కర్లీ హెయిర్ అందమే వేరు. ఒక్కోసారి అది పొల్యూషన్ వల్లో మరే ఇతర కారణాల వల్లనో నిర్వీర్యంగా అయిపోతుంది. దువ్వినా దువ్వనట్లుగా చిందరవందరగా ఉంటుంది జుట్టు. వెంట్రుకలు రఫ్‌గా మారిపోయి చిక్కులు పడిపోతూ చాలా చిరాగ్గా అనిపిస్తుంది. అదీగాక కొందరికి స్ట్రయిట్‌గా కుచ్చుకుచ్చులుగా జాలు వారుతున్న జుట్టునే ఇష్టపడుతుంటారు. అందరూ సెలూన్‌కి వెళ్లి డబ్బులు పెట్టి మరి చేయించుకోవడం కుదరదు. ఒకవేళ చేయించినా మెయింటేన్ చేయించడం ఇబ్బంది. మళ్లీ మళ్లీ సెలూన్‌కి వెళ్తూ వారి చెప్పిన సెషన్‌లలో చేయించుకోవాల్సి కూడా ఉంటుంది. వాటన్నింటికి చెక్ పెట్టి జస్ట్ ఇంట్లో మనకు అందుబాటులో ఉండే వాటితోనే ప్యాక్‌లు వేసుకుంటే ఈజీగా జుట్టు స్ట్రయిట్ అవ్వడమే గాక జుట్టుకి మంచి గ్రోత్ ఉండి కనీసం జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.
నేచురల్‌గా చేసుకునే హోం ప్యాక్‌లు ఏంటంటే..
- మనం ఇంట్లో ఉపయోగించే పాలే తీసుకోండి. జస్ల్ ఒక కప్పు పాలు ఓ గుడ్డు తీసుకోండి. మీ జుట్లు బాగా పొడవైతే ఇంకో కప్పు పాగు, మరో గుడ్డు తీసుకోండి. ఇక ఈ రెండిటిని బాగా మిక్స్ అయ్యేలా కలిపిం బ్రెష్‌తో జుట్టుకి ప్యాక్ వేసుకోండి. ఓ అరంగంట తర్వాతా మీకు నచ్చిన షాంపుతో కడిగేయండి. మీరే ఆశ్చర్యపోతారు ఎంత సిల్కిగా జాలు వారుతుంటుందో మీ జుట్టు.
- కలబంద గుజ్జు జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుందని తెలిసిన విషయమే మీరు అరకప్పు కలబందను, అరకప్పు కొబ్బరి నూనెతో మిక్స్ చేసి గంటపాటు అలానే ఉంచి షాంపుతో కడిగేయండి. చిట్లిన జుట్టు సమస్య తగ్గడమే గాక స్ట్రయిట్ అవుతుంది.
- మరొకటి యాపిల్ సైడర్ వెనిగర్ సహజమైన క్లెన్సర్ అని పిలుస్తారు. జుట్టుకి అప్లై చేస్తే అది మురికిని పోగొట్టడమే కాకుండా జుట్టుని మృదువుగా చేస్తుంది. మూడు టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్‌ను రెండు కప్పుల నీటిలో కలపండి. ముందుగా మీ జుట్టుని షాంపుతో కడిగేసుకున్నాక ఈ మిశ్రమాన్ని అప్లే చేసి రెండు మూడు నిమిషాలు ఉంచి ఆ తర్వాత కడిగేసుకుండి. ఇలా తరుచుగా చేస్తే త్వరితగతిన మీ జుట్టు స్ట్రెయిట్ అవుతుంది.
- మొక్కజొన్న పిండి, కొబ్బరి పాల మిశ్రమాన్ని జుట్టుకి ప్యాక్‌లా వేసిన స్ట్రయిట్‌గా అవుతుంది.
ఇవన్నీ వద్దు అంటే ఈ ప్యాక్‌ని ట్రై చేయండి ఇది జుట్టు ఆరోగ్యంగా ఉంచడమే గాక చక్కగా స్ట్రయిట్ అవ్వుతుంది. అప్పటికప్పుడూ పార్టీల సమయంలో మీ జుట్టు స్ట్రయిట్ అవ్వడానికి ఈ ప్యాక్ బాగా పనిచేస్తుంది.
ముందుగా ఈ ప్యాక్‌కి కావాల్సినవి:
బియ్యం ఒక కప్పు
కొబ్బరి ముక్కలు పావు కప్పు
నీరు కప్పు
నానబెట్టిన మెంతులు 3 చెంచాలు
అలోవేరా జెల్ కొద్దిగా
ఆలివ్ ఆయిల్ ఓ చెంచా
తయారీ విధానం:
ముందుగా ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్లు పోసి నానబెట్టండి. ఆ తర్వాత ఆ బియ్యాన్ని కడగకుండా అలానే ఉడికించండి. ఆ తర్వాత మిక్సి జార్‌లోకో ఉడికించిన బియ్యం, కొబ్బరిముక్కలు, అలోవేరా జెల్ వేసి మిక్సీ పట్టుకోండి. మెత్తటి పేస్ట్‌లా ఉండాలి. ఆ తర్వాత ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలిపి జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి.. ఓ గంట పాటు ఉంచుకోండి. ఆ తర్వాత జుట్టుని మైల్డ్ షాంపుతో కడిగేయండి. ఆరిన తర్వాత చూస్తే జుట్టు స్ట్రైయిట్‌గా కుచ్చులా ఉంటుంది. ఇలా రెగ్యూలర్‌గా చేస్తే మాత్రం జుట్టు స్ట్రెయిట్ అయ్యి, ధృఢంగా ఉంటుంది.
(చదవండి: ఏజెంట్ బ్యూటీ ధరించిన డ్రస్ ధర వింటే షాక్ అవ్వాల్సిందే!)
Comments
Please login to add a commentAdd a comment