మనం వెళుతున్న ప్రాంతాలకు రూట్ తెలియకపోతే వెంటనే అప్పటికే అక్కడ ఉంటున్న వారిని లొకేషన్ షేర్ చేయమని అడుగుతూంటాం. వారు వెంటనే వాట్సప్‌లో లొకేషన్ షేర్ చేస్తారు. దాని ఆసరాగా చేసుకుని గమ్యం చేరుతాం. కానీ కొన్నిసార్లు వాట్సప్‌తోపాటు ఇతర లొకేషన్ షేరింగ్ యాప్‌లు పనిచేయకపోతే ఎలా.. అసలు వాట్సప్ వాడని వారు ఎలా వారి లొకేషన్ షేర్ చేయాలి.. అనే అనుమానం వచ్చిందా. అయితే అలాంటి వారికోసం గూగుల్ మనం వెళ్లే రూట్లు, షార్ట్ కట్ మార్గాలను తెలుసుకోవడానికి తన గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
రూట్ మ్యాప్‌పై రియల్ టైం లొకేషన్ షేరింగ్ ఫీచర్‌ను అందిస్తుంది. ఇప్పటివరకు రియల్ టైం లొకేషన్ షేర్ చేయాలంటే తప్పనిసరిగా వాట్సప్ వంటి మరో యాప్ మీద ఆధార పడాల్సిందే. ఇక నుంచి ఇటువంటి ఇబ్బందులకు తెర దించుతూ గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ సాయంతో ఏ ఇతర యాప్స్ లేకుండా కేవలం సాధారణ మెసేజ్‌తో రియల్ టైం లొకేషన్ షేర్ చేయొచ్చు.
ఇదీ చదవండి: మస్క్ చేతికి వొడాఫోన్ ఐడియా..? క్లారిటీ ఇచ్చిన టెలికాం సంస్థ
ఈ ఫీచర్‌ను ఉపయోగించుకునేందుకు గూగుల్ మ్యాప్స్ యాప్‌లో లాగిన్ అవ్వాలి. ఫ్రొఫైల్ అకౌంట్‌పై క్లిక్ చేసి అందులో లొకేషన్ షేరింగ్ ఆప్షన్ ఎంచుకోవాలి. స్క్రీన్‌పై కనిపిస్తున్న న్యూ షేర్‌పై క్లిక్ చేసి సమయాన్ని సెట్ చేసుకోవచ్చు. లేదా ‘అంటిల్ యు టర్న్ దిస్ ఆఫ్’ ఆప్షన్ ఎంచుకొని కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకొని మెసేజ్ పంపించాలి.
Comments
Please login to add a commentAdd a comment