జమ్ముకశ్మీర్‌లోని బట్టాల్ సెక్టార్‌లోకి చొరబడేందుకు పాక్ ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని భారత ఆర్మీ సిబ్బంది భగ్నం చేసింది. ఈ సందర్భంగా ఓ జవాను తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
ఘటన జరిగిన ప్రాంతంలో దట్టమైన పొగమంచు నెలకొన్న కారణంగా విజిబులిటీ సున్నాగా ఉంది. అటువంటి పరిస్థితిలోనూ ఇండియన్ ఆర్మీ ఎంతో సమర్థవంతంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. జమ్ము ప్రాంతంలో ఇటీవలి కాలంలో ఉగ్రదాడులు పెరుగుతున్నాయి. భారత ఆర్మీ ఎప్పటికప్పుడు ఉగ్రవాదుల చర్యలను తిప్పికొడుతూనే ఉంది. ఈ క్రమంలో ఈరోజు(మంగళవారం) మరోసారి బట్టాల్ ప్రాంతంలో పాక్ ఉగ్రవాదులు చొరబాటుకు యత్నించారు.
తెల్లవారుజామున మూడు గంటలకు ఆర్మీ బృందం ఈ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం కొందరు పాక్ ఉగ్రవాదులు అర్థరాత్రి నుంచి కశ్మీర్‌లో చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. అప్రమత్తమైన భారత ఆర్మీ దళాలు ఉగ్రవాదుల చొరబాటుయత్నాలను భగ్నం చేశాయి.ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ నేపధ్యంలో ఒక సైనికుడు గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment