
మనం తోడేసిన పాలు పెరుగుగా మారడానికి మనకు మేలు చేసే ఒక రకం బ్యాక్టీరియానే అన్న సంగతి మనకు తెలిసిందే. ఇలా పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా పుష్కలంగా ఉన్న పదార్థాలను ‘ప్రోబయాటిక్’ ఉత్పాదనలుగా మార్కెట్‌లో అమ్ముతున్న విషయమూ మనకు కొత్త కాదు. ప్రోబయాటిక్స్ ఉన్న ఆహారాలు అధిక రక్తపోటును తగ్గిస్తాయన్న విషయాన్ని ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు కొద్దికాలం కిందట ఒక అధ్యయనంలో తెలుసుకున్నారు.
ఈ సంగతి ఆస్ట్రేలియా నుంచి వెలువడే హెల్త్ జర్నల్ ‘హైపర్‌టెన్షన్’లోనూ ప్రచురితమైంది. ఒకవేళ మీకు హైబీపీ లేకపోయినా పరవాలేదు. పెరుగూ, ఒకింత పులిసిన అట్ల వంటి టిఫిన్లు పుష్కలంగా తీసుకుంటూ ఉంటే ఇందులోని ప్రోబయాటిక్ బ్యాక్టీరియా రక్తపోటును చాలావరకు నివారిస్తుంది. ఫలితంగా గుండెజబ్బులూ, పక్షవాతం ప్రమాదాలూ చాలావరకు నివారించుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment