న్యూఢిల్లీ: వచ్చే నెలలో భారీ ఆరోగ్య పథకాన్ని ప్రారంభించనుంది. అంటువ్యాధులు కాని ఐదు ఉమ్మడి వ్యాధుల నియంత్రణకు సంబంధించి ఓ భారీ ఆరోగ్య పథకాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేయనుంది. ఇందులో భాగంగా మొదటి దశలో మార్చి 31 లోగా దేశవ్యాప్తంగా వంద జిల్లాల్లో వెయ్యి ఆరోగ్య ఉపకేంద్రాల్లో ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఐదు ఉమ్మడి వ్యాధుల్లో అధిక రక్తపోటు, మధుమేహం, నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ వ్యాధులకు పరీక్షలు నిర్వహించనున్నారు.
జాతీయ ఆరోగ్య పథకం కింద జనాభా ఆధారంగా వ్యాధి నివారణ, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వ్యాధి నియంత్రణ చర్యలను తీసుకుంటున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పథకాన్ని వచ్చే నెల 4 తేదీన కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ప్రారంభించే అవకాశాలున్నాయి. ప్రపంచ ఆర్థిక వేదిక నివేదిక ప్రకారం 2012 నుంచి 2030 వరకు ఈ ఐదు రోగాలకు భారత్ రూ. 311.94 లక్షల కోట్ల వ్యయాన్ని కోల్పోనుంది.
త్వరలో భారీ ఆరోగ్య పథకం
Published Sun, Jan 22 2017 7:45 PM | Last Updated on Tue, Sep 5 2017 1:51 AM
Advertisement
Advertisement