WhatsApp To Let You Search Hotels, Grocery, Clothing Stores In The App: స్మార్ట్‌ఫోన్ రాకతో పలు విషయాలు మరింత సులువుగా మారాయి. వివిధ యాప్స్ మనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మనకు తెలియని అడ్రస్‌ను, దగ్గరలోని షాపు వివరాలను తెలుసుకోవడానికి గూగుల్ తీసుకొచ్చిన యాప్ గూగుల్ మ్యాప్స్ ఎంతగానో ఉపయోగపడింది. యూజర్లకే కాకుండా ఆయా వాణిజ్య , వర్తక వ్యాపారులకు కూడా గూగుల్ మ్యాప్స్ సహాయపడింది. కాగా గూగుల్ మ్యాప్స్ తరహా ఫీచర్‌ను వాట్సాప్ కూడా త్వరలోనే తెచ్చేందుకు ప్రయత్నాలను చేస్తోంది.
గూగుల్ మ్యాప్స్ తరహాలో వెతికేయెచ్చు..!
మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్, వ్యాపారుల కోసం వాట్సాప్ బిజినెస్ యాప్‌ను తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. వాట్సాప్ బిజినెస్ యాప్‌లో ఇప్పటికే ఎంతో మంది వ్యాపారులు రిజిస్టర్ అయ్యారు. దీంతో రాబోయే రోజుల్లో సమీపంలో ఆయా వ్యాపారుల గురించి తెలియజేసే సెర్చ్ ఆప్షన్‌ను వాట్సాప్‌లో రానుంది.
బిజినెస్ నియర్ బై..!
బ్రెజిల్‌లోని సావో పాలో నగరంలో ఇప్పటికే కొంతమంది వ్యక్తుల కోసం ‘బిజినెస్ నియర్‌బై’ ఫీచర్‌ను వాట్సాప్ విడుదల చేసింది. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. ఇది భవిష్యత్తులో యూజర్ల అందరికీ వచ్చే అవకాశం ఉందని వాట్సాప్ ట్రాకర్, డబ్ల్యూబెటాఇన్ఫో పేర్కొంది. ఈ కొత్త కూల్ ఫీచర్ ఐవోస్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. ఈ ఫీచర్ సహయంతో యూజర్లు దగ్గరలోని హోటళ్లు,కిరాణా, బట్టల దుకాణాలు మొదలైన వాటిని వెతకవచ్చును.
చదవండి: ఇన్‌స్టాగ్రామ్‌లో మరో సరికొత్త ఫీచర్.. హైలెట్స్ ఆఫ్ ది ఇయర్..!
Comments
Please login to add a commentAdd a comment