Blackness
-
డార్క్ సర్కిల్స్‌తో బాధపడుతున్నారా? ఈ బ్యూటీ టూల్ ఉంటే చాలు
ముఖంలో కళ్లు ఎంత ప్రత్యేకమో అంతే సున్నితం. కళ్ల విషయంలో ఎప్పటికప్పుడు సురక్షితమైన జాగ్రత్తలు తప్పనిసరి. పైగా కళ్ల చుట్టూ నల్లటి వలయాలు, మచ్చలు ముడతలు వంటి సమస్యలను దూరం చేయాలంటే.. ఇక్కడ కనిపిస్తున్న మసాజర్‌ని వెంట ఉంచుకోవాల్సిందే.ఈ మాన్యువల్ ఐ అండ్ ఫేస్ మసాజర్.. కళ్లకు సంబంధించి పర్ఫెక్ట్ బ్యూటీ టూల్ అని చెప్పుకోవచ్చు. ముఖానికి కూడా చక్కటి మసాజ్‌ని అందిస్తుంది. ఇది ఐ బ్యాగ్స్‌ని దూరం చేయడంతో పాటు డార్క్ సర్కిల్స్‌ని తొలగించి కళ్లను, ముఖాన్ని అందంగా మారుస్తుంది.మసాజర్లోని బాల్ 360 డిగ్రీలు తిరుగుతూ సరికొత్త యవ్వనాన్ని అందిస్తుంది. కంటి చుట్టూ సున్నితంగా మసాజ్ చేస్తూ ముఖ కండరాలను రిలాక్స్ చేస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. నుదుటి మీద ఏర్పడే ముడతలను దూరం చేయడంతో పాటు.. పెదవులు, బుగ్గల మధ్య ఏర్పడే సన్నటి గీతలను పోగొడుతుంది. దీని ఎర్గోనామిక్ నాన్ – స్లిప్ హ్యాండిల్.. కాంపాక్ట్ డిజైన్ తో, స్కిన్ ఫ్రెండ్లీ టచ్‌తో.. ఏ వేళలోనైనా ఎక్కడైనా వినియోగించడానికి.. చాలా సులభంగా ఉంటుంది. ఈ టూల్ ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లగలిగేంత చిన్నది. తేలికైనది కూడా. ఇది చిన్న హ్యాండ్ బ్యాగ్‌లో లేదా కాస్మెటిక్ బ్యాగ్‌లో చక్కగా సరిపోతుంది. మెరుగైన ఫలితాలను పొందడానికి దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించాలి. ధర 199 డాలర్లు. అంటే 16,251 రూపాయలు. దీన్ని ప్రియమైన వారికి బహుమతిగానూ ఇవ్వచ్చు! -
దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ
నోట్లరద్దు ప్రభుత్వ వైఫల్యమన్న ఆజాద్ ► రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో చర్చ న్యూఢిల్లీ: నల్లధనంపై పోరాటం కోసం కేంద్రం తీసుకున్న నోట్లరద్దు నిర్ణయం పూర్తి వైఫల్యమని, దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి కొనసాగుతోందని రాజ్యసభలో విపక్షాలు విమర్శించాయి. గురువారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో విపక్ష నేత గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ.. ‘రాష్ట్రపతి నోట్లరద్దును మెచ్చుకున్నారు. కానీ.. దేశంలో అవినీతి, నల్లధనం, ఉగ్రవాదాన్ని ఆపటంలో కేంద్రం పూర్తిగా విఫలమైంది. మోదీ సర్కారు దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితిని విధించింది. 2016 సంవత్సరం ప్రజలకు మానసిక ఒత్తిడిని, మాంద్యాన్ని, వెనుకబాటుతనాన్ని, కుంగుబాటును మిగిల్చింది’ అని విమర్శించారు. నోట్లరద్దు అమలుకోసం 135 సర్క్యులర్లు విడుదల చేసినా.. ఇబ్బందులు పడ్డ ప్రజలకు ఉపశమనం కలిగించేలా మోదీ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ‘నవంబర్ 8న మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయంతో 42 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇదేనా రైతు సంక్షేమమంటే?’ అని ఆజాద్ ప్రశ్నించారు. ‘మేం సర్జికల్ దాడులను సమర్థిస్తాం. ప్రభుత్వం మరిన్ని సర్జికల్ దాడులు చేసినా మా మద్దతుంటుంది. కానీ ఈ దాడుల్లో ఎంతమంది పోయారని ప్రశ్నిస్తే మమ్మల్ని దేశద్రోహులంటున్నారు’ అని తెలిపారు. అటు సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్‌తోపాటు పలు పక్షాలు కూడా నోట్లరద్దు విషయంలో ప్రభుత్వ తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డాయి. అంతకుముందు న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. యూపీఏ అవినీతినుంచి భారత్ రూపాంతరం చెందుతోందన్నారు.