పీరియడ్స్‌లో భరించలేని నొప్పా? ఇవిగో చిట్కాలు | Home Remedies and Options to Help with Period Cramps | Sakshi
Sakshi News home page

పీరియడ్స్‌లో భరించలేని నొప్పా? ఇవిగో చిట్కాలు

Published Sat, Jul 13 2024 3:41 PM | Last Updated on Sat, Jul 13 2024 3:41 PM

Home Remedies and Options to Help with Period Cramps

మహిళలు, యువతులు నెలసరి లేదా పీరియడ్‌ సమయంలో విపరీతమైన నొప్పితో అల్లాడిపోతూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఆ నాలుగు రోజులు వారికి నరకం కింద లెక్కే. రక్తస్రావంకూడా ఎక్కువగానే ఉంటుంది. నొప్పి భరించలేక, ఏమీ తినలేక, నానాయాతన పడుతుంటారు. మరి కొంతమందికి నొప్పితోపాటు తిమ్మిర్లు, కళ్లు తిరగడం లాంటి లక్షణాలు కూడా ఉంటాయి. అయితే పీరియడ్‌కి ముందు కొన్ని వ్యాయామాలు, ఆహారంలో మార్పులతో ఈ పెయిన్‌నుంచి కొంత వరకు ఉపశమనం లభిస్తుంది అంటున్నారు నిపుణులు అవేంటో చూద్దామా.

నెలసరి సమయంలో వచ్చే నొప్పి, అసౌకర్యాన్ని నివారించేందుకు కొన్ని సాధారణ మందులతో పాటు, కొన్ని హోం రెమిడీస్‌ కూడా బాగా పనిచేస్తాయి. అలాగే గైనకాలజిస్ట్‌ సలహా మేరకు కొన్ని నొప్పి నివారణ మందులు కూడా తీసుకోవచ్చు.

అల్లం: పీరియడ్ క్రాంప్స్‌కు అల్లం బెస్ట్‌ ఆప్షన్‌. అల్లంలో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కడుపులో ఇబ్బందిని తగ్గిస్తాయి. గోరువెచ్చని నీటిలో అల్లం రసం, కొద్దిగా  తేనె కలుపుకుని ఉదయాన్నే తాగొచ్చు.

పసుపు: పసుపులో ఉండే కర్కుమిన్ అనే సహజ రసాయనం ఈ బాధల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పీరియడ్స్‌కు 7 రోజుల ముందు ,3 రోజుల తర్వాత ఒక కర్కుమిన్ క్యాప్సూల్‌ను తీసుకోవడం మంచిదని ఒక అధ్యయనంలో తేలింది. మహిళల్లో విటమిన్ డి స్థాయిలను పెంచడానికి కర్కుమిన్ సహాయపడుతుంది. 

సోంపు: కాసిన్ని సోంపు గింజల్ని తిన్నా, లేదా వాటిని నీటిలో మరిగించి, ఆ నీటిని తాగొచ్చు. 

మొత్తం ఆహారాన్ని మానివేయడం కాకుండా, తేలిగ్గా జీర్ణమయ్యే ఆహరం తీసుకోవాలి.పండ్లు, ఆకుకూరల తోపాటు ముఖ్యంగా మెగ్నీషియం అధికంగా ఉండే నట్స్, బీన్స్ వంటివి ఎక్కువగా తినాలి. ఉప్పు, కారం, షుగర్, మద్యం, కార్బోనేటేడ్ పానీయాలు, కాఫీలకు దూరంగా ఉంటే మంచిది.

ఉపశమనం
పొత్తికడుపుమీద వేడినీటితో లేదా హీటింగ్ ప్యాడ్‌తో కాపడం పెట్టుకుంటే కండరాలు వదులై నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. మసాజ్‌ థెరపీ కూడా బాగా పనిచేస్తుంది. అలాగే  కొన్ని రకాల యోగాసనాలను అలవాటు చేసుకుంటే ఫలితముంటుంది. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement