డార్క్‌ సర్కిల్స్‌తో బాధపడుతున్నారా? ఈ బ్యూటీ టూల్‌ ఉంటే చాలు | Dark Circles Can Be Removed With This Tool | Sakshi
Sakshi News home page

డార్క్‌ సర్కిల్స్‌తో బాధపడుతున్నారా? ఈ బ్యూటీ టూల్‌ ఉంటే చాలు

Published Tue, Oct 10 2023 3:10 PM | Last Updated on Tue, Oct 10 2023 4:19 PM

Dark Circles Can Be Removed With This Tool - Sakshi

ముఖంలో కళ్లు ఎంత ప్రత్యేకమో అంతే సున్నితం. కళ్ల విషయంలో ఎప్పటికప్పుడు సురక్షితమైన జాగ్రత్తలు తప్పనిసరి. పైగా కళ్ల చుట్టూ నల్లటి వలయాలు, మచ్చలు ముడతలు వంటి సమస్యలను దూరం చేయాలంటే.. ఇక్కడ కనిపిస్తున్న మసాజర్‌ని వెంట ఉంచుకోవాల్సిందే.ఈ మాన్యువల్‌ ఐ అండ్‌ ఫేస్‌ మసాజర్‌.. కళ్లకు సంబంధించి పర్ఫెక్ట్‌ బ్యూటీ టూల్‌ అని చెప్పుకోవచ్చు. ముఖానికి కూడా చక్కటి మసాజ్‌ని అందిస్తుంది.

ఇది ఐ బ్యాగ్స్‌ని దూరం చేయడంతో పాటు డార్క్‌ సర్కిల్స్‌ని తొలగించి కళ్లను, ముఖాన్ని అందంగా మారుస్తుంది.మసాజర్‌లోని బాల్‌ 360 డిగ్రీలు తిరుగుతూ సరికొత్త యవ్వనాన్ని అందిస్తుంది. కంటి చుట్టూ సున్నితంగా మసాజ్‌ చేస్తూ ముఖ కండరాలను రిలాక్స్‌ చేస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. నుదుటి మీద ఏర్పడే ముడతలను దూరం చేయడంతో పాటు.. పెదవులు, బుగ్గల మధ్య ఏర్పడే సన్నటి గీతలను పోగొడుతుంది.

దీని ఎర్గోనామిక్‌ నాన్‌ – స్లిప్‌ హ్యాండిల్‌.. కాంపాక్ట్‌ డిజైన్‌ తో, స్కిన్‌  ఫ్రెండ్లీ టచ్‌తో.. ఏ వేళలోనైనా ఎక్కడైనా వినియోగించడానికి.. చాలా సులభంగా ఉంటుంది. ఈ టూల్‌ ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లగలిగేంత చిన్నది. తేలికైనది కూడా. ఇది చిన్న హ్యాండ్‌ బ్యాగ్‌లో లేదా కాస్మెటిక్‌ బ్యాగ్‌లో చక్కగా సరిపోతుంది. మెరుగైన ఫలితాలను పొందడానికి దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించాలి. ధర 199 డాలర్లు. అంటే 16,251 రూపాయలు. దీన్ని ప్రియమైన వారికి బహుమతిగానూ ఇవ్వచ్చు! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement