Published
Thu, Sep 29 2016 11:29 PM
| Last Updated on Mon, Sep 4 2017 3:31 PM
సివిల్ సప్లై గోదాంను తనిఖీ చేసిన పీడీ
రేగిడి : మండలంలోని సివిల్ సప్లై గోదాంను డ్వామా పీడీ ఆర్.కూర్మనాధం ఆకస్మికంగా గురువారం తనిఖీ చేశారు. వాస్తవంగా జాయింట్ కలెక్టర్ గోదాంను పరిశీలించాల్సి ఉన్నప్పటికీ ఆయన లేకపోవడంతో కలెక్టర్ లక్ష్మీనరసింహం ఆదేశాలతో సివిల్ సప్లై గోదాంను తనిఖీలు చేస్తున్నామని కూర్మనాధం విలేకరులకు తెలిపారు. గోదాంలో ఉన్న సరుకులతో పాటు రికార్డులను కూడా పరిశీలించారు. రికార్డులు సక్రమంగా ఉండడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. డిపోలకు సకాలంలో రేషన్ సరుకులు పంపిస్తున్నారా లేదా అని గోదాం అసిస్టెంట్ యర్రాపాత్రుని కన్నబాబును అడిగి తెలుసుకున్నారు. ఈయనతో పాటు డీలర్ల సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎస్.రామమూర్తినాయుడు, అంబళ్ల సత్యంనాయుడు ఉన్నారు.