కల్వకుర్తి టౌన్: విధి నిర్వాహణలో పోలీస్‌స్టేషన్ వాచ్ ఇన్‌చార్జి కుప్పకూలి పడిపోయి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మంగళవారం కల్వకుర్తిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రమేష్ వివరాల ప్రకారం.. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో మూడు నెలల క్రితం డ్యూటీలో చేరిన శ్రీనివాస్ (51) వాచ్ ఇన్‌చార్జిగా పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి 9గంటల సమయంలో విధుల్లో ఉన్న ఆయనకు బీపీ తగ్గడంతో కిందపడిపోయాడు. వెంటనే అతన్ని కల్వకుర్తి ఆస్పత్రికి తరలించారు.
మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కువ అయినట్లు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని శ్రీనివాస్ స్వస్థలం నాగర్‌కర్నూల్ మండలం తూడుకుర్తికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. అయనకు భార్య, కూతురు ఉంది.
పోలీసుల నివాళి
డ్యూటీలో శ్రీనివాస్ చాలా నిబద్ధతో పనిచేసే వాడని కల్వకుర్తి డీఎస్పీ పార్థసారథి తెలిపారు. శ్రీనివాస్ చిత్రపటానికి సీఐ, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లతో కలిసిపూలమాలలు వేసి నివాళులు అరి్పంచారు. బాధిత కుటుంబాన్ని డిపార్టుమెంట్ తరుపున ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సీఐ ఆంజనేయులు, ఎస్‌ఐలు రమేష్, రాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment