ఎన్నికల వేళ ఏపీలో గూగుల్ హీరో ఎవరు?
ఎన్నికల వేళ మన రాష్ట్రంలో గూగుల్ హీరో ఎవరు? ఎవరి పేరును నెటిజన్లు పదేపదే గూగుల్ చేసి వివరాలు, విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు? రాష్ట్ర రాజకీయుల్లో గూగుల్ రాజెవరు? తరాజెవరు? గత 90 రోజుల గూగుల్ సెర్చి పోకడలను గమనిస్తే టాప్ ఆఫ్ ది చార్ట్ లో ఉన్నది వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. మన రాష్ట్రంలో నెటిజన్లు నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ లాంటి జాతీయ నేతలకు దీటుగా జగన్ మోహన్ రెడ్డిని సెర్చి చేస్తున్నారని గూగుల్ అధ్యయనంలో వెల్లడైంది. ఎన్నికల వేళ యువతరం ఎవరిని ఆశాజ్యోతిగా చూస్తోంది? ఎవరి పట్ల ఆసక్తి చూపుతోంది అన్నది ఈ సర్వే చెబుతోంది.
తమాషా ఏమిటంటే టీఆర్ఎస్ నేత కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు ఈ జాబితాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కన్నా చాలా వెనకబడి ఉన్నారు. ఇంకా ఆసక్తికరమైన అంశం ఏమిటంటే జాతీయ స్థాయి నేతలు నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీలతో సరిసమానంగా జగన్ మోహన్ రెడ్డి కోసం నెటిజెన్లు సెర్చి చేస్తున్నారు.
ఇప్పటికే సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అందరికన్నా ముందుందని సర్వేలు చెబుతున్నాయి. దానికి తోడు సుప్రసిద్ధ ఇంగ్లీష్ దిన పత్రిక ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ కూడా దేశంలోని వంద మంది అత్యంత ప్రబావాత్మక వ్యక్తుల్లో జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో తొలి స్థానంలో, జాతీయ స్థాయిలో 21 వ స్థానంలో ఉన్నట్టు చెప్పింది. జనంలో తిరిగే నేతను జనం నెత్తిన పెట్టుకుంటారనడానికి ఇవే నిదర్శనాలు.