ఇంట్లో బార్లీ ఉడికితే.. ఆరోగ్యమే..!
తిండి గోల
బి.పి నియంత్రణలో ఉండాలన్నా, కిడ్నీలో రాళ్లు కరగాలన్నా, మూత్రం సాఫీగా అవ్వాలన్నా... బార్లీ నీళ్లు తాగమని వైద్యులు సూచిస్తుంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే బార్లీ ఇంట ఉండాల్సిందే అనిపించేంతటి ఘన చరిత్రను బార్లీ సొంతం చేసుకుంది. ఇంచుమించు గోధుమల్లాగే కనిపించే బార్లీకి 13 వేల ఏళ్ల ఘనచరిత్ర ఉంది. అయితే, ముందుగా ఈ గింజను వంటకాలలో వాడింది మాత్రం టిబెటెన్లు. అటు తర్వాత మధ్య యూరప్‌కి ఈ పంట పాకింది. ఆఫ్రికన్లు కూడా బార్లీ పంటను విస్తృతంగా సాగుచేస్తున్నారు. బార్లీ గింజకు ఉండే గట్టిదనం వల్ల పై పొట్టు అంత సులువుగా రాదు.
దీంతో దీనిని ముత్యంతో పోల్చారు విదేశీయులు. జపాన్ నూడుల్స్‌లోనూ, రష్యా వంటకాలలోనూ, మద్యపానీయాల తయారీలోనూ బార్లీ గింజలను విరివిగా ఉపయోగిస్తుంటారు. బార్లీ పంట వర్షాభావ పరిస్థితులను తట్టుకొని పెరుగుతుంది. రసాయనాల వాడకం ఉండదు. పొట్టుతోనూ, పొట్టు తీసినవి, పిండి, ఫ్లాక్స్‌గానూ బార్లీ మనకు అందుబాటులోకి వచ్చింది. ఉడకడానికి ఎక్కువ సమయం పట్టే బార్లీలో పీచుతో పాటు పోషకవిలువలు సమృద్ధిగా ఉన్నాయి. అన్ని ఔషధ గుణాలు ఉన్నాయి