న్యూఢిల్లీ: బంగాళాఖాతంలోని ‘ఎన్‌ఈసీ(నార్త్ ఈస్ట్ కోస్ట్)– 25’ చమురు క్షేత్రంలో నికో రిసోర్సెస్ సంస్థకున్న వాటాను రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్), బ్రిటిష్ పెట్రోలియం(బీపీ)లు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనిలో నికో రిసోర్సెస్‌కు 10 శాతం వాటా ఉంది.
ఈ విషయాన్ని తన క్యూ3 ఫలితాల వెల్లడి సందర్బంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలియజేసింది. ఈ చమురు క్షేత్రంలో ప్రస్తుతం ఆర్‌ఐఎల్‌కు 60 శాతం, బీపీ పీఎల్‌సీకి 30 శాతం చొప్పున వాటాలున్నాయి. ఈ వాటాల నిష్పత్తి ఆధారంగా నికో 10 శాతం వాటాను ఈ రెండు కంపెనీలు కొనుగోలు చేస్తాయి.
ఈ చమురు క్షేత్రంలో 1.032 ట్రిలియన్ ఘనపుటడుగుల నిక్షేపాలున్నాయని అంచనా. కెనడాకు చెందిన నికో కంపెనీ నగదు సమస్యలతో సతమతమవుతోంది. అందుకే ఎన్‌ఈసీ–25లో వాటాను విక్రయిస్తోంది. కేజీ బేసిన్‌లో తనకున్న 10 శాతం వాటాను కూడా విక్రయానికి పెట్టింది. అయితే ఇంత వరకూ సరైన కొనుగోలుదారు దొరకలేదు.
Comments
Please login to add a commentAdd a comment