మన ఇంట్లో ఉండే వాటితోటే చక్కటి మేని సౌందర్యాన్ని, కురులు అందాన్ని పెంపొందించుకోవచ్చు. వాటి ముందు మార్కెట్‌లో దొరికే ఉత్పత్తులు కూడా పనికిరావనే చెప్పాలి. కాస్త ఓపికతో చేసుకుంటే ఇంట్లో వంటి వాటితోటే సహజ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. ఆ ఇంటి చిట్కాలు ఏంటో చూద్దాం!
అందులో ముందుగా మనం జ్యూస్‌గానూ, కూరగాను ఉపయోగించే కాయగూర అయిన బీట్‌రూట్ ముఖ్య సౌందర్యానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. బీట్‌రూట్‌లో ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల చర్మానికి మంచి ప్రయోజనాలు ఉన్నాయి. అందం దృష్ట్యా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల మంచి యాంజీ ఏజింగ్‌గా ఉంటుంది. ఇది మచ్చలను తగ్గించడంలో సహయపడుతుంది కూడా చర్మానికి రోజీ గ్లో ఇస్తుంది. మెరిసే మేని కాంతి కోసం బీట్‌రూట్‌ని ఎలా ఉపయోగించాలో చూద్దాం!
తొక్కతీసిన అరకప్పు బీట్‌రూట్ ముక్కలను గిన్నెలో వేసి అరగ్లాసు నీళ్లుపోసి ఐదు నిమిషాలు ఉడికించాలి. తరువాత స్టవ్ ఆపేసి బీట్‌రూట్ ముక్కల్లో టీస్పూను సోంపు వేసి పదినిమిషాలు నానబెట్టాలి. పదినిమిషాల తరువాత బీట్‌రూట్ ముక్కల్లో ఉన్న నీటిని వడగట్టి తీసుకోవాలి. ఈనీటిలో టీస్పూను రోజ్ వాటర్, రెండు టీస్పూన్ల అలోవెరా జెల్ వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని గాజు సీసాలో వేసి రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసుకోవాలి. వారం రోజులపాటు నిల్వ ఉండే ఈ క్రీమ్‌ను రోజూ ఉదయం పూట రాసుకుంటే.. ముఖం మీద మచ్చలు, ముడతలు, డార్క్ సర్కిల్స్ తగ్గుముఖం పట్టి ప్రకాశవంతముగా కనిపిస్తుంది.
యాపిల్ సైడర్ వెనిగర్‌లో కొద్దిగా నీళ్లు కలిపి, తలస్నానం చేసిన జుట్టుకు కుదళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల తల స్నానం చేసిన తరువాత కూడా జుట్టుకు పట్టి ఉండే జిడ్డు వదులుతుంది. వారానికి ఒకసారి ఇలా చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment