కరోనా నేపథ్యంలో దాదాపు ఏడు నెలలుగా మూతబడ్డ సినిమా థియేటర్లు అన్‌లాక్ 5.0లో భాగంగా నేడు(అక్టోబర్ 15)న తిరిగి తెరుచుకున్నాయి. కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఢిల్లీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక సహా 15 రాష్ర్టాల్లో సినిమా థియేటర్లు తిరిగి ప్రారంభమయినట్టు సమాచారం. కరోనా నేపథ్యంలో థియేటర్‌లో కొన్ని మార్పులు చేశారు. ప్రేక్షకుడు ఒక సీటు వదిలి మరో సీటు కుర్చునే విధంగా సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. కూల్‌డ్రింక్, పాప్‌కార్న్ వంటి తినే పదార్థాలపై యూవీ కిరణాలతో క్రిమిరహితం చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. థియేటర్ లోపలికి అనుమతించడానికి ముందే ప్రేక్షకుల శరీర ఉష్ణోగ్రత పరీక్షిస్తున్నారు. సాధారణ టెంపరేచర్ ఉంటేనే లోపలికి పంపిస్తున్నారు. ఎప్పటికప్పడు శానిటైజేషన్ చేస్తూ సిబ్బంది తగన ఏర్పాట్లు చేశారు. కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం వారి ఫోన్‌నంబర్లను కూడా నమోదు చేసుకున్నారు. కొత్తగా రిలీజ్ అవుతున్న సినిమాలతో పాటు ఇదివరకే విడుదలైన చిచోరే, కేథర్‌నాథ్, మలంగ్, తప్పడ్ వంటి చిత్రాలను కూడా వేస్తున్నారు. (సినిమా థియేటర్లను ఆదుకోవాలి)
అక్టోబర్ 15 నుంచి దేశంలోని థియేటర్లను ఆయా రాష్ర్ట ప్రభుత్వాల అనుమతితో తెరుచుకోవచ్చని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఛత్తీస్‌గడ్ వంటి రాష్ట్రాల్లో మాత్రం మల్టీపెక్సులు తెరిచేందుకు అక్కడి ప్రభుత్వాలు అనుమతివ్వలేదు. లాక్‌డౌన్ కాలానికి సంబంధించి థియేటర్ విద్యుత్ ఛార్జీలు మాఫీ చేయాలనే డిమాండ్‌తో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ రాష్ర్టాల్లో మాత్రం మల్టీపెక్సులు ఇంకా తెరుచుకోలేదు. దేశ వ్యాప్తంగా 3100 మల్టీపెక్సు థియేటర్లు ఉన్నా ప్రస్తుత కోవిడ్ నేపథ్యంలో కొన్ని థియేటర్లను మాత్రమే తెరిచారు. అంతేకాకుండా షో టైమింగ్‌లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. చాలా థియేటర్లలో మధ్యాహ్నం 12 నుంచి 8 గంటల వరకు మాత్రమే స్ర్కీన్ టైమింగ్ ఉండేలా సరికొత్త నిబంధనలు విధించారు. (సినిమా హాళ్లు తెరవలేం)
Comments
Please login to add a commentAdd a comment