శీతాకాలపు గాలులు,మండే ఎండలు మన చర్మ కాంతిని పాడు చేస్తాయి. జీవరహితంగా తయారు కావడం, పొడిబారడం, ముఖంపై మొటిమలు అబ్బో.. ఈ సమస్యలు లిస్ట్ చాంతాండంత. అందుకే మాయిశ్చరైజర్లు , క్రీమ్‌లను ఆశ్రయిస్తారు చాలామంది. అలా కాకుండా ఏ కాలంలో అయినా, ఎలాంటి వాతావరణంలో అయినా సహజంగా మెరిసే చర్మాన్ని పొందడం ఎలాగో తెలుసా?
కొబ్బరి నూనె.. బ్రౌన్ షుగర్
పొడిబారిన, నిస్తేజంగా ఉన్న చర్మానికి కొబ్బరి నూనె ఔషధంలా పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని కొబ్బరి నూనెను ముఖానికి, మెడకు రాసి, వేళ్లతో వలయాకారంలో మసాజ్ చేయాలి. మరుసటి రోజు ఉదయం ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండుసార్లు నూనెలో కొద్దిగా బ్రౌన్ షుగర్ వేసి, కలిపి, ముఖానికి అప్లై చేయాలి. దీని వల్ల నిస్తేజంగా ఉన్న చర్మం కాంతిమంతం అవుతుంది.
అలోవెరా
చర్మకాంతికి మహత్తరంగా పనిచేసే జాబితాలో మొదటి వరసలో ఉంటుంది అలోవెరా. ముడతల నివారణకు పనిచేస్తుంది. అలొవెరా ఆకునుంచి తీసిన జెల్‌ను ముఖానికి, మేనికి పట్టించి 20 నిమిషాల తర్వాత వేడినీటితో కడిగితే ΄÷డిబారడం సమస్య దరిచేరదు.
పాలు
నిస్తేజంగా ఉన్న చర్మానికి పాలు మెరుపును తీసుకువస్తాయి. దూదిని పాలలో ముంచి, ముఖానికి, మెడకు రాసి, ఆరిన తర్వాత కడిగేయాలి. ΄ాలు, తెనె, శనగపిండి కలిపి ముఖానికి ప్యాక్ వేసుకొని 20 నిమిషాలు తర్వాత శుభ్రపరుచుకుంటే చర్మకాంతి మెరగవుతుంది.
తేనె
తేనెలో ఔషధ గుణాలు ఎక్కువ. పొడి చర్మ సమస్యకు నివారిణిగా పనిచేస్తుంది. వేళ్లతో తేనెను అద్దుకొని, ముఖానికి రాసుకొని, మృదువుగా మసాజ్ చేసి ఐదు నిమిషాలు వదిలేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి.
బొప్పాయి
మృతకణాలను తొలగించడంలో బొప్పాయి ఎంతగానో సహాపడుతుంది. బొప్పాయి పండు చిన్న ముక్కను గుజ్జు చేయాలి. దీంతో తేనె వేసి కలిపి, ముఖానికి అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి.
నీళ్లు
ప్రతి రోజూ 8–10 గ్లాసుల నీళ్లు తాగుతుంటే చర్మంలో ఉండే హానికారకాలు తొలగిపోయి తాజాదనం లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment