
నా వయస్సు 66 ఏళ్లు. నాకు గత పదిహేనేళ్లుగా షుగర్, బీపీతో బాధపడుతున్నాను. ఈమధ్య నా ముఖం బాగా ఉబ్బింది. పొట్ట నొప్పి కూడా వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే పరీక్షలు చేసి మూత్రపిండాల్లో సమస్య ఉందన్నారు. కిడ్నీలు ముప్ఫయి శాతం దెబ్బతిన్నాయని చెప్పారు. నష్టపోయిన దాన్ని మళ్లీ బాగు చేయలేమని కూడా చెప్పారు. నాకు వచ్చిన సమస్య ఏమిటి? నా మూత్రపిండాలు మిగతా 70 శాతం చెడిపోకుండా ఉండాలంటే నేనేం చేయాలి.
షుగర్, బీపీ... ఈ రెండు సమస్యలు ఉన్నవారిలో చాలామందికి కొంతకాలం తర్వాత మూత్రపిండాలపై వాటి దుష్ప్రభావం పడి అవి దెబ్బతినడం చాలా సాధారణంగా కనిపిస్తుంది. అందువల్లనే బీపీ, షుగర్... ఈ రెండూ ఉన్నవారు ఏడాదికి ఒక్కసారైనా వాటికి సంబంధించిన పరీక్షలు చేయించుకొని చికిత్సలో తగు మార్పులు (అంటే... మందులు, వాటి మోతాదుల్లో మార్పులు) చేయించుకోవాల్సి ఉంటుంది. బహుశా మీరు ఈ పరీక్షలు తరచూ చేయించకపోవడం వల్లనో లేదా మీకు ఈ సమస్యల దుష్ప్రభావాల ఫలితాలపై అవగాహన లేకపోవడం వల్లనో ఇప్పటికే ముప్పయి శాతం డ్యామేజీ జరిగిపోయి ఉంవడచ్చు. ఇప్పుడు బాగా ఉన్న మిగతా 70 శాతం చెడిపోకుండా ఉండాలంటే మీరు మీ బీపీ, షుగర్‌లను ఎపుపడూ అదుపులో పెట్టుకోవడం అవసరం. అందుకోసం వైద్యులను తరచూ సంప్రదిస్తూ క్రమం తప్పకుండా పీరియాడికల్ చెక్–అప్ చేయించుకోవడం అవసరం. ఇలా రెగ్యులర్‌గా పరీక్షలు చేయించుకుంటే ఆరోగ్యాన్ని బాగా కాపాడుకుని మరింత నష్టం జరగకుండా చూసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment