గూగుల్‌ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్‌.. ఇకపై ఆ కష్టం తీరినట్టే.. | Google Maps Will Now Show Live ETA On Lock Screen For Seamless Navigation, Details Inside - Sakshi
Sakshi News home page

గూగుల్‌ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్‌.. ఇకపై ఆ కష్టం తీరినట్టే..

Published Fri, Mar 1 2024 7:57 AM | Last Updated on Sat, Mar 2 2024 10:05 AM

Google Maps Will Now Show Live ETA On Lock Screen - Sakshi

గూగుల్‌ మ్యాప్స్‌ పుణ్యమా అని ఇప్పుడు భూ ప్రపంచం మీద మనకు తెలియని ప్రదేశమంటూ లేకుండా పోయింది. ఫోన్‌ లాక్‌ తీసేశామా... డెస్టినేషన్‌ టైప్‌ చేసి స్టార్‌ నొక్కామా... రయ్యి రయ్యి మంటూ దుసుకెళ్లామా అన్నట్టు ఉంటుంది గూగూల్‌ మ్యాప్స్‌తో వ్యవహారం. బాగానే ఉంది కానీ... నిమిషం తిరిగే సరికి ఫోన్‌ లాక్‌ అయిపోతుంది కదా.. మళ్లీ మ్యాప్స్‌ ఓపెన్‌ చేయాలంటే ఇబ్బందే కదా? అంటున్నారా? ఎస్‌. అది ఇప్పటివరకూ ఉన్న సమస్య. ఇకపై మాత్రం ఉండబోదు. ఎందుకంటే గూగుల్‌ ఈ ఇబ్బందిని తొలగించే ఏర్పాట్లు చేసింది మరి!

గూగుల్‌ మ్యాప్స్‌లో ఇప్పటికే వినియోగదారులకు ఉపయోగపడే అనేక ఫీచర్లను దశలవారీగా ప్రవేశపెడుతూనే ఉంది ఆ కంపెనీ. వాట్సప్ అవసరం లేకుండానే రియల్‌ టైమ్‌ లొకేషన్‌ షేరింగ్‌, ఫ్యూయెల్​ సేవింగ్ వంటి ఫీచర్లను తీసుకొచ్చిన గూగుల్‌ మ్యాప్స్‌.. తాజాగా లాక్‌ స్క్రీన్‌పైనే లొకేషన్‌ కనిపించేలా ఏర్పాట్లు చేసింది.

ఏదైనా ప్రదేశానికి వెళ్లడానికి గూగుల్‌ మ్యాప్స్‌ ఓపెన్‌ చేసి వివరాలను అందిస్తే సమయం, షార్ట్‌కట్‌లు కనిపిస్తాయి. గూగుల్‌ మ్యాప్స్‌ ఓపెన్‌ చేసిన తర్వాత ఫోన్‌ లాక్‌ అయితే తిరిగి లాన్‌ తీసి వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా తీసుకొచ్చిన ఫీచర్‌తో మొబైల్‌ లాక్‌ స్క్రీన్‌పై ఈటీఏ (ఎస్టిమేటెడ్‌ టైమ్‌ ఆఫ్‌ అరైవల్‌), వెళ్లాల్సిన ప్రదేశానికి డైరెక్షన్స్‌ ప్రత్యక్షమవుతాయి. అంటే ఇకపై గూగుల్‌ మ్యాప్స్‌ వినియోగించాలంటే ప్రత్యేకంగా ఫోన్‌ లాక్‌ ఓపెన్‌ చేసి ఉంచాల్సిన అవసరం ఉండదు. అలాగే, ఏదైనా లొకేషన్‌కు సంబంధించిన వివరాలు ఎంటర్‌ చేయగానే.. స్టార్ట్‌ బటన్‌ క్లిక్‌ చేయకుండానే ప్రివ్యూ కనిపిస్తుంది. ఒకవేళ మీరు వేరే రూట్‌లో ప్రయాణిస్తుంటే.. ఆటోమేటిక్‌గా రూట్‌ అప్‌డేట్‌ అవుతుంది. 

ఇదీ చదవండి..పిండం వయసును నిర్ధారించే ఏఐ.. ఎవరు తయారు చేశారంటే..

ఎలా ఎనేబుల్‌ చేసుకోవాలంటే..

  • గూగుల్‌ మ్యాప్స్‌లో గ్లాన్సబుల్‌ ఫీచర్‌ డీఫాల్ట్‌గా ఆఫ్‌లో ఉంటుంది. 
  • యాప్‌ ఓపెన్‌ చేసి పైన కుడివైపు కనిపించే మీ ప్రొఫైల్ ఐకాన్‌పై క్లిక్‌ చేయండి. 
  • అందులో సెట్టింగ్స్‌ను ఎంచుకొని కిందకు స్క్రోల్‌ చేయగానే నావిగేషన్‌ సెట్టింగ్స్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. 
  • కిందకు స్క్రోల్‌ చేస్తే ‘గ్లాన్సబుల్‌ డైరెక్షన్స్‌ వైల్‌ నావిగేటింగ్‌’ ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్‌ చేసుకోవాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement