
లండన్: పిల్లల్ని పచ్చదనం ఎక్కువగా ఉండే పార్కుల్లో తిప్పడం వల్ల వారు చురుగ్గా ఉండటం గమనిస్తూనే ఉంటాం. ఇంటి చుట్టూ చెట్లు, పచ్చని వాతావరణం ఉంటే వాళ్ల మెదడు ఎదుగుదలకు మంచిదట. ఇది స్పెయిన్‌లోని బార్సెలోనా ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ శాస్త్రవేత్తలు అంటున్న మాట.
పచ్చదనం వల్ల మెదడులో ఉండే తెల్లని, బూడిద రంగు పదార్థం ఎక్కువగా అవుతుందని, దానితో పిల్లల మెదడు ప్రశాంతంగా ఉండి, జ్ఞాపకశక్తి పెరగడానికి దోహదం చేస్తుందని చెబుతున్నారు. 253 మంది పాఠశాల విద్యార్థులను ఎమ్మారై స్కానింగ్‌తో పరీక్షించగా పచ్చదనంలో నివసించేవాళ్లలో మెదడు ఎదుగుదల బాగుందని గుర్తించామని తెలిపారు.