెంచి వాటిమధ్యల్లో భవనాలు కట్టేదామన్న ఆలోచనకు వస్తోంది. తేడా ఏమిటీ? ఫొటోలు చూడండి. అర్థమైపోతుంది. చైనాలోనీ లీఝౌ అనే ప్రాంతంలో నిర్మించబోయే అటవీ నగరమిది! అక్కడున్న పదిహేను లక్షల మందికీ సరిపడా భవనాలను నిర్మిస్తూనే.. మొత్తం నగరం పచ్చదనంలోనే మునిగిపోయి ఉండేలా దీన్ని డిజైన్ చేశారు ఇటలీకి చెందిన ఆర్కిటెక్ట్ స్టిఫానీ బోరీ. ఈ నగరంలో ఒకే ఒక్క ఎత్తైన భవనం ఉంటుంది. దీని చుట్టూ వంద నుంచి 200 వరకూ వేర్వేరు సైజులున్న భవనాలు కడతారు. ఈ ప్రాంతమంతా ఒక మినీ సిటీ మాదిరిగా ఉంటుంది. ఇలాంటివి ఐదింటిని ఒక పువ్వు ఆకారంలో అభివృద్ధి చేయడం.. ఇలాంటి పువ్వులు అనేకం పక్కపక్కనే ఏర్పాటు చేయడం బోరీ ప్లాన్‌లో భాగం. ఈ ఏడాది చివరికి నిర్మాణం మొదలుపెట్టి 2020 కల్లా పూర్తి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. భవనాలన్నీ పచ్చటి తీగలు, మొక్కలతో కప్పబడి ఉంటాయి కాబట్టి వాయుకాలుష్యం గణనీయంగా తగ్గుతుందని బోరీ అంచనా. బోరీ ఇప్పటికే ఇటలీలో బాస్కో వర్టికాలీ పేరుతో ఓ అపార్ట్మెంట్ అడవిని çసృష్టి్టంచిన విషయం తెలిసిందే. దీంతోపాటు చైనాలోని నాన్జింగ్ ప్రాంతంలో ఈయన ఓ ట్విన్ టవర్‌ను డిజైన్ చేశారు. ఈ భవనాల గోడలపై 23 జాతులకు చెందిన 2500 మొక్కల లతలు అల్లుకుని ఉంటాయి. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కృష్ణపట్నం పోర్టులో పచ్చదనం భేష్
కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ ముత్తుకూరు: పర్యావరణానికి మారుపేరుగా కృష్ణపట్నంపోర్టు పచ్చదనంతో పరిఢవిల్లుతోందని ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, సెంట్రల్ అటమిక్ ఎనర్జీ–స్సేస్ మినిస్టర్ జితేంద్రసింగ్ పేర్కొన్నారు. కృష్ణపట్నంపోర్టును ఆదివారం కేంద్రమంత్రి సందర్శించారు. పోర్టులో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఎగుమతి–దిగుమతి కార్యకలాపాలను పరిశీలించారు. జరుగుతున్న ప్రగతిని పోర్టు అధినేత చింతా శశిధర్, సీఈఓ అనీల్ ఎండ్లూరి వివరించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ దేశంలో త్వరతగతిన అభివృద్ధి చెందుతున్న ఓడరేవుల్లో కృష్ణపట్నంపోర్టు ఒకటిగా నిలిచిందన్నారు. కాలుష్య నివారణకు,పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు, స్వచ్ఛభారత్ అమలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. ఎగుమతి, దిగుమతుల్లో పురోగతి ద్వారా ఆర్ధికాభివృద్ధి సాధించడం సంతోషంగా ఉందన్నారు. వాణిజ్యవేత్తలు, పారిశ్రామికవేత్తలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడం పోర్టులో కల్పించారన్నారు. అనంతరం గోపాలపురంలోని కేఎస్ఎస్పీఎల్ సెక్యూరిటీ కేంద్రాన్ని సందర్శించారు. సెక్యూరిటీ గార్డుల గౌరవవందనం స్వీకరించారు. వనం–మనం కింద మొక్కలు నాటారు. సీవీఆర్ స్కూల్ విద్యార్థులతో ముచ్చటించారు. ఆస్పత్రి, వంటశాల, మొక్కల పెంపకం, స్కిల్ డెవలప్మెంట్ తరగతులు, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. పోర్టు అభివృద్ధిపై రూపొందించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ప్రిన్సిపల్ రాజేంద్రప్రసాద్, పీఆర్వో వేణుగోపాల్ పాల్గొన్నారు. -
ప్రకృతి‘రక్షక’ నిలయం
పోలీస్‌స్టేషన్ ఆవరణ అలుముకున్న పచ్చదనం పూలు, పండ్ల మొక్కల పెంపకం పార్కును తలపిస్తున్న వైనం ప్రకృతిపై ప్రేమ చూపితే ఆ ప్రాంతమంతా ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఆ ప్రదేశానికి వెళ్లాలి. నీడ నిచ్చే నేస్తాలను అక్కడి వారు కాపాడారు. ఫలితం హరితశోభితం... నందనవనం.. ప్రభుత్వ నిర్వహించే పార్కులను మైమరిపించే పచ్చదనం ఆ ప్రాంతం సొంతం. ఆ ఆవరణమంతా పచ్చదనం పరుచుకుంది. పూల, పండ్ల, మొక్కలు కృతజ్ఞతగా వాటి ఫలాలను వారికి అందిస్తున్నాయి. ప్రకృతికి వారు కొంత తోడ్పాటు నిచ్చారు. ప్రకృతి మాత్రం వారి చాలా ఇస్తోంది. నీడనిస్తోంది. ఫలాలనిస్తోంది. స్వచ్ఛమైన గాలినిస్తోంది. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తోంది. ఈ హరితవనం ఎక్కడో.. ఏ మూలనో లేదు. బజార్హత్నూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లోనే. స్టేషన్లోకి అడుగిడినప్పుడు గమనిస్తే చుట్టూ అంతా పచ్చదనమే. అనేక పూల, పండ్ల మొక్కలు, నీడనిచ్చే మొక్కలు, రకరకాల వృక్ష జాతులు స్టేషన్ ఆవరణలో సిబ్బంది నాటారు. స్టేషన్లో పచ్చదనం పరుచుకోవడం వెనుక గతంలో పని చేసిన ఎసై ్స చంద్రశేఖర్ కృషి అధికం. తదనంతరం వచ్చిన ప్రమోద్‌రావు చేసిన సేవలు ప్రశంసనీయం. ప్రస్తుత విధులు నిర్వహిస్తున్న ఎసై ్స ఆకుల శ్రీనాథ్ సైతం వారి బాటలోనే నడుస్తూ పోలీస్ స్టేషన్ ఆవరణాన్ని హరితశోభితం చేస్తున్నారు. – బజార్హత్నూర్ -
దక్షిణ కోనసీమ ఇందుకూరుపేట
ఇందుకూరుపేట: పచ్చని పొలాలు..పొడవాటి కొబ్బరి చెట్లు.. ఆహ్లాద వాతావరణంతో ఇందుకూరుపేట మండలం ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తుంది. వేసవికాలం, వర్షాకాలం తేడా లేకుండా పచ్చగా పరిఢవిల్లుతూ జిల్లా వాసులుకు దక్షణ కోనసీమగా నిలుస్తోంది. -
పంటలు కళకళ.. ఆశలు మిలమిల
రోజూ కురుస్తున్న వర్షాలు ఆనందంలో రైతన్నలు రాయికోడ్:ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పచ్చదనం సంతరించుకుని చేళన్నీ కళకళలాడుతున్నాయి. మండలంలోని రాయికోడ్, పీపడ్పల్లి, మహమ్మదాపూర్, యూసుఫ్పూర్, ఇటికేపల్లి, సింగితం, కర్చల్, ఇందూర్ తదితర 25 గ్రామ పంచాయతీల పరిధిలో ఈ ఏడాది 7,500 హెక్టార్లలో పత్తి పంటను సాగు చేస్తున్నారు. ప్రభుత్వం పత్తి సాగును తగ్గించాలని పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో గత ఏడాది కంటే ఈ ఏడాది పత్తి పంట సాగు విస్తీర్ణం 1500 హెక్టార్లు తగ్గింది. పది రోజులుగా విస్తారంగా వర్షాలు కురవడంతో పత్తి మొక్కల ఎదుగుదల జోరందుకుంది. ఏపుగా పెరుగుతున్న పత్తి సాళ్లలో రైతులు దౌరగొట్టే పనులు చేపడుతున్నారు. నిత్యం వర్షాలు కురుస్తుండటంతో గరకు నేలల్లో వర్షపు నీరు నిలుస్తోంది. దీంతో పంటకు నష్టం వాటిల్లకుండా రైతుకు అవసరమైన రసాయనాలను పిచికారి చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ నేపధ్యంలో రైతులు పత్తి పంట దిగుబడిపై ఈ ఏడాది భారీ ఆశలు పెట్టుకున్నారు. పత్తి పంట చేతికందే వరకు వాతావరణం అనుకూలిస్తే ఎకరా విస్తీర్ణానికి 10 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయని రైతులు పేర్కొన్నారు. అదేవిధంగా మండలంలో సాగు చేస్తున్న సోయాబీన్, పెసర, మినుము తదితర పంటలు సైతం ఆశాజనకంగా ఎదుగుతున్నాయి. మండలంలో ఈ ఏడాది 1,000 హెక్టార్లలో సోయాబీన్, 800 హెక్టార్లలో పెసర, 500 హెక్టార్లలో మినుము పంటలను సాగు చేస్తున్నారు. రెండేళ్లుగా సరైన వర్షాలు లేక తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నామని ఈసారైనా పంటలు పండి తమ ఇబ్బందులు తీరాలని రైతులు ఆకాంక్షిస్తున్నారు. -
పచ్చదనంతో డయాబెటిస్ దూరం!
న్యూఢిల్లీ: పచ్చదనం కలిగిన పరిసరాల్లో నివసిస్తున్న వారు మధుమేహం, రక్తపోటు లాంటి వ్యాధులకు దూరంగా ఉన్నట్లేనని ఓ పరిశోధనలో తేలింది. అమెరికాకు చెందిన 65 ఏళ్ల వయస్సు దాటిన రెండున్నర లక్షల మంది మెడికల్ రికార్డులను 2010-11లో సేకరించారు. ఈ రిపోర్టులను, వారు నివసించే పరిసరాలను నాసా ఉపగ్రహ చిత్రాల సహాయంతో పరీక్షించి ఈ విషయం వెల్లడించారు. పచ్చదనం ఉన్న పరిసరాల్లో జీవించేవారు మిగతావారితో పోలిస్తే అధికంగా సంపాదిస్తున్నారని పరిశోధకులు తెలిపారు. ‘ఈ పరిసరాల్లో నివసించే వ్యక్తులకు అధిక కొవ్వు, మధుమేహం, రక్తపోటు సమస్యలు చాలా తక్కువగా వస్తున్నాయి. మధుమేహం 14 శాతం, రక్తపోటు 13 శాతం, కొవ్వు సమస్యలు 10 శాతం వ రకు తగ్గాయి’ అని మియామి యూనివర్సిటీ పరిశోధకులు స్కాట్ బ్రౌన్ తెలిపారు. -
భావితరాలకు పచ్చదనం అందించాలి
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కోల్‌బెల్ట్ : భావితరాలకు పచ్చదనం అందించడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం హారితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. భూపాలపల్లి ఏరియా సింగరేణి యాజమాన్యం మంజూర్‌నగర్ క్వార్టర్స్ ఏరియాలో సామూహిక మొక్కలు నాటే కార్యక్రమానికి డిప్యూటీ సీఎం సోమవారం హాజరై మొక్కలు నాటారు. అనంతరం జరిగిన కార్యక్రమానికి భూపాలపల్లి ఏరియా సింగరేణి జీఎం పి.సత్తయ్య అధ్యక్షత వహించగా.. స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణలో అడవుల విస్తీర్ణం తగ్గుముఖం పట్టిందని, దీంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. మూడేళ్లలో 120 కోట్ల మొక్కలు పెంచాలని, ప్రతి జిల్లాకు ఏటా 4 కోట్లు, నియోజకవర్గానికి 40 లక్షలు, ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలు నాటాలని నిర్దేశించిందన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీలకతీతంగా సహకరించాలని కోరారు. ప్రభుత్వం రూ.40వేల కోట్లతో వాటర్‌గ్రిడ్ పథకాన్ని చేపట్టి ప్రతి ఇంటికి నల్లా నీరు అందించడానికి రూపకల్పన చేసిందన్నారు. నియోజకవర్గంలోని సుమారు 100 ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల్లో సింగరేణి సహకారంతో రానున్న మూడు నెలల్లో ఆర్ఓ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని యోచిస్తుందని ప్రకటించారు. స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ రాష్ట్రంలో కరెంట్ కోతలు లేకుండా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. సింగరేణి సంస్థ చేపడుతున్న మొక్కల పెంపకం కార్యక్రమం పట్ల స్పీకర్ అధికారులను అభినందించారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ బండారి సంపూర్ణ రవి, జెడ్పీటీసీలు మీరాబాయి, పాడి కల్పనాదేవి, ఎంపీపీ రఘుపతిరావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు టి.