ప్రతీకాత్మక చిత్రం
ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కాంకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు బుధవారం ముంబైలోని 17 చోట్ల సోదాలు నిర్వహించారు. షెల్ కంపెనీలతో సంబంధం ఉన్న నాలుగు బడా సంస్థల కార్యాలయాల్లో కూడా సోదాలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, గీతాంజలి గ్రూప్ అధినేత మెహుల్ చోక్సీలకు 120 షెల్ కంపెనీలతో సంబంధం ఉన్నట్లు సెర్చ్ ఆపరేషన్‌లో బయటపడింది. వీటిలో79 కంపెనీలకు మెహుల్ చోక్సీ, 41 షెల్ కంపెనీలకు నీరవ్ మోదీ యజమానులుగా ఉన్నట్లు తేలింది.
పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి డబ్బులు తీసుకుని ఈ షెల్ కంపెనీలకు తరలించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన నీరమ్ మోదీ, మెహుల్ చోక్సీ, వారి కుటుంబసభ్యులు ఈ సంవత్సరం జనవరి నెలలో దేశం విడిచి పారిపోయిన సంగతి తెల్సిందే. ఈ కేసుతో ప్రత్యక్ష సంబంధం ఉన్న ఇద్దరు మాజీ బ్యాంకు ఉద్యోగులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారిస్తున్నసంగతి తెల్సిందే. ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకునకు రూ.11,300 కోట్ల రుణాలు ఎగవేసి వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ కుంభకోణానికి తెరలేపాడు.
Comments
Please login to add a commentAdd a comment