రవీందర్రావు, ఆర్డీఓ మహేందర్‌జీ, డ్వామా పీడీ జగన్, కౌన్సిలర్లు శిరుప అనిల్, ప్రమీల, నారాయణ, రాజవీరు, సింగరేణి అధికారులు ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాస్, సలీం, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రిన్సిపాల్‌పై డిప్యూటీ సీఎం ఆగ్రహం పరకాల : జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌పై డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. హరితహారంలో పాల్గొనేందుకు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సోమవారం వచ్చారు. మొక్కలు నాటే సమయంలో కళాశాల ప్రిన్సిపాల్ లేరా ప్రశ్నించారు. వెంటనే దూరంగా ఉన్న ప్రిన్సిపాల్ శేషాచారి డిప్యూటీ సీఎం వద్దకు వచ్చారు. నమస్తే సార్.. నేనే ప్రిన్సిపాల్ అంటూ ముందుకొచ్చారు. నున్వేనా ప్రిన్సిపాల్.. నీ జుట్టు ఏమిటి, నీ డ్రెస్ ఏమిటి.. ప్రిన్సిపాల్ లెక్కన ఉన్నావా అంటూ మందలించారు. ఎక్కడి నుంచి వస్తావు అని అనగానే.. వరంగల్ నుంచి వస్తానని చెప్పగానే.. ఏం ఇక్కడ ఉండవా అంటూ డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. నోటీసు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా అంటూ సీరియస్ అన్నారు. ఆ తరువాత ప్రిన్సిపాల్‌తో మొక్కను నాటించి మంచిగా చూసుకోవాలని సూచించారు. -
పచ్చదనం హరీ!
హుదూద్‌తో చెదిరిన ‘మహా’ అందం తొలగిస్తున్నా తరగని వృక్ష శకలాలు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు సాక్షి, విశాఖపట్నం : విశాఖ అందం చెదిరిపోయింది. నిన్నటి వరకు పచ్చదనంతో పరిఢవిల్లిన మహానగరం ఇప్పుడు మోడువారింది. ఎటు చూసినా నిర్జీవమైన చెట్లే అగుపిస్తున్నాయి. జాతీయ రహదారితో పాటు నగరంలో అంతర్గత రహదారుల్లో నేలకొరిగిన చెట్లన్నీ మాడిమసైపోయినట్టు కన్పిస్తున్నాయి. హుదూద్ దెబ్బకు మహానగరంలో వేలాది వృక్షాలు నేలకొరిగాయి. ఇక చుట్టుపక్కల కొండలపై నేలకొరిగిన వృక్షాలకైతే లెక్కేలేదు. వీటి సంఖ్య లక్షకు పైగానే ఉంటుందని అంచనా. నగరంలో తలలు తెగిపడినట్టుగా కనిపిస్తున్న వృక్షాలను మూడురోజులుగా తొలగిస్తూనే ఉన్నారు. మోడుగా మిగిలిన చెట్ల మానులు మళ్లీ చిగురుస్తాయేమోనని నగర వాసులు ఆశించారు. కానీ గురువారం నగరంలో ఏ చెట్టుచూసినా మాడిపోయినట్టుగా దర్శనమించడంతో వాటిని చూసిన నగరవాసులు కలత చెందుతున్నారు. నగరం చుట్టూ పచ్చదనంతో సుందర వనంగా కన్పించే కొండలపై ఉండే చెట్లు కూడా మాడిపోవడంతో బోడిగా దర్శనమిస్తున్నాయి. కొండవాలు ప్రాంతాల్లో ఉండే ప్రజలు రాళ్లు..రప్పలతో కన్పించిన కొండలను చూసి వ్యధా భరితులవుతున్నారు. పైనుంచి చూస్తే గ్రీన్‌సిటీగా కన్పించే మహానగరం నేడు కాంక్రీట్ జంగిల్‌గా క న్పిస్తోంది. నగరంలో పచ్చదనం మచ్చుకైనా కానరావడం లేదు. మహా నగరాన్ని ఇలా చూస్తామని మేమెప్పుడూ అనుకోలేదని ఎంవీపీ కాలనీకి చెందిన రిటైర్డు ఉద్యోగి సుందర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క గత రెండురోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇటు విద్యుత్ లేక, అటు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు.